హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / ఇనుప వస్తువులు జింక్ తో పలుచని పూత ద్వారా ఏ చర్య నుండి రక్షింపబడుతాయి?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఇనుప వస్తువులు జింక్ తో పలుచని పూత ద్వారా ఏ చర్య నుండి రక్షింపబడుతాయి?

ఇనుప వస్తువులకు జింక్ పూత పూసినట్టైతే ఇనుము బదలు జింక్ ZnZn2+2e అనే చర్య ద్వారా ఎలక్ట్రాన్లను ఇచ్చి నీరు, ఆక్సీజన్ లు ఎలక్ట్రాన్లు దాహాన్ని తేరుస్తుంది.

అక్సీకరణం (Oxidation), ఎందుకంటే ఇనుప వస్తువులు త్రుప్పు (rust) పట్టడం అంటేనే సున్న ఆక్సీకరణ (Fe) స్థితిలో ఉన్న పరమాణువులు తమ సహజ ప్రవృత్తి ఉష్ణగతిక శాస్త్ర నియమాల (Laws of Thermo Dynamics) కనుగుణంగా, నీరు ఆక్సీజన్ సమక్షంలో పెండు ఎలక్రానులను పోగొట్టుకుని Fe2+ అయానుగా మారుతుంది. Fe→ Fe2+ + 2e. ఇలా ఎలక్ట్రాన్లను పొగొట్టుకునే చర్యను ఆక్సీకరణం అంటారని మీకు తెలుసు. ఇక్కడ విడుదలయిన పెండు ఎలక్ట్రాన్లు సాధారణ వాతావరణ అయాన్లను ఏర్పరుస్తాయి. H2O+0.5o2+2e →2OH. Fe2+ అయాను. OH- అయానుల అయానిక లబ్దము (Ionic Product0 ఇక్కడ Fe (OH)2 లవణపు ద్రావణీసతాబద్దము (Solubility product) కన్నా ఎక్కువగా ఉండటం వల్ల పై రెండు చర్యల్లో ఉత్పన్నమైన . Fe2+, OH- అయాన్లు Fe (OH)2 అనే అవక్షేపంగా మారుతాయి. క్రమేపి ఈ Fe(OH)2 అపక్షేపం మరికొంత ఆక్సీజన్ ను గ్రహించి Fe2O3 గా మారుతుంది. 2Fe(OH)2+0.5O2 గ్రహించి Fe2O3 గా మారుతుంది. 2Fe→(OH)2+0.5O2Fe2O3+2H2O. ఈ Fe2O3 నే త్రుప్పు పట్టడం అంటారు.

అంటే Fe స్థితిలో ఉన్న ఇనుప పరిమాణువులు విద్యుద్రసాయనికి (Electro chemical) మార్గంలో Fe(OH2)గా తర్వాత Fe2O3 గా మారే ప్రక్రియనే మనం ఇనుప వస్తువులు త్రుప్పు పట్టడం అంటాము. అంటే ‘O’ స్థితి నుంచి ఆక్సీకరమ సంఖ్య +2, తర్వాత +3 గా మారింది కాబట్టి త్రుప్పు పట్టే క్రమంలో ఇనుప వస్తువుల లోని ఇనుము ఆక్సీకరణం చెందిందన్నమాట. అయితే ఏవైనా వస్తూవులు లేదా పదార్థాలు లేదా మూలకాల ఆక్సీకరణ సామర్థ్యాన్ని విద్యుద్రసాయనిక పరిభాషలో ఆయా పదార్తాల ఆక్సీడేషన్ పొటెన్షియల్ ఎక్కువ. ఇనుముకు ఈ ఆక్సీడేషన్ పొటెన్షియల్ విలువ సుమారు +0.5V కాగా ఝింకుకు సుమారు ++0.8V ఉంటుంది. కాబట్టి ఇనుప వస్తువులకు జింక్ పూత పూసినట్టైతే ఇనుము బదలు జింక్ ZnZn2+2e అనే చర్య ద్వారా ఎలక్ట్రాన్లను ఇచ్చి నీరు, ఆక్సీజన్ లు ఎలక్ట్రాన్లు దాహాన్ని తేరుస్తుంది. తద్వారా ఇనుప వస్తూవులు త్రుప్పు పట్టకుండా రక్షించబడ్డి. ఈ పద్దతినే శాస్త్రీయంగా ధనదృవ త్యాగ (Sacrificial Anodic) పద్ధతి అంటారు.

3.01153846154
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు