పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఇంకుడు గుంట

పెరట్లో ఇంకుడు గుంట తయారు చేసుకోవడం ద్వారా మనం భూగర్బ జలాలను వృద్ధిచేయొచ్చు.

aug4ప్రతి ఎండాకాలం మనం ఈ సంవత్సరం ఉన్నతం ఎండలు ఎప్పుడూ లేవు అనుకొంటుంటాం. చెరువుల్లో నదుల్లో నీరు ఎండిపోతుంది. మంచి నీటికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. భూగర్భ జలాలు ఎండిపోయి బావుల్లో, బోర్లో నీళ్ళు ఇంకిపోతాయి. దీనికి మనం అందరం మన ఇంట్లోనే చిన్న ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. దీనినే ఇంకుడు గుంట అంటారు. వానా కాలంలో మనం ఇంటి కప్పు మీద కురిసిన నీరు నీటి పైపుల ద్వారా రోడ్డు మీదకు వదిలే ఏర్పాటు చేసుకుంటాం. వర్షాకాలం ప్రతి ఇంటి మీద నీరు రోడ్డు మీదకు ప్రవహించి రోడ్లన్ని జలమయం అవుతుంటాయి. పైగా రోడ్లను సిమెంటుతో తారుతో వేయడం వల్ల రోడ్డు మీద నీరు భూమి లోకి ఇంక కుండా ఉండిపోతుంది.

మన ఇంటి కప్పు మీది వర్షం నీరు ఒక పివిసి పైపు ద్వారా మన పేరట్లోకి వచ్చే ఏర్పాటు చేసుకొని పెరట్లో ఇంకుడు గుంట తయారుచేసుకోవడం ద్వారా మనం భూగర్బ జలాలను వృద్ధిచేయొచ్చు. దీనిని ఆంగ్లంలో “Rain Water Harvesting” అంటారు.

ఇంకుడు గుంట నాలుగు అడుగుల వెడల్పు నాలుగు అడుగుల పొడవు (చదరం) ఉండేలాగా 8 అడుగుల లోతు తవ్రాలి. అడుగున అర అడుగు ఎత్తు వేయాలి. దాని రెండు అడుగుల ఇసుకతో నింపాలి. అంటే మనం ఆరున్నర అడుగుల వరకు గుంటని రాళ్ళతో ఇసుకతో నింపాలమన్న మాట. మన ఇంటి కప్పు మీది నీరు పివిసి పైపు ద్వారా ఈ గుంటలోకి వచ్చి పడేలా ఏర్పాటు చేయాలి.

వర్షం వచ్చినప్పుడు నీరు ఈ గుంటలోకి చేరి నెమ్మదిగా పిల్టరై భూమిలోకి ఇంకి భూగర్భాన్ని రీచార్జ్ చేస్తుంది. ఇలా అందరూ చేయడం వల్ల మన ఊరి జలవనరులు రీచార్జ్ అవుతాయి. అప్పుడు ఎండాకాలంలో మనకు నీటి ఇక్కట్లు ఉండవు. మనందరం ఇంకుడు గుంట ప్రయోగం చేసి చూద్దామా !

ఆధారం: సి.హెచ్..ఆనంద్

3.00872093023
Veerababu I Jul 16, 2019 05:08 AM

ఇంటిలో వాడుకుంటున్న నీటిని కూడా ఇంకుడుగుంట లోకి పంపొచ్చా..??దానివల్ల నష్టమా..??లాభామా..??

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు