పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆస్ట్రేలియా

ఖండం వెుత్తం న్యూజీలాండ్ మినహాయిస్తే ఒకే దేశంగా ఉన్నదిత ఆస్ట్రేలియా ఖండం,

australiaఒక ఖండము అంటే కొన్ని దేశాల సమూహం ఉంటుంది. కానీ ఖండం వెుత్తం న్యూజీలాండ్ మినహాయిస్తే ఒకే దేశంగా ఉన్నదిత ఆస్ట్రేలియా ఖండం, ఇక్కడ జనావాసం ప్రారంభమై 42 నుంచి 48వేల సంవత్సరాలు అయి ఉంటుంది. ఇన్ని వేల సంత్సరాలుగా అక్కడ నివశించిన ప్రజలది చరిత్రగా నమోదు కాలేదు.. కారణం వాళ్ళు ఆటవిక దశలోనే ఉండిపోవడం.

ఎక్కడ సంపదలుంటే అక్కడ వాలిపోయి అక్కడి సంపదను సొంతం చేసుకునే ఐరోపా వాసులు ఆస్ట్రేలియాలో అడుగు పెట్టినప్పటి నుండే చరిత్రగా చెలామణి అవుతూంది. 1606లో డచ్చినావికుడు 'విల్లెప్ జాన్సన్' ఆ ఖండం పై అడుగు పెట్టాడు. డచ్చివారు దాన్ని 'స్యూ హాలెండ్"గా పిలిచారు. ఆ తరువాత మరి కొందరు వెళ్ళినా అక్కడ నివాసం ఏర్పరుచుకున్నది 1770 లోనే. కానీ బ్రిటన్ తదితర దేశాలు తమ దేశాల్లోని నేరగాళ్ళను అక్కడ వదిలి వేయడానికి ప్రాధాన్యత ఇచ్చాయి. ఆ తరువాత ఇతర పౌరుల వలసలు పెరిగి ఒక దేశంగా తయారయింది. ఐరోపా వాళ్ళు వెళ్ళే నాటికి అక్కడి స్థానిక ప్రజలు 7.5 నుండి 10 లక్షల జనాభా ఉండేవారు. యూరప్ వాళ్ళు ఆదేశానికి మోసుకువెళ్ళిన జబ్బులు సోకి ఆ జనాభా 3 లక్షలకు పడిపోయింది,

ప్రస్తుతం బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. భూగోళం దక్షిణాన హిందూ మహా - సముద్రం, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న అతి పెద్ద ద్వీపం ఆస్ట్రేలియా. దీనికి సమీప దేశాలు ఉత్తరాన “ఇండోనేషియా“, దక్షిణాన “న్యూజీల్యాండ్”, 76 లక్షల 18 వేల చదరపు కిలో మీటర్లు విస్తీర్ణంలో ప్రపంచంలో 6ప పెద్ద దేశం. దీని రాజధాని “కాన్ బెర్రా”. అతి పెద్ద నగరం “సిడ్నీ“ ఆస్ట్రేలియా అంటే వెంటనే “కంగారూ“ గుర్తొస్తుంది. అలాగే వాళ్ళ క్రికెట్ నైపుణ్యం కూడా.

3.00289017341
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు