పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కాంతి సంవత్సరం అంటే?

కాంతి సంవత్రం గురించి, దాని వేగం గురించి తెలుసుకుందాం.

చిన్నారులూ... సూర్యుడి తర్వాత భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రమేదో మీకు తెలుసా అదే ఆల్ఫా సెంటారీ. భూమినుండి దూరం 42,000,000,000,000 కిలోమాటర్లు. దీన్నెలా చదవాలి ? 42 లక్షల కోట్ల కి.మీ. లేదా 42 ట్రిలియన్ కి.మీ. ఈ దూరాలను కొలవడానికి మన దగ్గర ఉన్న స్కేలు, విభాగిని, కొలత టేపు లాంటివి ఏమూలకొస్తాయి? అందుకే కాంతి సహాయంతో ఈ దూరాలను కొలుస్తారు. కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. ఆల్ఫా సెంటారీ నుండి బయలుదేరిన కాంతి భూమికి చేరడానికి 4.2 కాంతి సంవత్సరాలు పడుతుంది. అంటే మీరు 6వ తరగతివలో చేరినపుడు ఆల్ఫా సెంటారీ లో బయలుదేరిన కాంతి మీరు 10వ తరగతిలోకి వచ్చేనాటికి భూమిని చేరుతుందన్నమాట. అబ్బో ఇంత ఆలస్యమా? అనుకుంటారేమో మనకు తెలిసి ఇప్పటివరకు కాంతి కంటే వేగంగా ప్రయాణించగలిగేది మరొకటి లేదు.

కాంతి వేగం 1 సెకనుకు - 3 లక్షల కి.మీ.

1 నిముషానికి - (3 లక్షలు x 60) కి.మీ.

1 గంటకు - (3 లక్షలు x 60 x 60) కి.మీ.

1రోజుకు - (3 లక్షలు x 60 x 60 x 24) కి.మీ.

1 సంవత్సరానికి - (3 లక్షలు x 60 x 60 x 24 x 365) కి.మీ.(10 లక్షల కోట్ల కి.మీ.)

ఈ దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. కాంతి సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకొని గెలాక్సీల మధ్య దూరాలను, నక్షత్రాల మధ్య దూరాలను కొలుస్తారు. కాంతి వేగంతో ప్రయాణంచే వాహనాన్ని తయారుచేసుకొంటే మనం దగ్గరగా ఉన్న లిటిల్ స్టార్స్ ని చేరుకొని కబుర్లు చెప్పుకోవచ్చు.

3.00414937759
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు