హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / కూల్ డ్రింక్స్ మానేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కూల్ డ్రింక్స్ మానేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం.

పుట్టినరోజు వేడుకైనా, పండుగలైనా, విందువినోదాలైనా కూల్ డ్రింక్స్ తాగడం అలవాటుగా మార్చుకుంటున్నాం. ఎండాకాలంలో ఇకచెప్పనే అక్కర్లేదు. నాలుక పిడచగట్టుకు పోతుంటే తియ్యని, ఘాటైన, చల్లని రంగునీళ్లు మనల్ని మురిపిస్తాయి. అన్ని కాలాల్లోనూ భోజనం చేస్తూ కూల్ డ్రింక్స్ చప్పరించడం స్టైలుగా ఉంటుంది.

కూల్డ్రింక్స్ అసలు ఉపయోగాల్ని వదిలేసి కేవలం వాటిని తాగడంతోనే ఆనందిస్తున్నాం. తాగేముందు వాటిలో ఏముందో ఓసారి చూద్దాం. ఇంకా ఎన్ని పనుల్ని చేసుకోవచ్చో తెలుసుకుందాం. కూల్ డ్రింక్స్ ఫాస్ఫారిక్ ఆసిడ్, కార్బోనిక్ ఆసిడ్, సిట్రైకాసిడ్, సాక్రిన్, పోలిఎతిలీన్ గ్లైకాల్, కెఫీన్, డి.డి.టి. లిండేన్ మలాతియాన్, క్లోరో ఫైరిఫాస్ అనే రసాయన అవశేషాలున్నాయి. వీటిలో రసాయనాలు ఉండటంతో మరుగుదొడ్లను, టైల్స్ ను శుభ్రం చేసుకోవచ్చు, బట్టలకు అంటిన గ్రీసు, తుప్పు, నూనె, రక్తపు మరకలను పోగొట్టొచ్చు, వంట పాత్రలకు పట్టిన జిడ్డు మరకలని పొగొట్టి మెరిపించవచ్చు, తుప్పు పట్టిన బోల్టులను వదులు చేయవచ్చు, కారు బ్యాటరీలను శుభ్రం చేయవచ్చు. మరి ఇంత ఘాటైన ద్రావకాన్ని కూల్ డ్రింక్స్ గా పేరు పెట్టి మన ఆరోగ్యాన్ని దెబ్బతీయటం ఎంత వరకు సబబు? ఆలోచించండి.

nov017.jpgఏ రకంగా చూసినా వీటిలో మనం తాగటానికి యోగ్యమైన లక్షణం ఒక్కటీ లేదు. ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి వీటిలో ఏమీ లేదు. ఇంకా నష్టపరిచే గుణాలు ఉన్నాయి. చిన్నపిల్లలకు కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ తో సమానం. ఇది లివర్ సిర్రోసిస్కుదారితీస్తుంది. కూల్ డ్రింక్స్ వల్ల క్యాన్సర్ రావడం, లివర్, కిడ్నీ, జీర్ణాశయంకు నష్టం కలగడం, పళ్లు దెబ్బతినడం, ఎముకలలో కాల్షియం తగ్గడం, కిడ్నీలలో రాళ్ళు తయారవడం, స్థూలకాయం, నాడీవ్యవస్థ దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయ్.

పైగా దీని వలన మనదేశం నుండి వేలకోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోతున్నాయి. ఇన్ని నష్టాలున్న కూల్డ్రింక్స్ కు దూరంగా ఉందాం. సహజమైన కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగాల్సిందిగా బాలలను ప్రోత్సహిద్దాం. ఆ దిశగా మనమూ పయనిద్దాం. మనదేశ సంపద మనకే ఉపయోగపడేలా చూద్దాం.

ఆధారం: డా. వీరమాచనేని శరత్ బాబు.

3.00847457627
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు