పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గణిత గమ్మత్తులు

వివిధ రకాల సంఖ్యల గురించి తెలుసుకుందాం.

హాయ్ పిల్లలూ! 1,2,3.... లెక్కించడానికి వాడే సంఖ్యలని సులభంగా చెప్పేస్తాం. కానీ మనకు తెలియని ఎన్నో ధర్మాలను పాటించే సంఖ్యలు చాలా వున్నాయి. ప్రతి నెలా మీకు కొన్నింటిని పరిచయం చేస్తాను.

1. పరిపూర్ణ సంఖ్యలు (Perfect Numbers):

ఒక సంఖ్యకు గల అన్ని కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకు సమానమైతే, ఆ సంఖ్యను "శుద్ధ సంఖ్య” లేదా ”పరిపూర్ణ సంఖ్యలని" అంటారు. 500 లోపు పరిపూర్ణ సంఖ్యలు 6, 28, 496 మాత్రమే.

ఉదా. 6 కారణాంకాలు = 1, 2, 3 = 1+2+3 = 6

28 కారణాంకాలు = 1, 2, 4, 7, 14 =1+2+4+7+14=28

amicablenumbers2. స్నేహ సంఖ్యలు (Friendly or Amicable Numbers):

ఏదైనా రెండు సంఖ్యలలో ఒక దాని కారణాంకాల మొత్తము రెండవ సంఖ్యకు పరస్పరం సమానం అగునట్టు ఉంటే, ఆ రెండు సంఖ్యలను "స్నేహ సంఖ్యలు" అంటారు.

ఉదా. 220 కారణాంకాలు  = 1, 2, 4, 5, 10, 11, 20, 22, 44, 55, 110

వీటి మొత్తం = 1+2+4+5+10+11+20+22+44+55+110 = 284

284 కారణాంకాలు = 1+ 2+ 4+71+142

వీటి మొత్తం = 1+2+4+71+142 = 220

220, 284 స్నేహ సంఖ్యలు (ఇదే అతి చిన్న జత)

3. డెమ్లో సంఖ్యలు (Demlo Numbers):

ఒక సంఖ్యలోని ఎడమ, కుడి చివరల గల ఒక అంకె లేదా రెండంకెల మొత్తం, ఆ సంఖ్య మధ్యలో ఉంటే అటువంటి సంఖ్యలను డెమ్లో సంఖ్యలని అంటారు.

ఉదా.

  1. 1 2 1 (1+1 = 2 మధ్యలోని అంకె)
  2. 1 2 2 1 (1+1 = 2 మధ్యలోని అంకె)

  3. 4 6 2 (4+2 = 6 మధ్యలోని అంకె)
  4. 4 6 6 2

    4 6 6 6 2

  5. 23 88 65 (మధ్యలోని సంఖ్య = 23+65 ఒకసారి)
  6. 23 8888 65(మధ్యలోని సంఖ్య = 23+65 రెండు సార్లు)

మీకు తెలుసా? కాప్రేకర్ అను గణిత శాస్త్రవేత్త Mumbai, Dombivili ల మధ్య ప్రతీరోజు Train లో ప్రయాణిస్తూ ఇటువంటి లక్షణాలు గల నెంబర్లకి ఆ వూరిపేరు గుర్తుగా ఆ సంఖ్యలకి డెమో సంఖ్యలని పేరు పెట్టారు.

4. దత్తాత్రేయ సంఖ్యలు (Three in- one Number):

ఒక వర్గ సంఖ్యలోని అంకెలు లేదా అంకెల వరుస సమూహాలు కూడా ఖచ్చిత వర్గ సంఖ్యలుగా గల సంఖ్యలను దత్తాత్రేయ సంఖ్యలు అంటారు.

ఉదా.72 = 49 (4 = 22, 9 = 32)

132 = 169 (16 = 42, 9 = 32)

572 = 3249 (324 = 182, 9 = 32)

ఇలా రెండే కాదు, మూడు అంతకన్నా ఎక్కువ వర్గాలు కలిగి వున్న దత్తాత్రేయ సంఖ్యలు ఇంకా చాలా ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం!

5. మంకీ సంఖ్యలు (Monkey Numbers):

ఏదైనా రెండంకెల లేదా మూడంకెల సంఖ్యను వర్గము లేదా ఘనం చేసినపుడు వచ్చు ఫలిత సంఖ్యలో ఆ సంఖ్య ఏదో ఒక స్థానంలో రావడం జరిగితే అటువంటి సంఖ్యలని "మంకీ సంఖ్యలు” అంటారు. (అర్థంకాక బుర్ర గీక్కుంటున్నారా!. సరే ఉదాహరణలు గమనించండి)

ఉదా. 102 = 100

252 = 625

502 = 2500

602 = 3600

323 = 322551

493 = 117649

833 = 47458321

1073 = 131079601

(ఇక, మీరు వర్గాలు, ఘనాలతో మరికొన్ని చెప్పండి చూద్దాం!)

6. విజయ సంఖ్యలు (Victory Numbers):

ఏదైనా ఒక సంఖ్య యోక్క ఘనంలోని అంకెల మొత్తం, తిరిగి ఆ సంఖ్యకి సమానమైతే అటువంటి సంఖ్యలని "విజయ సంఖ్య" లని అంటారు.

ఉదా. 83= 512 = 5+1+2 = 8

183 = 5832 = 5+8+3+2 = 18

చూశారా పిల్లలూ, ఎన్ని రకాల సంఖ్యలున్నాయో! ఇంకా చాలా రకరకాల సంఖ్యలున్నాయి. Next time మళ్లీ క్రొత్త క్రొత్త రకాల సంఖ్యలని మీకు పరిచయం చేస్తాను. అంతవరకు మీరు కూడా సంఖ్యల వర్గాలు, ఘనాల్లో ఇంకా ఏమైనా క్రొత్త ధర్మాలను కలిగివున్న సంఖ్యలని కనుగొని "చిన్ని గణిత శాస్త్రవేత్తగా" పేరు తెచ్చుకుంటారు. కదూ!

రచన: -టి. తులసి, సెల్:9493047625

2.98850574713
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
వెంకట్ Jul 18, 2018 11:31 PM

Excellent Madam

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు