హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / కొంత దూరం పైకి వెళ్లిన వ్యోమగాములకు ఆకాశం నల్లగా కన్పిస్తుందని విన్నాము. కారణమేమిటి?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కొంత దూరం పైకి వెళ్లిన వ్యోమగాములకు ఆకాశం నల్లగా కన్పిస్తుందని విన్నాము. కారణమేమిటి?

వాతావరణం దాటి యింకా పైకి వెళ్లిన వ్యోమగాములకు వాతావరణం ఉండదు

aug1భూమ్మీద ఉన్న మనకు ఆకాశం నీలం రంగులో కనిపించడానికి కారణం వాతావరణమేనని తెలుసనుకుంటాము, సూర్యుడి నుంచి వచ్చే కాంతికిరణాలు మార్గ మధ్యంలో భూవాతావరణం గుండా మన నేలను చేరతాయి. ఆ క్రమంలో గాలిలో ఉన్న నైట్రోజన్, ఆక్సిజన్ వంటి వాయువులు తాత్కాలికంగా ఊదా, ఇండిగో నీలం రంగుల కాంతుల్ని బాగా శోషిస్తాయి (absorb). తిరిగి కొంత కాంతిని వెదజల్లుతాయి (scattering). ఇలా వెదజల్లబడిన కాంతిలో నీలం రంగు కాంతిని అన్ని వైపులకూ వెదజల్లడం. ఆ కాంతిని మనం చూస్తాము కాబట్టి మనకు మేఘల్లెని పైభాం నీలం రంగులో అగుపిస్తుంది. కాబట్టి ఆకాశపు నీలం రంగు ఆకాశానిది కాదు. భుమిదే అంటే భూమి వాతావరణానిదే !

వాతావరణం దాటి యింకా పైకి వెళ్లిన వ్యోమగాములకు వాతావరణం ఉండదు కాబట్టి కాంతిని విక్షేపణం చేసే అణువులు అక్కడ లేనట్టే కదా! తనంత తానుగా కాంతి ఏ రంగులో (wavelength) ఉన్నా కనిపించదు. పరమాణువులు అనువుల్లాంటి చిన్నవాటి పైన బియ్యము, చెక్కెర కొండలు గ్రహాలు నక్షత్రాల్లాంటి పెద్దవాటి పైన కాంతి పడి పరావర్తనం చెందినా, ఇచ్చినా అప్పుడు మాత్రమే మనకు అక్కడ కాంతి వున్నట్లు తెలుస్తుంది. ప్రపంచంలోని కాంతిని వస్తువులు వస్తు సముదాయాలే మన కళ్ల వైపు దారిమళ్లిస్తాయి. ఆక్రమంలో తగినంత మోతాదులో దృశ్యకాంతి మన కళ్ళకు చేరుతుంది. శూన్యాకాశంలో సౌరకాంతి నక్షత్ర కాంతి ఋజు మార్గంలో వెళ్లడం వల్ల అది మన కంటిని సూటిగా చేరే భాగం చాలా తక్కువ గా ఉంటుంది. అందుకే నక్షత్రాలు, సూర్యుడు నల్లని నేపధ్యంలో వెలిగే బల్బుల్లా అనిపిస్తాయి. తమాషా ఏమిటంటే పగలు సుూర్యుడితోపాటు చంద్రుడు ఇతర గ్రహాలు, నక్షత్రాలు అన్ని వాటి వాటి సాపేక్ష సైజుల్లో కనిపిస్తాయి.

ఆధారం: ప్రొ. ఎ.రామచంద్రయ్య

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు