పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఈ మాసంలో పుష్పించే వృక్షం “పొగడ”

చాలా రకాలైన సంస్మృత పేర్లతో ఆకర్షణియమైన పుష్పాలు కలిగిన చెట్టు “పొగడ”.

flowet1మధుగంధం అంటే చాలా సువాసన కాలిగిన పూలు, చిత్రపుష్పా అంటే చాలా కాలం వరకు తాజాగా మంచి వాసన కలిగి ఉండేది. స్దిరపుష్పా అంటే ఎండిన తరువాత కూడా సువాసన కలిగి వుండేది. ఈ విధంగా చాలా రకాలైన సంస్మృత పేర్లతో ఆకర్షణియమైన పుష్పాలు కలిగిన చెట్టు “పొగడ”. శాస్త్రీయంగా మైమొసాప్స్ ఎలంజి (Mimusops eleng) అంటారు. సపోటేసి కుటుంబానికి చెందినది. మైమొసాప్స్ పేరు గ్రీకు బాషనుంది జాతి పేరు ఏలంజి మలయాళం నుండి తీసుకున్నారు. హిందీలో బకుల్, మల్ సారి తెలుగులో పొగడ లేక వకుళము, తమిళంలో మహిల, ఇలంజి, మగిలమ్, ఒరియాలో బౌల, కన్నడంలో పగడ మర, బకుల బెంగాలిలో బాకుల్, గుజారతీలో బోల్ సరి, మరాటిలో బకుల, బర్సోలి, బౌల పంజాబిలో మొల్ సరి, ఉర్దూలోమొల్ సరి అంటారు. ఇంగ్లీషులో Spanish cherry , surinam Medlar అంటారు. ధృడమైన కలప దీనినుండి వస్తుంది కాబట్టి బుల్లెట్ ఉడ్ అని వ్యాపారపరంగా పిలుస్తారు. బర్మా దేశంలో ఖాయ, సింహళలో మహుల లేక ముహువు అని అంటారు.

పొగడ చెట్టు పురాతన సంస్కృట భాషలో , హిందూ మతంలో, ఆయుర్వేదంలో ఒక స్ధిరమైన పాత్ర కలిగి ఉండి స్వర్గంలో పుష్పించే చెట్టుగా మన పురాణాలలోఉంది. శ్రీకృష్ణుడు బృందావనంలో పొగడ చెట్టు క్రింద వేణువు ఉది గోపికలను అలరించేవాడట ! ఉత్తర బారతదేశ హిమాలయ పర్వతాల వద్ద “గంధమాదన” పర్వతం ,పంపా అరణ్యాలలో అశోకవనంలో , సద్యాగిరి అరణ్యాలలో పెరిగేదని వాల్మీకి రామాయణం ఉంది. మహాకవి మహాకవి కాళిదాసు రచించిన రఘువంశం అభిజ్ఞానశాంకుతల  నాటకాలలో కుమార సంభవం, మేఘదూత ఋతుసంహర కావ్యాలలో “కీసర” అనే పేరుతో ఈ చెట్లు గురించి ప్రస్తావన ఉంది. ఈ చెట్టు పుష్పించే పూలు అతి సుందరంగా, చక్కని సువాసన కలిగి ఉండటం వల్ల కాళిదాసు ఈ పూలను అందానికీ ప్రేమకు ప్రతీకగా అభివర్ణించాడు. ఎండినా పోదు కాబట్టి శకుంతల ఈ పూలను దండలుగా అల్లి అలంకారానికి వాడేదని అభిజ్ఞాన శకుంతల నాటకంలోవర్ణించాడు.

అతి ప్రాచీన ఆయుర్వేద గ్రంధాలైన చరక సంహిత సుహృత సంహిత అష్టాంగ హృదయంలో దీనిని ఔశాధంగా బకుల అనే పేరుతో చెప్పారు. భావ ప్రకాశా ధన్యంతరి, సాలగ్రామ మొదలైన నిఘంటులలో దీని గుణాలను ఉపయోగాల గురించి వీటిలో క్షుణ్ణంగా విశదికరించారు. నోబెల్ బహుమతి పొందిన రవీంద్రనాధ  ఠగుర్ ఈ చెట్టు క్రింద కూర్చునే చిత్రాంగధ అనే నృత్యనాటికను వ్రాశాడు. కోటిల్యుడి అర్ధశాస్త్రంలో ఒకుల నార నుండి వస్త్రాలను తయారు చేసినట్లు వ్రాశారు.

పొగడ చెట్టు పశ్చిమ దక్షణ భారతదేశపు స్ధానీయతను కలిగి ఉంది. భారతదేశం అంతటా పెరుగుతుంది. కాబట్టి అన్ని భాషలలో దీనిని ఆయా ప్రాంతీయ పేర్లతో పిలుస్తారు. పొడి సతతహరిత అడవులలో (Dry ever-green forests) పశ్చిమ కనుమల తీరంలో 1200 మీటర్ల ఎత్తైన ప్రదేశాలలో పేరుగుతుంది. తూర్పు దక్షిణ ఆసియాలలో ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతాలలో అండమాన్, బర్మా , శ్రీలంక దేశాలలో కూడా విరివిగా కనబడుతుంది.  పోడిలేక తేమ ప్రేదేశాలలో 500-1200 మి.మీ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో అనేక రకాలైన నేలల్లో ఇంకా ఎర్ర కంకర భూముల్లో కూడా తేలిగ్గా పెరుగుతుంది. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో పెరుగదు. కాని తేమ ఎక్కువ ప్రాంతాలలో ఎక్కవు ఎత్తు పెరుగుతుంది. తేమ తక్కువ ఉన్న ప్రాంతాలలో తక్కువ ఎత్తు పెరుగుతుంది. ముప్పై మీటర్ల ఎత్తు మధ్యరక పరిమాణంలో ఎప్పుడూ ఆకుపచ్చగా గుండ్రని కాండంతో ఉంటుంది. తేమ ఉండే 45 మీటర్ల ఎత్తు వరకు కూడా పెరుగుతుంది.

పొగడచెట్టు గుండ్రంగా గొడుగు వలె పరుచుకొన్ని కొమ్మలు గుబురుగా ఉంటుంది. అడ్డం నిలువు పగుళ్ళతో బెరడు నున్నగా బూడిద లేత గోధుమరంగుతో ఉంటుంది. ఏకాంతర ఆకులు 5-10 సెం.మీ పొడవు, 3-5సెం.మీ వెడల్పుతో ఉంటాయి. ఆకులు మందంగా నున్నగా మెరుస్తూ నేరేడు ఆకులను పోలి గుబురుగా ఉంటుంది. ఆకులు కోలగా చివర కొనతేలి ఉంటాయి.

మార్చినెల నుండి జూలై నెల వరకు పుష్పిస్తుంది. మరుసటి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో కాయలు, పళ్ళుగా మారుతాయి. పూలు నక్షత్ర ఆకారంతో చిన్నవిగా, తెలుపు లేక క్రిమ్ రంగులో 2సెం. మీఇ పరిమాణంతో ఒకటిగా కాని, గుంపులలో కాని పుష్పిస్తాయి. 6-8 రక్షక పత్రాలు, 2 వరుసులలో 18-24 ఆకర్షణ పత్రాలు 2 లేక 3 వరుసలలో , 6-8 కేసరాలు అదే సంఖ్యలో ఉన్న వంధ్య కేసరాలతో ఏకాంతరంగా (Alternate) అమరి ఉంటాయి. గోధుమ రంగు నూగు పువ్వు కాడ మీద , రక్షక పత్రాల మీద, లేత కాయల మీద ఇంకా లేత కొమ్మల మీద కూడా కనబడుతుంది. పువ్వు మధ్యలో బాణాకారం గల పరాగకోశాల మధ్యలో 8ఫలదళాల గల అండకోశం ఉంటుంది. కిలాగ్రం జిగురుగా ఉంటుంది. పరాగ సంపర్కం కీటకాల ద్వారా జరుగుతుంది. ఈ చెట్టు యొక్క ఆకుపచ్చని మృదుఫలాలు గుజ్జుతో కోలగా ఉండి పందినపుడు ఎరుపు-కాషాయ రంగంలోకి మారతాయి. పళ్ళు 2-3 సెం.మీ పరిమాణంలో , 1.5-2 సెం.మీ పరిమాణం గల విత్తనం కలిగి ఉంటాయి. విత్తనాలను జూన్ , జూలై నెలలలో పోగుచేసి కడిగి ఎండబెట్టి ఈ చెట్టు వ్యాప్తికి ఉపయోగిస్తారు. దాదాపు ఒక కిలోకి 2150 గింజలు తూగుతాయి. గింజలు ఎక్కువ కాలం నిలువ ఉంటె మొలకెత్తే గుణాన్ని కోల్పోతాయి. తాజా గింజలను అవు పేడ కలిపిన నీటిలో మూడు రోజులు నానబెట్టి గోరువెచ్చని నీటిలో కాసేపు ఉంచి తరువాత మొలకెత్తటానకి మట్టిలో పెడతారు. పెరుగుదల చాలా నిదానంగా ఉంటుంది. గింజలు మొలకెత్తడానికి 90 రోజులు పడుతుంది. 30-40 శాతం గింజలు మాత్రమే మొలకెత్తుతాయి.

నేలమీద రాలిన సువాసన గల పువ్వులను అందరూ ఇష్టపడతారూ. పువ్వులను పోగుచేసి దండలుగా అల్లి అలంకారానికి వాడతారు. ఎండిన కూడా వాసన పోదు కాబట్టి దిండ్లలో కూరతారు. బెరదు , పువ్వులు , కాయలు , పళ్ళు , విత్తనాలు వైద్యానికి పనికివస్తాఐ. దీనినుండి తయారు చేసిన మందులు పైపూతగా లేక మందుగా వాడతారు. వీటికి రక్తస్రావాన్ని అరికట్టెగల గుణం ఉంది. చల్లదనాన్ని కలిగిస్తాయి. పురుగులను ఆరికడతాయి. పూల కాషాయం గుండె వ్యాధులను అరికడుతుంది. తలనొప్పి కిళ్ళనోప్పులకు పూవుల చుర్ణాన్ని అత్తరుగా, ఔషధంగా వాడతారు.

అనాదిగా ఆయుర్వేదంలో దీనిని చాలా ఎక్కువగా వాడేది దంతసమస్యలకే. బెరడు, పూల కషాయాన్ని పుక్కిలించితే పళ్ళ కురుపులు, నోటిలో దుర్వాసన నోటిపూత మటుమాయం. పచ్చి కాయలు నమిలితే కదిలిన దంతాలు గట్టిపడతాయి. వీకోవజ్రదంతి టూట్ పేస్ట్, పౌడరులో విరివిగా వాడుతున్నారు. పులపోడిని జలబుతగ్గటానికి విద్యాపరంగా వాడతారని ఫార్మోగ్రాఫియా ఇండికాలో వ్రాశారు. పూలు, పళ్ళు నుండి తీసిన మందు కురుపులను దెబ్బలను తగ్గిస్తాయి. నీళ్ళలో కలిపిన పండిన ఫలాల పొడిని సుఖప్రసవానికి వాడతారు. ఆకులు పాము కాటుకు విరుగుడుగా వాడతారు. పళ్ళు తీయగా, పుల్లగా రుచిగా ఉంటాయి. అందుకని క్పక్షులు జంతువులు చాలా ఇష్టంగా తింటాయి. చాలామంది ఆహారం గానే గాక పచ్చళ్ళు కూడా క్తయారుచేస్తారు. విని కలప చాలా గట్టిగా, ఎర్రటి రంగులో ఉంటుంది. చక్కటి పాలిష్ తీసుకోని సుందరంగా ఉటుంది. గృహుపకరణ వస్తువులు, ఇళ్ళ నిర్మాణంలో పదవ తెడ్డుల తయారీలో , రోకళ్ళ తయారీలో, నునేగానుగల తయారిల్ వాడతారు. బెరడునుండి తీసిన రంగును అద్దాక పరిశ్రమలో వాడతారు. ఇన్ని ఉపయోగాలున్న పొగడ చెట్టును నాటుదాం. పూల సువాసనను ఆనందిద్దాం ప్రకృతి సంపదను అనుభవిద్దాం. కాపాడదాం.

ఆధారం: అడునుపల్లి నాగమణి

2.99401197605
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు