పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

నక్షత్రాలూ, ఇసుకరేణువులూ

ఒకటికి మించి ఒకటి.

ఇసుక రేణువులు భూమి మీద ఎన్ని వుంటాయి? ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని వున్నాయి? మరి ఈ రెంటిలో ఏవి ఎక్కువ? అని... మీరెప్పుడైనా ఆలోచించారా?

ఇలాంటి సందేహమే హవాయి దీవుల్లోని శాస్త్రజ్ఞులకూ వచ్చింది. హవాయి దీవులు అందమైన సముద్ర తీరానికి ప్రసిద్దని మీకు తెలుసు. అయితే హవాయి దీవులు ఖగోళ శాస్త్ర పరిశోధనాలయాలకు కూడా కేంద్రమే అని మీరు తెలుసుకోవాలి. ఇక ఆలస్యం చేయకుండా హవాయి శాస్త్రజ్ఞులు లెక్కలువేయడం ప్రారంభించారు.

మొదట ఇసుక రేణువుల్లో ప్రారంభించారు. ఎలా లెక్కించాలన్న సమస్య వచ్చింది. దానికి వారొక పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ఒక స్పూనులో ఇసుకను తీసుకొని దానిలో వున్న ఇసుక రేణువుల్ని లెక్కపెట్టారు. ఆ తర్వాత భూమి మీద ఎన్ని స్పూన్ల ఇసుక వుంటుందో అంచనా వేసారు. భూమి మీద అంటే మట్టి, సముద్ర తీరాలు, ఎడారులన్నింటిలో ఉన్న ఇసుక రేణువుల కలిపితే మొత్తం వాటి సంఖ్య 7.5x1018 అని తేలింది.

ఇంతకూ 1018 ని ఏమంటారో తెలుసా? ఒక క్వింటలియన్ (Quintillion) చాలా ఎక్కువ కదూ?

ఇప్పుడు నక్షత్రాల లెక్కదగ్గరికి వచ్చారు. ఇసుక రేణువులకంటే, నక్షత్రాల లెక్క కొంచెం క్లిష్టమయినది. ముందు విశ్వంలో వున్న నక్షత్రాలను ఎలా లెక్కపెట్టాలో తేల్చుకోవాలి. మన భూమి చుట్టూ వున్నవి మనకంటితో చూడగల్గేవి అయితే ఖచ్చితంగా ఇసుకరేణువులదే విజయం .

కానీ, శాస్త్రజ్ఞులు హబుల్ టెలిస్కోపుతో చూడగలిగిన నక్షత్రాలన్నింటినీ పోటీలోకి తెచ్చారు. అవి ఎన్ని వున్నాయో తెలుసా? 7x1021 అంటే ఏడు వేల క్వింటాలియన్లన్న మాట. అంటే ఈ పోటీలో నక్షత్రాలే విజయం సాధించాయన్నమాట.

అనంత విశ్వంలోని నక్షత్రాలకు, చిన్న గ్రహమైన భూమి మీద వున్న ఇసుకరేణువులు బాగానే పోటీనిచ్చాయి.

నక్షత్రాలకు ఇలాంటి పోటీనివ్వగల్గినవి భూమి మీద ఇంకేమయినా వున్నాయా? అని శాస్త్రవేత్తలు తర్జనభర్జన పడ్డాక చివరికి పోటీలోకి మూడో దాన్ని తీసుకొచ్చారు. అది 'నీరు'.

భూమి మీద వున్న నీటిలో ఎన్ని పరమాణువులుంటాయి? అవి నక్షత్రాల సంఖ్యకంటే ఎక్కువో? కాదో? తేల్చుకొనే పనిలో నిమగ్నమైనారు పరిశోధకులు. కేవలం పది నీటి బిందువుల్లోని పరమాణువుల సంఖ్య మొత్తం నక్షత్రాల సంఖ్యకు సమానం అని నిరూపించారు. ఆశ్చర్యంగా వుంది కదూ! ఇప్పుడు గెలిచింది నిస్సందేహంగా నీరు.

అనంత విశ్వంలోని నక్షత్రాలకంటే భూమి మీద వున్న నీటి పరమాణువులు ఎక్కువ. మరి నీటి అణువుల్ని కూడా వెనక్కు నెట్టేసేదేమయినా వుందా? ఉంది. దానికి ఎప్పటికీ పోటీలేదు. అది మానవుని ఊహాశక్తి.

ఆధారం:  వి. రాహుల్జీ.

2.99152542373
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు