పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అల్లం కథ

అల్లం గురించి మనం ఇప్పడు తెలుసుకుందాం.

gingerవంకరటింకర ‘శొ’

వాని తమ్ముడు ‘అ’

నల్ల గుడ్ల ‘మి’

నాలుగు కాళ్ళ ‘మే’

ఈ పాత కాలం పొడుపు కథ వినే ఉంటారు. ఇందులో మొదటిది 'శాంఠి, రెండోది 'అల్లం, మూడోది 'మిరియాలు', నాల్లోది మేక. అల్లం గురించి మనం ఇప్పడు తెలుసుకుందాం. అల్లం టీ, అల్లం చెట్నీ అల్లం ముక్కలేసిన పెసరటు, అల్లం పలుకులతో చేసిన ఉప్మా ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో పెద్ద లిస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ కలిపి నూరిన ముద్ద ప్రతి కూరలోనూ తగలాల్సిందే. మన వంటకాలలో అల్లం చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. మామూలుగా మనం కూరల్లో మసాల దినుసుగా వాడినప్పటికీ ప్రాచీన కాలం నుంచీ దీనిని మందుగా ఉపయోగిస్తారు. ఇది వాంతులు రాకుండా ఆపుతుంది. అల్లాన్ని చాలా రకాల ఇబ్బందులకు మందుగా నోటి ద్వారా ఆహారంగా ఔషధంగా తీసుకుంటుంటారు. ఈ మధ్య శాస్రవేత్తలు Post operative nausea కు కూడా ఉపయోగ పడుతుందని తేల్చారు. అంతేకాక దీనిని ఎండబెట్టి పొడిగా చేసుకొని కూడా అనేక వ్యాధులకు ఔషధంగా వాడతారు. ఈ జింజర్ పౌడర్ పైమరీ డిస్మెనోరియాకు బాగా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు తేల్చి చెప్పారు. అయితే ఔషధంగా ఎన్నో ఉపయోగాలున్నప్పటికీ వీటికి సైడ్ఎఫెక్స్ ఉంటాయి. దీనిని ఎక్కువగా తీసుకొన్నపుడు కడుపులో మంట మొదలైనవి వస్తాయి.

ఈ అల్లం జింజిబరెసి కుటుంబానికి చెందిన మొక్క ఇది పుష్పించే మొక్క దీని యొక్క శాస్త్రీయనామం 'జింజబర్ అఫిషినాలె'. క్రీ.శ 1వ శతాబ్దంలో ఈ అల్లం యూరప్ కు ఎగుమతి అయ్యేది దీనిని ప్రాకృత భాషలో “Singabera” అనీ సంస్కృతంలో శృంగవేరం" అనీ అంటారు. శృంగం అంటే కొమ్ము వేరా అంటే శరీరం అని అర్థం. దాని ఆకారాన్ని బట్టే దీనికా పేరు వచ్చింది. 14వ శతాబ్దంలో పూర్వపు ఇంగ్లీషు పదమైన జింజిఫర్ నుంచే ఈ జింజర్ అనే పదం వచ్చింది. భారతదేశంలో జన్యు వైవిధ్యమైన అనేక రకాలను సాగుచేస్తున్నారు.

అల్లం చెట్లు మీటరు ఎత్తువరకు పెరుగుతాయి. పసుపుపచ్చని పువ్వులతో ఉంటాయి. మొగ్గలుగా ఉన్నపుడు తెలుపు పింక్ రంగులలో ఉన్నప్పటికీ పూలు మాత్రం పసుపు రంగులోనే పూస్తాయి. వంద గ్రాముల అల్లాన్ని తిన్నట్లయితే 336 కి. కాలరీల శక్తి లభిస్తుంది. ఇందులో 71.62 గ్రాముల కార్బో హైడ్రేట్లు, 8.98 గ్రాముల ప్రోటీన్లు, 14.1 గ్రాముల పైబర్, 3.3 గ్రాముల చక్కెర నిల్వలు, 4.24 గ్రాముల కొవ్వులు లభిస్తాయి.

రచన: -డా. కందేపి రాణి ప్రసాద్, సెల్. 9866160378

3.05511811024
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు