హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / గురు గ్రహంపై భారీతుఫాను ఫోటోలు పంపించిన జూనో
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గురు గ్రహంపై భారీతుఫాను ఫోటోలు పంపించిన జూనో

అంతరిక్షనౌక ‘జూనో’ గురుగ్రహంపై భారీ తుఫాను గ్రేట్ రెడ్ స్పాట్ ఫోటోలను ఇటీవల తీసి పంపించింది.

juno2011 ఆగష్టు 5న నాసా ప్రయోగించిన సౌరశక్తితో పనిచేసే అంతరిక్షనౌక ‘జూనో’ గురుగ్రహంపై భారీ తుఫాను గ్రేట్ రెడ్ స్పాట్ ఫోటోలను ఇటీవల తీసి పంపించింది. ఈ గ్రేట్ రెడ్ స్పాట్ను సౌరకుంటుంబంలోనే అతి పెద్దదిగా చెబుతున్నారు. ఈ నౌకలోని జూనో క్యామే పరికరం జూలై 10 న ఈ ఫోటోలను తీసింది. ఈ తుఫాను గత 350 ఏళ్ళుగా గురుగ్రహంపై చెలరేగుతోంది. వందల ఏళ్ళుగా ఈ తుఫానును గమనిసూ దాని వివరాలను అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారని శాన్టోనియోలోని సౌత్ వెస్ట్ ఇన్స్టిట్యూట్ కు చెందిన స్కాట్ బోల్డన్ చెప్పారు. ఈ గ్రేట్ రెడ్ స్పాట్ సుమారు - 16350 కి.మీ. వెడల్పులో ఉంటుంది. అంటే భూమి వెడల్పుకు 1.3 రెట్లు ఎక్కువ.

3.00806451613
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు