పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఏది మంచి ముహుర్తం?

ఏది మంచి ముహుర్తం?

తిరుపతయ్య ధాన్యపు గింజల టోకు వర్తకుడు. ఎక్కువ మొత్తములో ధాన్యమును చుట్టుపక్కల పల్లెలలో రైతుల వద్ద కొనుగోలు చేస్తాడు. పట్టణాలకు ఎగుమతి చేస్తుంటాడు. పాతకాలపు మనిషి. కాస్త చదువుకున్న వాడు. కొద్దిగా పిసినారితనం కూడా ఉంది. అయితే, తన పిసినారితనాన్ని ఎవరికీ కనబడనీయడు. కానీ, మూఢ విశ్వాసాలు ఎక్కువ. ముహూర్తం చూడకుండా ఏ ఒక్క చిన్న పని అయినా మొదలు పెట్టడు. ఏ. ప్రయాణానికైనా కాలు తీసి ఒక్క అడుగు కూడా ముందుకేయడు. అందుకే ఆ ఊరి సిద్ధాంతి సోమశేఖర శర్మ గారిచే ప్రతి పనికీ ముహూర్తం అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. అలాగని ఉచితంగా చెప్పించుకోడు. అలా చెప్పించుకుంటే ఫలితము ఉండదని తిరుపతయ్య నమ్మకం, తృణమో, ఫలమో ప్రతి ముహూర్తానికి సమర్పించుకుంటాడు. అందులో మాత్రం పిసినారితనం ఉండదు.

అలాంటి తిరుపతయ్య ఒకసారి తప్పనిసరి ప్రయాణము చేయవలసి వచ్చింది. మరుసటి రోజు ఖచ్చితంగా వెళ్ళాల్సిన పని. సాయంత్రం శర్మ గారింటికి వెళ్ళి

“రేపు చాలా ముఖ్యమైన పనిమీద పొరుగూరు వెళ్ళాల్సి ఉందీ... మరీ...”అంటూ సాగదీశాడు తిరుపతయ్య.

"ఆ... ఆ... ఓ... మంచి ముహూర్తం చూడాలి, అంతేగా! హ..హ..హ..”అంటూ నవ్వాడు.

"ఆ.... తమకు తెలుసుగా....హ...హ...” అంటూ చిరునవ్వు నవ్వాడు తిరుపతయ్య.

కుర్చీ నుండి లేచి శర్మగారు లోపలికి వెళ్ళి పంచాంగంతో తిరిగి వచ్చాడు. చేతిలో పెద్ద భూతద్దం కూడా ఉంది. శర్మగారు పంచాంగం పరిశీలిస్తుంటే, తాను కూడా తొంగి చూడసాగాడు.

ఓ అరగంట పంచాంగాన్ని అటూ, ఇటూ త్రిప్పి, "ఆ...రేప్పొద్దున 8 గంటల 26 నిముషాల తర్వాత సప్తమీ ఘడియలు. రాహుకాలం కూడా లేదు. రోజంతా బాగానే ఉంది. నిక్షేపంగా ప్రయాణించవచ్చు.” అన్నాడు.

“సంతోషం స్వామీ, ఉంటాను.” అంటూ చేతిలో ఓ వంద నోటుంచి ఇంటికొచ్చాడు.

ఉదయాన్నే 8 గంటలకే తయారై ఖచ్చితంగా 26 ని.లకు బయటకు అడుగు పెట్టాడు. అతడి భార్య ఎందుకో ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చి అతన్ని పిలిచింది. ఆమెనే వెనుదిరిగి చూస్తూ. మెయిన్ రోడ్ ఎడబోయాడు. ఇంతలో రోడ్డు పై దూసుకొచ్చిన ఒక బైకు ఢీకొట్టింది. తిరుపతయ్య గిర్రున గుండ్రంగా తిరిగి, “వామ్మో! చచ్చానురా దేవుడా!” అంటూ కేక పెట్టి పడిపోయాడు. బైకు వాడు కూడా పడ్డాడు. చుట్టూ, ఎవరూ లేరు. భయముతో వణికిపోతూ చకచకా బైకు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. తిరుపతయ్యకు కాలు తీవ్రంగా గాయపడింది. క్రింద పడడంలో బోర్లా పడ్డాడు. కంటికి ఏదో పొడుచుకుంది. కన్ను దగ్గర రక్తం కారసాగింది. బాధలో కళ్ళు మూసుకుపోవడం వలన బైకు వ్యక్తిని చూడలేదు.

తను వేసిన కేకతో చుట్టుప్రక్కల తిరుపతయ్యను లేపి హాస్పిటల్ కు చేర్చారు. అక్కడ ప్రథమ చికిత్స చేశారు. కాలుకు కట్టు కట్టారు. కానీ, కన్ను పరిస్థితి సీరియస్ గా ఉందన్నారు అక్కడి డాక్టరు గారు. వెంటనే పట్నం తీసుకెళ్ళాలన్నారు.

<ఇంట్లో వారికి కబురు పంపి అరగంటలో కారు ఏర్పాటు చేశారు. భార్యతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి పట్నం వెళ్లారు. అక్కడి డాక్టరు పరిశీలించారు. పరీక్షలు చేశారు. కాలికి ఎక్స్ రే తీశారు.

"కాలుకు ఇబ్బంది ఏమీలేదు. కానీ, కంటికి బలమైన గాయం తగిలింది. చూపు రాకపోవచ్చు.” అని డాక్టరు సెలవిచ్చారు.

తిరుపతయ్య దంపతుల బాధ అంతా ఇంతా కాదు. భార్య, “డబ్బు ఎంతైనా ఫరవాలేదు డాక్టర్. చూపు వచ్చే మార్గమే లేదా?” అనడిగింది.

"ఎవరైనా నేత్రదాతలు దొరికి,మీ ఆయనకు కంటి ఆపరేషన్ చేస్తే చూపు వస్తుంది.” అన్నాడు.

“నేత్రదానమా?ఎవరు చేస్తారు డాక్టర్. మీరే ఏదన్నా మార్గం చూడాలి.” అంది.

"మేమేం చేయలేమమ్మా ఏదైనా అవకాశం ఉంటే చెప్తాములే.” అన్నాడు. వారిని నొప్పించడం ఇష్టంలేక.

రాత్రికి అక్కడే ఉన్నారు. తెల్లారి వెల్దామనుకున్నారు.

అనుకోకుండా అర్థరాత్రి దాటాక,ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది. తల అంతా నుజ్జు నుజ్జు అయిన వ్యక్తిని హాస్పిటల్ కు తీసుకొచ్చారు. ఆ వ్యక్తికి పావుగంట క్రితమే ప్రాణం పోయిందని నిర్ధారించారు. కానీ, అతడు మరణానంతరం తన శరీరమును దానం చేసిన వ్యక్తి అవ్వడం తిరుపతయ్యకు కలిసి వచ్చింది. తరువాతి రోజు తిరుపతయ్యకు కంటి ఆపరేషన్ అన్నారు.

రచయిత -ముద్దిరాల శ్రీనివాసులు.

3.00847457627
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు