పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఇంట్లో ఈగల మోత

ఈగలు కనిపించేటంత అమాయక ప్రాణులు కాదు.

houseflyశత్రువులను శపించటానికి తెలుగు సుడికారంలో పురుగులు పడి చస్తారు అనే సమాసాన్ని వాడటం కద్దు. గాయాలను శుభ్రం చేయకుండా, కట్టుకట్టకుండా వదిలివేస్తే కొన్ని రోజుల వరకు గాయాలు మానకపోతే ఆ గాయాలలో పురుగులు చేరతాయి. గతంలో ఈ పరిస్ధితి మధుమేహ వ్యాధితో బాధపడే వారిలో జరిగేది. గాయాలలో పురుగులు చేరిన వారి చుట్టూ ఉన్న వాళ్ళేకాదు చేరిన వారి చుట్టూ ఉన్న వాళ్ళేకాదు వారికి వారే అసహ్యించుకునేవారు. నేటికి కొంత మంది నోటి క్యాన్సర్ రోగులలో ఇంటువంటి పరిస్ధితి చూడవచ్చు.

ఇంతకూ ఇవేమీ పురుగులు? ఇవి నిజానికి పురుగులు కాదు. ఇవన్నీ ఈగ గుడ్లలోంచి వచ్చే లార్వాలు. మనిషి పరిసరాల్లో సాధాణంగా కనిపించే ఈగలు, దోమలలో, ఈగలు ప్రమాదకం కాదని, దోమలే చాలా ప్రమాదకారమని మనం భావిస్తుంటాం. కానీ ఈగలు అవి కనిపించేటంత అమాయక ప్రాణులు కాదు. పరిసరాల్లో ముసురుతున్న ఈగలు దోమల లాగా కుట్టి రక్తం పిల్చవు. కాని నోటి నుండి ఆహార పదార్ధాలు అందులో కరిగిన ఆహార పదార్ధాన్ని పిల్చుకుంటుంది. ఈగ సాధారణంగా 4 వారాలు జీవిస్తుంది. లార్వా ఈగగా రూపాంతరం చెందినా తర్వాత రెండు రోజులకే సంగమించి గుడ్లు పెంటగలవు,. ఒక ఆడ ఈగ 500 వరకు గుడ్లు పడితే అక్కడ విడుదల చేయదు. గుడ్లు నుంచి బయటకు వచ్చే లార్వాలు ఎక్కువ దూరం ప్రయనించకుండా వెంటనే ఆహారం అందుబాటులో ఉండే విధంగా నిలువ ఉన్న ఆహార పదార్ధాల పై , చెత్తా చెదారాలలో సేంద్రియ పదార్ధాల పైనా, మానని గాయాల పైన ఎగ తన గుడ్లును నిక్షిప్తంచేస్తుంది. ఈ గుడ్లలోంచి 2-4 రోజుల్లోనే పురుగుల లాంటి సన్నని క్రిములు బయటికి వచ్చి చుట్టూ ఉన్న ఆహారపదార్దాల్ని ఆరగిస్తూ ఉంటాయి. మృతకణాలు, కుళ్ళుతున్న మంసవ్యర్ధాలు, పళ్ళు కూరగాయలు చెత్తలో పడేసిన మిగిలిన ఆహారపదార్ధాలు అన్ని వీటికి యోగ్యమే. గుడ్లలోంచి బయటకు వచ్చిన పురుగులను ఆంగ్లంలో మగ్గాట్స్ (Maggots) అంటారు. ఇవి మృతకణాలను మాత్రమే తిని గాయాలను శుభ్రం చేసినా ఈ దృశ్యం మాత్రం భరించరానిదిగా ఉంటుంది.

housefly2ఈగలు అపరిశుభ్ర వాతావరణానికి మొదటి సంకేతం ఇవి తమ లాలాజలంతో అనేక సూక్ష్మ క్రిములను బయటకు చిమ్మతుంది. వీటి ద్వారానే టైఫాయిడ్, పారాటైఫాయిడ్, కళ్ళకలక (canjunctivitis), ప్రేవులలో పురుగులు (Helminthic Infections) వ్యాపిస్తుంటాయి. ఈగలు గుడ్ల నుంచి ఒకరోజులోనే మగ్గాట్స్ బయటకు వచ్చి 10 రోజుల వరకు అటుఇటు తిరుగుతూ పెరిగి తరువాత 3 నుంచి 6 రోజులో చుట్టూ కవచాన్ని నిర్మించుకుని ప్యూపాదశను గడుపుతాయి. ఆ తరువాత బయటకు వచ్చి ఈగలుగా మారుతాయి. ఈగలుగా మారిన తర్వాత రెండు రోజులకు ఇవి గుడ్డు పెట్టడానికి సిద్ధమవుతాయి. ఈ విధంగా వీటి సంతతి దినదిన ప్రవర్ధమాన మవుతుంటుంది.

ఇళ్ళలో మనుషులు అవాసాల సమీపంలో కనిపించే ఈగలను మస్కడొమేస్టికా అంటారు. ఈగలలో అనేక జాతులున్నాయి. భారతదేశంలో నే 40 రకాలకు పైగా ఈగ జాతులున్నాయి. పశువుల శరీరాల పై వాలే ఈగలు, కళ్ళ దగ్గరే తచ్చాడే ఈగలు ఇలా వాటివాటి నివాసప్రాంతాలు వేరువేరుగా ఉంటాయి. తీపి పదార్ధాలు అమ్మే అంగళ్ళలో. మాసం విక్రయించే ప్రాంతాలు వేరువేరుగా ఉంటాయి. తీపి పదార్ధాలు అమ్మే అంగళ్ళలో మాంసం విక్రయించే ప్రాంతాలలో కనిపించే ఈగలు మన అశుభ్రతకు నిదర్శనాలు. వాడని, పారవేసిన ఆహార పదార్ధాలను మూసి వున్న చెత్తబుట్టలో వేయడం, 24 గంటల్లోనే వాటిని తరలించడం ముఖ్యం. నివాసప్రాంతంలోని చెత్తాచెదారాలు సేకరించి పునరావృత్తి (Recycling) చేయకపోతే అది వ్యాధుల రూపంలో సమాజానికి చాలా నష్టం చేస్తుంది.

ఈగ గుడ్లను కందిరీగాలు ఆరగిస్తాయి. వీటి వల్ల ఈగలు కొంత వరకు నియంత్రించబడుతున్నాయి. వీటిని నియంత్రించటానికి విఫణిలో అనేక క్రిమిసంహారకాలు లభిస్తున్నాయి. లిండెన్, మలాధియాన్, డి.డి.టి.లాంటివి ప్రభావాన్ని చూపించగలిగినా ఇవి దీర్ఘకాలంలో మనుషులు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఇతర మార్గాలలోనే ఈగలను సంహరించాలి. రేస్టారెంట్లలో కనిపించే Pesto - o – flash ఒక మంచి సాధనం ఇందులోని విద్యుత్ వల్ల ఈగలు సంహరించబడతాయి. ఈగలను తగ్గించటానికి ఒక మంచి మార్గం వెల్లులి. ఈ క్రింది ఫార్ములా ప్రకారం ద్రావకాన్ని తయారు చేసి పిచికారీ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది.

90 గ్రాముల వెల్లుల్లిని దంచి డానికి కొంత (10-20 మి.లీ ) వాహనాలలో వాడే 2టి ఆయిల్ నుగానీ,లిక్విడ్ పారఫిన్ ను గాని కలిపి అందులో 15 గ్రాముల సబ్బు (ద్రవ రూపంలో) కలపాలి. ఈ మొత్తాన్ని 500 మి. లీ నీటిలో కలిపి ఈగలు వాలి గుడ్లు పెట్టె ప్రదేశాలలో చల్లాని.ఈ పద్ధతి ద్వారా ఈగల సైన్యాన్ని నియంత్రించి పరిశుభ్రమైన పరిసరాలను నిర్మించుకోవచ్చు.

గ్రామాలలో పట్టణాలలో ఇళ్ళలో, విధులలో చెత్తచెధారాలను , కుళ్ళుని , కుళ్ళే పదార్ధాలను వేరు చేసి వునరావృతి చేయకపోతే అనారోగ్యం ద్వారా మనం అదక మూల్యం చెల్లించుకుంటాం. పరిశుభ్రతకు శాశ్వత పరిష్కారం లభంచే వరకు తాత్కాలిక పద్ధతులనైనా వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

ఆధారం: పి.వి. రంగనాయకులు

2.99696048632
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు