పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కన్ను మనకు వెలుగు

కన్ను గురించి ముఖ్యమైన విషయాలు కొన్ని తెలుసుకుందాం.

msy3గుడ్ మార్నింగ్ సార్ అంటూ పిల్లలంతా ఉత్సాహంగా లేచి మల్లికార్జున్ సార్ కు విషెస్ చెబుతున్నారు. వేసవి సెలవుల అనంతరం తొలిరోజు పాఠశాలలో విద్యార్థులు ఉత్సాహం ఉరకలు వేస్తోంది. మీ అందరికీ కూడా నా విషెస్. వేసవి క్షేమంగా గడిపి మళ్ళీ మీరంతా మన పాఠశాలకే రావడం నా కూడా ఆనందంగా ఉంది. అది సరే గానీ పిల్లలూ వేసవిలో ఎవరెవరు ఏమేం మంచి పనులు చేసారో చెప్పాలి అన్నాడు సార్. ఒక్కసారిగా తరగతి గదిలో నిశ్శబ్దం. మంచి పనులు ఏం చేసామా అంటూ ఆలోచనలో పడిపోయారు. కొంతమంది వేళ్ళతో లెక్కలు వేసుకుంటున్నారు. నేను వేసవిలో పొలం పనుల్లో నాన్నకు సాయం చేసాను అన్నాడు రాము. నేను పశువులను మేపాను అన్నాడు మధు. ఈత నేర్చుకున్నాను అన్నాడు ఉపేందర్. సరే అది నీకు ఉపయోగపడుతుందిలే అన్నాడు టీచర్. ఇంతలో వర్షిత లేచి వేసవిలో నేను మా బంధువులింటికి హైద్రాబాద్ వెళ్లాను. అక్కడ రోడ్డు దాటలేక చేతిలో కర్రతో ఒకతను ఉంటే నేను అతన్ని రోడ్డు దాటించాను. అతను నాకు కృతజ్ఞతలు చెప్పాడు. చూపులేని వారిపై దయగలిగి ఉండాలని చెప్పి అతను నెమ్మదిగా వెళ్లాడు. చూపులేని వారు నిజంగా దురదృష్టవంతులు, ప్రపంచాన్ని మనకు చూపించేది కన్ను. రంగురంగులలో ఆవిష్కరించేది కన్ను. అది లేనివారికి ఈ లోకం అంధకారం. పగలైనా, రాత్రైనా ఒకటే వారికి. అందుకే కంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు సార్.

may4

“కన్ను గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పండి.” అంది రాధిక. సరే మీకందరికీ కన్ను గురించి ముఖ్యమైన విషయాలు కొన్ని చెబుతాను. ముఖభాగంలో రెండు కళ్ళు ప్రత్యేకంగా అమర్చబడి ఉంటాయి. కంటిలో ప్రధానమైంది కనుగుడ్డు (Eye Ball). దీన్ని రక్షించడానికి కంటిరెప్పలు (Eyelids), కనుబొమ్మలు (Eye Brows) ఉన్నాయి. కనుగుడ్డును తడిగా ఉంచడానికి అశ్రుగ్రంథులు (Lacrimal glands) ఉపయోగపడతాయి. దుమ్ము, దూళి, నలకలు కంట్లో పడినప్పుడు కన్నీరు విడుదలై వాటిని తొలగిస్తుంది. కన్నీటిలో లైసోజోమ్ (Lysozome) అనే ఎంజైమ్ ఉంటుంది. 6 కండరాలతో కన్ను మనకు అనుసంధానించబడి ఉంటుంది. ఇవి కన్ను యొక్క కదలికలను నియంత్రిస్తాయి. కనుగుడ్డు (Eye Ball) 3 పొరలుగా ఉంటుంది. 1. Fibrous Tunic, 2. Vascular Tunic, 3. Nervous Tunic పై పొర కంటికి ఆకారాన్నిస్తుంది. దీనిలో Sclera ని తెల్లగుడ్డు (White Eye) అంటారు. మధ్యపొర Vascular tunic వర్తులాకార మృధువైన కండరాలతో కూడి లెన్స్ ఆకారాన్ని, దగ్గరి దూరపు చూపు కొరకు అనువుగా మారుస్తుంది. Iris అనే భాగం కాంతిని కంటిలోపలికి పంపడాన్ని నియంత్రిస్తుంది. దూరపు వస్తువులని చూసేప్పుడు Iris వైశాల్యం పెరుగుతుంది. దగ్గరి వస్తువులను చూసేటప్పుడు Iris వైశాల్యం తగ్గుతుంది. Nervous tunic నే రెటీనా అంటారు. ఇది 3 పొరలకు కలిగి ఉంటుంది. 1.Photo receptor layer, 2.Bipolar cell layer, 3.Ganglion cell layer మొదట దానిలో Rods, Cones ఉంటాయి. Rods రోడాప్సిన్ ను కోన్స్ ఐడాప్సిన్ ను కలిగి ఉంటాయి. తక్కువ వెలుతురులో దృష్టి కొరకు Rods పగటి వెలుతురులో చూపు కొరకు Cones మరియు రంగులను గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఒక్క రెటీనానే తీసుకుంటే దానిలో 12 సంక్లిష్టమైన పొరలు, లక్షల కొద్దీ ప్రత్యేకత గల కణాలున్నాయి. రెటీనాలోని రాడ్స్, కోన్స్ కాంతి తరంగాలను సంగ్రహించి మెదడుకు సందేశాల రూపంలో పంపిస్తాయి. ఈ తరంగాల ప్రేరణని మన మెదడు అర్థం చేసుకొని మనకు స్పష్టమైన కదిలికలతోనూ, రంగులతోనూ నిండిన దృష్టిని ప్రసాదిస్తుంది. అందుకే కంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విటమిన్ 'A' కలిగిన ఆహార పదార్థాలైన క్యారెట్, బొప్పాయి, ఆకుకూరలు తినే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వేసవిలో బయటికెళ్లినప్పుడు Photogray కళ్ళజోళ్లను ధరించడం మంచిది. మనదేహంలో అన్ని అవయవాల కన్నా కన్నే ప్రధానమైంది. అందుకే 'సర్వేంద్రియానా నయనం ప్రధానం' అన్నారు పెద్దలు. ఇది అక్షర సత్యం.

ఆధారం: డా. వీరమాచనేని శరత్ బాబు

 

3.00970873786
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు