పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఉందిలే మంచి కాలము ముందు ముందునా...

అధిక వత్తిడి అనర్థదాయకం. కావున భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి.

నరాలు జివ్వున లాగేస్తున్నట్లు, తలను పట్టకారులో పెట్టి నొక్కినట్లు, రక్తం సలసలా కాగి నరాలలో ప్రవహిస్తున్నట్లు, వేలాది కాకులు చుట్టూ తిరుగుతూ గోల చేస్తున్నట్లు, గదంతా వేడెక్కి ఉక్కపోస్తున్నట్లుగా భావిస్తూ, చికాకు, విసుగు, కోపం, ఆందోళన, భయం, బెంగ, ఉద్వేగం లాంటి భావోద్వేగాలు ప్రదర్శించే వ్యక్తులు సమాజంలో ఎక్కువైనారన్నది వాస్తవం. విద్యార్థులైతే ఆ దశను దాటి ఆత్మహత్యల బాట పట్టారు. ఆనందంగా, అందంగా అనుభవించాల్సిన భవిష్యత్తును అర్థంతరంగా ముగిస్తున్నారు. కారణం వత్తిడి... వత్తిడి...వత్తిడి.

ఈ స్ట్రెన్, అదే వత్తిడి ఏ కొందరికో పరిమితం కాదు. దీనికి రంగు, లింగ, కుల, మత, జాతి వంటి బేధభావం లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఈ వత్తిడికి గురికావచ్చు. ఇది సర్వసాధారణం. మన జీవనశైలి కనుగుణంగా సర్దుబాటు చేయడంలో లోనయ్యే శ్రమను స్ట్రెస్ గా నిర్వచించవచ్చు. ఇంకా విపులంగా చెప్పుకుంటే మనల్ని బెంగ పట్టించే విషయం ఏదైన మనకు స్ట్రెస్ ప్రసాదించేదే.

ఆయా ప్రభావాల ఆధారంగా STRESS అనేది 2 రకాలు. మొదటిరకు Positive Stress (సానుకూల వత్తిడి). ఇది భావోద్వేగాల ఫలితంగా వస్తుంది. దీని కారణంగా ఉత్సుకత, జిజ్ఞాన పెరుగుతాయి. అప్రమత్తంగా ఉండేలా ప్రేరేపిస్తుంది. ఇది ప్రయోజిక వత్తిడి. ఇక మానసిక ఆందోళనల ఫలితంగా వచ్చేది వ్యతిరేక వత్తిడి రెండోరకానిది. అదే Negative Stress, దీని కారణంగానే విసుగు-కోపం లాంటివి, ఆందోళన వంటివి కలిగి అనారోగ్యానికి

దారితీస్తుంది. తీవ్ర తలనొప్పి, కడుపులో దేవినట్లు, నిద్రలేమి (ఇన్సోమ్నియా), అల్సర్, తీవ్ర రక్తపోటు, గుండెపోటు వంటి ఇతర గుండె సంబంధ వ్యాధులు వత్తిడి కారణంగా సంక్రమిస్తాయి.

ఓ సర్వే ప్రకారం ఉద్యోగం కారణంగా 31%, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా 18%, మానవ సంబంధాల బలహీనం కారణంగా 19%, పాఠశాల వ్యవహారాల కారణంగా 12% మంది.. ఇలా వత్తిడికి గురౌతున్నట్లు గుర్తించారు. 12 నెలల జీవిత కాలంలో వ్యక్తిలో వచ్చిన మార్పుల ఆధారంగా అనుభవిస్తున్న వత్తిడి ఏ స్థాయిలో ఉందో మనస్తత్వ విశ్లేషకులు అంచనా వేస్తారు. ఈ వత్తిడి బాధితుల్లో మహిళలే అధికం. వత్తిడితో బాధపడుతున్న మహిళల, పురుషుల శాతం 84%, 76%గా ఉంది. వత్తిడి స్థాయి కూడా మహిళలకే ఎక్కువగా ఉంది. సైస్ పీడితులు అధికంగా ఉన్న దేశం అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికానే. అక్షర క్రమములో ముందుండే ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నా వత్తిడి పీడితులు కలిగియున్న రాష్ట్రంగా ముందు వరుసలో ఉన్నది. ఇదే బాధించే అంశం. | ప్రపంచీకరణ ఫలితంగా వినిమయదారి సంస్కృతి పెరిగి, కోరికలు గుర్రాలుగా పరుగెడుతుంటే, వాటిని అందుకోలేని ఆర్థిక స్థితి వత్తిడికి దారితీసి మానసిక రుగ్మతలకు గురౌతున్నారు. కార్పోరేటీకరణ పేరుతో విద్య అంగడి సరుకుగా మారి ర్యాంకుల చుట ప్రదక్షిణచేస్తున్న క్రమంలో బలవంతపు చదువులు విద్యార్థులపై తీవ్రవత్తిడిని కలుగజేయటంతో విద్యార్థులు మానసిక రోగులుగా మారుచున్నారు. మానసిక వైద్యుల్ని సంప్రదించడమే పెద్ద తప్పుగా భావించే భారత్ లాంటి దేశంలో వీరి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం.

మరి పరిష్కారం? ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. ఇది ప్రకృతి సూత్రం. ఈ కథ చదవండి. dec5ఒకానొక దేశంలో ఓ మారుమూల ఓ గ్రామం ఉండేది. అదొక విశాలమైన నాగరిక జీవనం సాగిస్తున్న ప్రజలున్న అందమైన గ్రామం. గ్రామం చుట్టూ కంచె. గ్రామంలోకి ప్రవేశించటానికి ఓ పెద్ద ముఖద్వారం. సుఖసంతోషాలతో కాలక్షేపం చేస్తున్న గ్రామ ప్రజలకి ఓ రాక్షసుని రూపంలో సమస్య వచ్చి పడింది. ఓ రోజు అకస్మాత్తుగా అరవీర భయంకర రాక్షసుడొకడు గ్రామ ముఖద్వారం వరకు వచ్చి భీకరంగా అరుస్తుంటాడు. ఓ చేతిలో రక్తపు మరకలున్న గొడ్డలితో. చూస్తేనే ఒళ్ళు గగుర్పొడిచే విధంగా వికటాట్టహాసం చేస్తూ “మీ గ్రామంలో ధైర్యస్తులున్నారా? ఉంటే రండి, ముక్కలు ముక్కలుగా నరికి ఆరగించేస్తా.” అంటూ పిలుస్తుంటాడు. వచ్చిన వాళ్ళను ముక్కలు ముక్కలుగా నరికి భీభత్సం సృషించేవాడు.

గ్రామస్తులను బెదిరించి, భయ పెట్టి తన అవసరాలు తీర్చుకుంటూ ఉండేవాడు. అడపాదడపా గ్రామ ద్వారం తెరుచుకుంటూ ఉండేది. గ్రామస్తుల్ని కాపాడడం తమ ధర్మమని భావించిన కొంత మంది యువకులు ముందుకు రావడం రాక్షసుడి చేతిలో చావటం జరుగుచుండేది. మరి కొంతమంది రాక్షసుని చేతిలో భీకరంగా చావటమెందుకని ఆత్మహత్యలు చేసుకునే వారట. అందరిలో విషాదం, భయం, ఆందోళన.

ఆ దేశపు యువరాజు ఓ రోజు గ్రామ సందర్శనానికొస్తాడు. గ్రామస్తుల మొహాలలో కనిపిస్తున్న విషాదఛాయలు గమనించి, విచారించి, విషయం తెలుసుకుంటాడు. “మీరేం భయపడకండి. రాక్షసుడ్ని స్వయంగా నేనే ఎదుర్కొని చంపేస్తా. రేపే వాడిబారి నుండి మిమ్మిల్ని విముక్తి చేస్తా.” అని ధైర్యం చెప్తాడు. మరుసటిరోజు యధావిధిగా గ్రామముఖ ద్వారం వద్దకు రాక్షసుడు వస్తాడు. అప్పటికే ద్వారం తెరచి ఉండడం, ద్వారం వద్ద యువరాజు కత్తిని పట్టి ఠీవిగా నిలబడి ఉండడం, యువరాజు వెనుకాలే గ్రామ ప్రజానీకం అంతా గుమిగూడి ఉండటాన్ని రాక్షసుడు ఆశ్చర్యంగా చూస్తాడు, రాక్షసుడు తన ఆకారాన్ని మరింత భయంకరంగా పెద్దదిగా చేసి యువరాజు వైపుకి అడుగులు వేస్తుంటాడు. యువరాజు ఏమాత్రం తొణకుండా, అదరకుండా, బెదరకుండా రాక్షసుడి కళ్ళలోకి సూటిగా చూస్తూ కత్తిని రులిపిస్తూ రాక్షసునివైపుకి అడుగులేస్తుంటాడు. యువరాజు రాక్షసునికి సమీపంగా వచ్చేకొద్ది ఆశ్చర్యంగా రాక్షసుని ఆకారం చిన్నదిగా మారి నాలుగడుగులకు చేరుతుంది. మరుగుజ్జుగా మారిన రాక్షసుని గుండెల్లోకి కత్తిని దింపి నేలకూలుస్తాడు. ప్రాణాలొదలబోతున్న రాక్షసుడ్ని “నువ్వెవరు?” అని గర్జించాడు. నేను “భయాన్ని... భయాన్ని అంటూ నన్ను ఎదిరించలేని వారి ముందు అరవీర భయంకర ప్రతాపాన్ని చూపిస్తా, నీలాంటి ధైర్యశాలి ముందు నేను మరుగుజ్జుని, మరుగై పోతాను.” అని ప్రాణాలు వదుల్తాడు.

ఈ కథలోని సారాంశం. 'భయం' అనేది ఓ పిరికితనం. అది మనుషుల్ని కృంగదీస్తుంది. వత్తిడికి గురిచేస్తుంది. ధైర్యంగా ఎదుర్కొంటే, విచక్షణతో ఎదుర్కొంటే భయం పటాపంచలౌతుంది. వత్తిడి ఉండదు.

నిరాశకు, నిస్పృహకు తావివ్వకూడదు. వీటివల్ల మనసు గతితప్పుతుంది. మనోస్థితిలో మార్పువస్తుంది. వికసితమైన బుద్ధి మాత్రమే భావోద్వేగాలను నియంత్రిస్తుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి. ప్రతినిత్యం అరగంటపాటు నడవడం, శ్వాస మీద ధ్యాస ఉంచి గాలిని పీలుస్తూ వదులుతూ ధ్యానం చేయటం, సంతోషకర సంఘటనలను మననం చేసుకోవటం బిగ్గరగా నవ్వటం, మనసుని ఏకాగ్రతతో లగ్నం చేయడం, ఇష్టమైన సంగీతాన్ని మందస్థితిలో వినడం, బి-విటమిను అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, ఆత్మీయ స్పర్శను కుటుంబ సభ్యుల నుంచి పొందటం, సానుకూల దృక్పథంతో ముందడుగు వేయడం, శాస్త్రీయ ఆలోచనను పెంపొందించుకోవడం, మారాలి అనే ధృడ సంకల్పంతో మానసిక వత్తిడిని అధిగమించవచ్చు.

వత్తిడి సహజం. కొన్ని సందర్భాలలో అవసరం. అధిక వత్తిడి అనర్థదాయకం. కావున భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి.

ఆధారం: షేక్ గౌస్ భాష

2.99426934097
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు