పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

క్యూబా

క్యూబా దేశం గురించి తెలుసుకుందాం.

cubaఉత్తర అమెరికా ఖండానికి, దక్షిణ అమెరికా ఖండాన్ని కలుపుతూ ఉన్న సన్నని భూభాగానికి సమీపంగా కరేబియన్ సముద్రంలో ఉండే ద్వీపం క్యూబా దీనికి ఉత్తరంగా అమెరికా పడమట బహామాస్ మెక్సికో దక్షిణాన జమైకా సమీపంగా ఉన్న దేశాలు. ఆంధ్రప్రదేశ్ వైశాల్యంలో సగమే ఉండే ఈ దేశ జనాభా ఒక కోటి 11 లక్షలు. వారిలో 65% శ్వేత జాతీయులు, 10 శాతం ఆఫ్రికా సంతతి వారు కాగా 24 % మిశ్రమ సంతతి వారు. ప్రధానంగా రోమన్ కేధలిక్కులైన క్యూబన్ ల జాతీయ భాష స్పానిష్. రిపబ్లిక్ రావుల్ కాస్ట్రా రాజధాని హవానా.

1492 సంవత్సరం క్రిస్టోపర్ కొలంబస్ ఈ దేశం పై అడుగు పెట్టాడు. అనంతరం స్పెయిన్ నుంచి ప్రలు వలస వెళ్ళి అక్కడి స్ధానిక ప్రజలను తరమి వేసి ఆక్రమించుకున్నారు. ఆఫ్రికా నుంచి బానిసలతో వ్యవసాయ దేశంగా తీర్చిదిద్దారు. 1898 లో అమెరికా స్పెయిన్ ఓడించి 1902 లో స్వాతంత్ర్యదేశంగా ప్రకటించింది. అమెరికన్ కంపెనీల కు వ్యతిరేకంగా ఫిడైల్ కాస్ట్రా నాయకత్వంలో 1959 లో సాగిన విప్లవ ఫలితంగా సోషలిస్టు దేశంగా రూపొందింది.

వంద శాతం అక్షరాసత్యతో అందరికి ఆరోగ్య సౌకర్యాలతో ఉంచిత విద్యతో ప్రపంచానికి ఆదర్శంగా ఉంది. ప్రపంచంలో ఎ మూల ప్రకృతి విపత్తులు సంభవించినా క్యూబా తన వైద్యులతో ఆదుకుంటుంది.

2.99401197605
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు