పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఎవరు గొప్ప

తేనెటీగ- చీమ, సీతాకోకచిలుక, గబ్బిలం కొన్ని పక్షులు గొప్పతనం చర్చ

పాత్రలు: evarugoppa.jpgతేనెటీగ- చీమ, సీతాకోకచిలుక, గబ్బిలం కొన్ని పక్షులు చీము వార్షిక సమావేశంలో చర్చించుకుంటున్నాయి. నేను గొప్ప అంటే – నెను గొప్ప అని వాదులాడుకుంటున్నాయి.

చీమ:- వీ వ క్షులందరూ ఎగురుతూ మనుషులందరికి దూరంగా హయిగా వున్నారు. నేను మనుషులతో వుంటే వాళ్ళు ఇళ్ళల్లో అన్ని పనులూ చేసూ క్రిందపడిన పదార్గాలను శుభ్రపరుసూ వుంటాను. మనిషి తనే గొప్ప అని విర్రవిగుతాడు గొప్ప తెలుసా!

సీతాకోక చిలుక : (టపటపా తన అందమైన రెక్కలు ఆడించి) నీవేం గొప్ప నేను, అంటే సీతాకోకచిలుక వున్నాను అంటే సీతాకొకచిలుక వున్నాను అంటే కాలుష్యం లేదని అర్థం నా రంగు రంగుల రెక్కలతో కళ్ళకు ఆనందాన్ని హాయినీ ఇస్తాను. నా రెక్కలు చూసి మనుషులు రకరకాల డిజైన్లు తయారుచేస్తారు. అదీ లెక్క.

తెనేటిగా:- హా హ్హాహ్హ ... మీరు కాదు గొప్పతనం నాది. అన్ని కీటకాల ఉత్పతులలో మనిషి ఆహారంగా తీసుకునేది నా తేనే మాత్రమే తెలుసా.

గబ్బిలం:- (తలక్రిందులుగా వ్రేలాడి ఊగుతూ) అదేం గొప్ప. నెను మనుషులకు ఎంత మేలు చేస్తున్నాను. నా వల్లనే దోమల ఉత్పత్తి తగ్గుతోంది.

చీమ:- ఆహా! అదేలగామ్మా?

గబ్బిలం:- నెను గంటకు 600 దోమలను తింటాను తెలుసా.

చీమ:- అసలు ప్రపంచంలోనే తొలి వ్యవసాయ జివి చీమ. ఆమెజాన్ అడవులలో ఆకుల పై ఫంగస్ ను పండించి ఆహారంగా తీసుకునేది మా మలే తెలుసా!

సీతాకోక చిలుక :- సరే.. నెను వాతావరణంలో మార్పులను, కాలుష్యాన్ని.. కాలుష్య ప్రమాదాన్ని పసిగట్టడంలో మనుషులకు సహాయం చేస్తాను.

తెనేటిగా:- నేను అసలుసిసలైన శ్రమజీవిని. 500 గ్రాముల తేనె తయారుచేయడానికి దాదాపు 90 వేల మైళ్ళు ప్రయాణం చేసి 20 లక్షల పూలపై వ్రాలి మకరందం సేకరిస్తాను.

చీమ:- మీరందరూ కాదు. నేను వున్నచోట పారిశుద్యం వుంటుంది. క్రిందచిందిన పదార్థాలను, చనిపోయిన, కుళ్ళిపోయిన కీటకాలను తినివేసి, కుళ్ళిపోయిన కీటకాలను తినివేసి, తీసుకుపోయి పరిసరాలను, ఇంటిని శుభ్రపరుస్తాను.

గబ్బిలం:- నేనే ఒక జీవ నియంత్రణ సాధనాన్ని రావి, మర్రిపండ్లను తిని గింజలను వేరేవేరే చోట్ల విసర్జిస్తాను. దానివల్ల ఎక్కడెక్కడో చెట్టు పెరిగి హరితం (వచ్చదనం)పెంచడానికి ఎంతో సహాయం చేస్తాను.

చీమ:- అదేం గొప్ప. ఎక్కడ ఏ ఆహారం వుందో మేము ఇట్టే కనిపెట్టేస్తాం. మేము సంఘజీవులం. అందరం కలిసి ఆహారాన్ని సేకరించి, నిల్వ ఉంచి పంచుకుంటాం.

తెనేటిగ:- మేము సేకరించే తేనే అత్యంత స్వచ్ఛమైనది. అది ఎన్ని సంవత్సరాలైనా వాడివైపోదు. మాం శ్రనాగూండు చూసారాం. ఒక పద్ధతిగా మైనంతో ఎంతో అందంగా కష్టపడి గూటిని నిర్మిస్తాం.

సీతాకోక చిలుక:- మేమే అసలు సిసలైన పర్యావరణ కార్యకర్తలం. మొక్కలు పెరగటానికి, పూలు కాయలుగా మారటానికి అసరమైన పరాగసంపర్కం (పాలినేషన్) మా వల్లనే జరుగుతుంది.

గబ్బిలం:- నా కెపాసిటీ మీకు తెలీదు రాత్రిపూట క్రూడాం వేగంగా ఎగురుతూ దూసుకుపోగలం. మనుషులు 20 వేల వరకు తరచుదనం(ఫ్రీక్వెన్సీ) గల శబ్దాలను మాత్రమే వినగలరు. మేము 150 వేల తరచుదనం గల శబ్దాలను కూడా వినగలం. శబ్దాలను చేయగలం. దీని ద్వారా దూరపు వస్తువులను, ఆటంకాలను గుర్తుపట్టగలం. ఈ ప్రక్రియ ద్వారానే మనిషి రాడార్ (RADAR రేడియో అడ్మినిస్టేషన్ అండ్ర్ రేంజింగ్) ను కనిపెట్టాడు.

చీమ:- మాలో మొత్తం 2200 రకాల చీమలు వున్నాయి.

సీతాకోక చిలుక:- ఏం లాభం. వూ సీతాకోక చిలుకలలో 64 రకాలే వున్నాయి. కానీ రంగురంగులుగా, రకరకాల డిజైన్లతో వుంటాయి మా రెక్కలు. మా రంగుల కలయిక ఒక అద్భతం.

చీమ:- పని విభజన, సంఘ నిర్మాణం కలిసి జీవించడం, సమస్యల పరిష్కారం, సమాచార పంపిణీ ఇవన్నీ మమ్మల్ని చూసే మనిషి నేర్చుకున్నాడు. మనుషులకు మేమే స్ఫూర్తి (motivation)

తెనేటిగా:- ఐన్స్టీన్ శాస్త్రవేత్త ఏమన్నాడో తెలుసా. ఈ భూమి మీద తేనెటీగలు అంతరించిన 4 సంవత్సరాలతో మనిషి కూడా అందరిస్తాడు" అని. అదీ మేమంటే!

చీమ:- మనలో కోట్లాడుట, వాదులాదుట ఎందుకు? మనమందరం మన రంగాలలో గొప్పవాళ్ళం. మన సేవల వల్ల మనుషులు జీవిసున్నాడు. జీవవైవిద్యాన్ని కాపాడటానికి మనం కృషి చేస్తున్నాం. ఇది గుర్తించలేని మనిషి సమతౌల్యాన్ని నాశనం చేస్తున్నాడు.

సీతాకోక చిలుక:- అవును. విచ్చలవిడిగా చెట్లు నరికి భుతాపానికి కారణం అవుతున్నాడు.

గబ్బిలం:- రసాయనాల ఎరువులు వాడి క్రిమి, కీటకాలను చంపేస్తున్నాడు.

తెనేటిగా:- ప్లాస్టిక్ వస్తువులను వాడి క్రిమి, కీటకాలను చంపేస్తున్నాడు.

చీమ:- అవును అవును. ఓ మనిషి మేలుకో ...

గబ్బిలం:- ఓ మనిషి నిజం తెలుసుకో....

రచయిత: శ్రీమతి కొండా భార్గవి, సెల్: 7382050069

2.94949494949
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు