హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / క్రొత్త ఎల్.ఇ.డి. లకు వెలుగు చూపిన మిణుగురు పురుగులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

క్రొత్త ఎల్.ఇ.డి. లకు వెలుగు చూపిన మిణుగురు పురుగులు

LED లకు దారి చూపిన మిణుగురు పురుగులూ..... జిందాబాద్! అని నినదిద్దాం.

ledఅంతర్జాతీయంగా అమెరికా రసాయనిక సంఘం (American Chemical Society) చాలా పేరున్న శాస్త్రవిజ్ఞాన సంస్థ, వందలాదిగా ఆధునిక పరిశోధనా పత్రికలను నడిపే సంస్థ యిది. అత్యధిక సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా సభ్యులున్న రసాయనిక శాస్త్రవేత్తల సంఘం కూడా అదే. చెప్పుకోదగిన గొప్ప శాస్త్రవేత్తను కాకపోయినా అందులో నేను కూడా ఒక సభ్యుణ్ని.

"అమెరికా రసాయనిక సంఘం” వారు, వారం వారం ప్రచురించే (C&EN - Chemical & Engineering News) సంచికలో ఇటీవల ఓ గొప్ప పరిశోధన గురించిన వివరాలు ప్రకటించింది. 2014లో నోబెల్ బహుమతికి ఎంపికయిన LED (Light Emitting Diode) ల విషయంలో విప్లవాత్మకమైన కొత్త పరిశోధనా ఫలితాలు వెలువడ్డాయి. LED లలో సాధారణంగా నిరింద్రియ పదార్థాల (Inorganic materials) ను వాడడం కద్దు. కాని వంచడానికి వీలుగా, తడిసినా చెడిపోకుండా ఉండేలా సేంద్రీయ పదార్థాల (Organic materials) తో నిర్మితమయ్యే విధంగా OLED (Organic Light Emitting Diode) ఈ మధ్యనే రూపొందాయి. అవి మన దైనందిన జీవితంలో ఇపుడిపుడే భాగమవుతున్నాయి.

ఈలోగా కొరియా దేశానికి చెందిన కి. హున్. జియాంగ్ (Ki-Hun-Jeong) కు ఓ ఆలోచన తట్టింది. వర్షాకాలంలో రాత్రుళ్ళు మిణుకు మిణుకుమంటూ నల్లని చీకట్లో నక్షత్రపు మిణుకుల్లాగా వెలిగే మిణుగురు పురుగుల మీద ఆయన దృష్టి సారించాడు. మిణుగురు పురుగులలో వెలుగునిచ్చే శరీరభాగాలను శ్రద్ధగా పరిశీలించాడు. రసాయనిక శక్తి కొన్ని జీవుల్లో కాంతి శక్తి గా మారుతుంది. ఈ విధానాన్ని విజ్ఞానశాస్త్రంలో జీవధృతి (Bioluminescence) అంటారు. ఈ జీవధృతికి కారణమైన అవయవ నిర్మాణాన్ని కాపీ కొడితే కొత్త పద్దతిలో OLED లను నిర్మించగలమా? లేదా? అన్న ఆలోచన చేశాడు.

పిల్లలూ చూడండి! మీరు కూడా ప్రకృతిలో జరిగే ఎన్నో వింతల్ని చూసి “అదంతేలే. అది దేవుని సృషేలే' అనుకుని, ఉదాసీనంగా ఉండకుండా సృష్టికి ప్రతిసృష్టి చేసేలా సృజనాత్మకతను పెంచుకోవాలి.

మిణుగురు పురుగులలో జీవధృతిని జరిపే అవయవాల్లో నానో సైజులో చేపల మీద ఉన్నట్లుగా పొలుసులను గుర్తించాడు. అవి కాంతిని అన్ని వైపులకు సమానంగా విస్తరిస్తున్నట్లు కనుగొన్నాడు. అక్కడున్న చర్మపు పొర మీదున్న కైటిన్ అనే పదార్థంతో నిర్మితమయిన క్యూటికల్ దగ్గర గాలి పీడనం చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా వక్రీభవనం చెందకుండా త్రికోణాకృతిలో అన్ని దిక్కులకు కాంతి చిమ్మటాన్ని జియాంగ్ గమనించాడు. అక్కడ కుంభాకారంగా పారదర్శక కైటిస్ బుడిపెలు ఉండడాన్ని గుర్తించాడు.

అతి తక్కువ సైజులో ఉన్న ఈగ లాంటి బుడత జీవైన మిణుగురు పురుగు దాదాపు సెకనుకు రెండు మార్లు రాత్రంతా.... మిణుకు మిణుకుమంటూ వెలుగుతూనే ఉండడమంటే.., రసాయనిక శక్తిని చాలా పకడ్బందీగా... వృధా ఏమీ లేకుండా కాంతి శక్తిగా మార్చుకుంటుందన్నమాట. ఇంకేముంది? జీమాంగ్లు వెంటనే గొప్ప ఆలోచన వచ్చింది. మిణుగురు పురుగుల జీవధృతి అవయవాల పొరపై పొలుసులు ఉండడమే కాకుండా వాటి మీద బుడి పెలుగా కుంభాకార కటకాల్లాగా ఉండడాన్ని బట్టి OLED నిర్మాణాన్ని కూడా త్రికోణాకృతిలో మలిచి వాటిపై పారదర్శకంగా ఉండేలా కుంభాకార (convex) బుడి పెలను ఉంచితే ఏమవుతుందో? చూద్దామనుకున్నాడు. ఇంకేముంది. మొత్తం 60 శాతం మేరకు అదనపు వెలుగులు OLED లు చిమ్మాయి. అంటే ఇంతకు మునుపు 100 యూనిట్ల విద్యుత్ ఖర్చుతో వచ్చే LED ల వెలుగు యిపుడు దాదాపు 60 యూనిట్ల విద్యుత్ ఖర్చుతో వస్తుందన్న మాట. ఎంత శక్తి ఆదా! ఈ విషయాన్ని ఆయన ఈమధ్యనే Nano Letters అనే పరిశోధనా పత్రికలో ప్రచురించాడు. ఇక OLED లతో నిర్మితమయ్యే LED ల్యాంపులు, TV లు, Monitor ల తెరలు మరింత వెలుగును తక్కువ ఖర్చుతో యివ్వగలవని C&EN పత్రిక జీయాంగ్ ను ప్రశంశిస్తోంది.

అయితే జీవవైవిధ్యం దెబ్బతింటుందన్న మన ఆందోళనలో మిణుగురు పురుగులు కూడా ఉన్నాయి. గాడిదలు, పిచ్చుకలు, పులులు, సింహాల్లాగే అంతరించిపోతున్న జీవజాతుల్లో (Endangered Species) మిణుగురు పురుగులూ ఉన్నాయి.

మిణుగురు పురుగులు ఆరోపొడా (Orthopoda) వర్గంలో కీటకాల (Insects) తరగతికి చెందినవి. ల్యూసి సెరిన్ అనే రసాయనాన్ని ల్యూసిఫెరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో 500 నుం: 700 నానోమీటర్ల తరంగధైర్యం (Wavelength ఉండే లా మిణుగురు పురుగులు కాంతిశకి ని వెదజల్లుతాయి. మిణుగురు పురుగులు అంతరించి పోకుండా వెలుగుతూనే ఉండాలని ఆశిద్దాం. అందుకు ప్రకృతికి సహకరిద్దాం. LED లకు దారి చూపిన మిణుగురు పురుగులూ..... జిందాబాద్! అని నినదిద్దాం.

ఆధారం: ప్రొ. ఎ. రామచంద్రయ్య

2.99426934097
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు