పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఎబోలా వైరుస్ వ్యాధి

రోగాలకు దూరంగా ఉందాం మనల్ని మనం కాపాడుకుందాం.

sep02.jpgఒకప్పుడు ఎయిడ్స్ (AIDS) నిన్న మొన్న సైన్ ఫ్లూ నేడు ఎబోలా. ఇలా ఏదో ఒక మహమ్మారి మానవాళిని భయపెడుతూనే ఉంది. 21వ శతాబ్దంలో కూడా ఈ వ్యాధులు మనల్ని వణికిస్తున్నాయంటే అవెంత ప్రాంతకమైనవో ఆలోచించండి! ఇవన్నీ కూడ వైరస్ వలన వచ్చే వ్యాధులే. సాధారణంగా వైరస్ వల్ల వచ్చే జబ్బులకు ప్రత్యేకంగా మందులేమి ఉండవు. మన శరీరం వాటికి వ్యతిరేకంగా రోగనిరోధకతను సాధించడమొక్కటే మార్గం. అది కష్టసాధ్యమయినపుడు, అసలు సాధ్యమే కానపుడు చావు తప్ప గత్యంతరం ఉండదు. ప్రస్తుతం ప్రపంచాన్నంతా భయభ్రాంతుల్ని చేస్తున్న ఎబోలా వైరస్ వలన వచ్చే జ్వరంలో రక్తస్రావం జరగటం పరిపాటి. ఈ వైరస్ ను మొదటిసారి 1976లో తెల్సుకున్నారు. ఈ వ్యాధి పెద్దఎత్తున వచ్చిన ప్రాంతానికి దగ్గర్లో ఎబోలా నది ఉండటం వలన దీనికి ఎబోలా జ్వరం అనే పేరు వచ్చింది.

ఫైలో విరిడే కుటుంబానికి చెందినది ఈ ఎబోలా వైరుస్. ఈ వైరస్ సంక్రమిస్తే 90 శాతానికి పైగా మరణాలు సంభవిస్తాయి. ఇది ఆఫ్రికా దేశాలైన వైరి Zaare, సుద్దాన్ (Sudan), కాంగో (Congo), ఉగాంచా (Uganda) లలో ఎందరినో పొట్టనబెట్టుకుంది. ఉష్ణ మండల అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది.

ఈ వైరన్ అణువులో రెండు రకాల ప్రొటీన్లు ఉంటాల ఇంచులో ఒకటి వైరస్ ది. రెండవది దాని అతిధేయి జంతువుది. ఇది 80 నానో మీటర్ల వ్యాసం 1400 నానోమీటర్ల పొడవు ఉంటుంది

ఈ వైరస్ ఉన్నట్టుంది అనుకోకుండా ఎలా వ్యాపిస్తుంది? ఇది ముఖ్యంగా జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. ఇది సహజంగా గబ్బిలాలకు సంక్రమించే వ్యాధి. వ్యాధి సోకిన జంతువుల రక్తం లేదా స్రావాల ద్వారా మరొకరికి అంటుకుంటుంది. చనిపోయిన చింపాంజీలు, గొరిల్లాలు, గబ్బిలాలు, కోతులు, దుషి, ముచ్చపంది వంటి జంతువులను ముట్టుకుంటే వైరస్ సోకుతుంది.

ఈ వైరస్ సోకినపుడు జ్వరంతో పాటు, కండరాల నొప్పి, వాంతులు, విరేచనాలు, మూత్రపిండాలు, కాలేయం వనిచేయకపోవటం జరుగుతుంది. రక్తస్రావం, తెల్లరక్త కణాలు, ప్లేట్లెట్లు పడిపోవడం సర్వసాధారణం. వైరస్ సోకిన రెండు రోజుల నుండి 21 రోజుల్లో వ్యాధి బయటపడుతుంది.

sep01.jpgఈ ఎబోలా వైరస్ వ్యాధికి (Ebola Virus Disease) ప్రత్యేకంగా మందులుగాని, వ్యాక్సిన్లు గాని లేవు. అందుకే ప్రపంచ ఆరోగ్యసంస్థ (World Health Organisation) అన్ని రకాల వ్యాక్సిన్లు ఈ వ్యాధి నివారణకు వాడవచ్చునని అనుమతించింది. ఎబోలా వైరస్ అతిధేయి (host) రోగనిరోధకత నిర్వీర్యం చేసి రక్త ప్రసరణ వ్యవస్థను దెబ్బ తీస్తుంది. అతి త్వరలోనే మనిషి ఈ మహమ్మారి (ఎబోలా వైరస్ వ్యాధి)కి మందులు కనుగొంటారని ఆశిద్దాం!

ఆధారం: డా. కట్టా సుమ.

2.99171270718
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు