హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / ఎందుకు సూర్యుడు మన వెంటే వస్తుంటాడు?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఎందుకు సూర్యుడు మన వెంటే వస్తుంటాడు?

మన కంటికి చదగలిగే పరిధి Range of vision ఉంటుంది.

sun మీరు కారులో గాని, రైల్లో గాని, బస్సులో గాని ప్రయాణించేప్పుడు కిటికీలోంచి కనిపించే సూర్యుడు మీ తోనే ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది కదూ! మీరు గమనించారా? ఎందుకు సూర్యుడు మన వెంటే వస్తున్నాడు? అని మీరు ఎన్నోసార్లు అనుకొని ఉంటారు. రోడ్డుకి పక్కనే ఉన్న చెట్లు, ఇళ్లు త్వరత్వరగా వెనక్కు వెళుతుంటాయి. కొద్దిగా దూరంగా ఉన్న చెట్లు, కొండలు నెమ్మదిగా వెనక్కు వెళుతుంటాయి. కానీ సూర్యుడు గాని చంద్రుడు గాని ఎంత దూరం ప్రయాణించినా మనతోటే వస్తుంటారు. అలా ఎందుకు జరిగుతుందో చెప్పమంటారా?

మన కంటికి చడగలిగే పరిధి Range of vision ఉంటుంది. కన్ను ఆ పరిధిలో ఉండే వస్తువులను మాత్రమే చూడగలుగుతుంది. ఆ పరిధికి ఆపలి వస్తువులను చూడలేదు. వస్తువు మనకంటి నుండి ఎంత ఎక్కువ దూరంలో ఉంటే అంత ఎక్కువ సేపు ఆ వస్తువు మనం చూడగలిగే పరిధిలో ఉంటుంది. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే మీరు నేను చెప్పినట్లు చేయండి. ఒక త్రిభుజం ABC ని గీయండి. A వద్ద మీరున్నారనుకోండి. అంటే మీ కన్ను ఉందని అర్ధం. A నుండి మీ కన్ను చూడగలిగే పరిధి BC వరకు వ్యాపించింది అనుకొందాం. ఇప్పుడు DE అనే గీతని BC కి సమాంతరంగా గీయండి. BC, DE కన్నా మీకంటి నుండి ఎక్కువ దూరంలో ఉంది కదూ! అందుకనే BC మీద ఉండే వస్తువు మీరు ఎక్కువ చూడగలిగే పరిధిలో ఉంటుంది. అదే DE మీద ఉండే వస్తువు BC కన్నా తక్కువ సేపు చూడగలిగే పరిధిలో ఉంటుంది. ఇలా దూరం పెరిగే కొద్దీ మన కన్ను చూడగలిగే పరిది పెరుగుతూ ఉంటుంది. సూర్యుడు మన భూమి 14,95,97,870 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. కాబట్టి సూర్యుడు చాలా సేపు వరకు మనం చూడగలిగే పరిధి Range of vision  లోనే ఉంటారు. అందుకనే మీరు ఎంత వేగంగా వెళ్ళినా సూర్యుడు అంతే వేగంగా మీతో వస్తుంటాడు. మీరు వేగాన్ని తగ్గిస్తే సూర్యుడు కూడా మెల్లగా వస్తాడు. మీరు ఆగిపోతే సూర్యుడు కూడా ఆగిపోతాడు. ఇప్పుడు అర్ధం అయిందిగా సూర్యుడు ఎందుకు మనతోనే వస్తాడో .

ఆధారం: సి.హెచ్. ఆనంద్

2.98538011696
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు