పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గ్రహాల లెక్కలు

ఆకాశంలోని గ్రహాల లెక్కల గురించి తెలుసుకుందామా!

jun3హాయ్ పిల్లలూ! గత సంచికలో మొక్కల ఆకులు పిబోనాకీ సంఖ్యల అమరికను పాటిస్తాయని తెలుసుకున్నాం కదూ! ఇప్పుడు ఆకాశంలోని గ్రహాల లెక్కల గురించి తెలుసుకుందామా!

1175 సం. లో ఇటలీలోని పీసానగరంలో జన్మించిన “లియొనార్డో ఫిబోనాకీ” అనే ప్రసిద్ధ గణితశాస్త్రవేత్త విచిత్ర లక్షణం గల అంకెల అమరికను కనిపెట్టారు. 1, 1, 2, 3, 5, 8.... ఈ శ్రేణిలో మొదటి సంఖ్య తప్ప, ఏ రెండు సంఖ్యల మొత్తం అయినా వాటి వెంటనే వచ్చు సంఖ్యకి సమానం.

అనగా 1+1 = 2, 1+2 = 3, 2+3 = 5, 3+5 = 8..... ఇంచుమించు ఇటువంటి వరుసక్రమమే సౌరకుటుంబంలోని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పట్టు సమయంలో కనబడుతోంది.

సూర్యుని నుంచి 8వ గ్రహమైన నెప్యూన్ ఒకసారి సూర్యుని చుట్టిరావడానికి సుమారు 60,000 రోజులు పడుతుంది. 7 వ గ్రహమైన యురేనస్ సూర్యుని చుట్టి రావడానికి 30,000 రోజులు పడుతుంది. వీటి నిష్పత్తి = 30,000/ 60,000=1/2

తరువాత 6వ గ్రహమైన శని, సూర్యుని చుట్బ తిరిగి రావడానికి 10,750 రోజులు పడుతుంది. శని, యురేనస్ కాలాల నిష్పత్తి సుమారుగా 1/3.

5 వ గ్రహమైన గురుగ్రహం పరిభ్రమణకాలం 4344 రోజులు. గురు, శని పరిభ్రమణాల కాలాల నిష్పత్తి సుమారుగా 2/5. సౌరకుటుంబంలో 4వ గ్రహం కుజుడు. కానీ కుజు, గురుగ్రహాల మధ్య కొన్ని వేల లఘుగ్రహాలు (Asteroids) తిరుగుచున్నాయి. చాలాకాలం క్రిందట కుజ, గురు గ్రహాల మధ్య మరొక గ్రహం ఉండేదనీ, అది ఏ కారణం చేతనో పగిలి తునాతునకలై ఆ రెండు గ్రహాల మధ్య ముక్కలై తిరుగుచున్నదని ఒక సిద్ధాంతం ఉంది.

jun4ఈ గ్రహ శకలాల పరిభ్రమణ కాలం 3 1/2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకూ ఉంది. ఇక్కడ ఫిబోనాకీ సూత్రం సరిగా వర్తిస్తుందో లేదో చెప్పడం కష్టం. ఒకవేళ ఆ గ్రహం పగిలిపోకుండా ఉండి ఉంటే దాని పరిభ్రమణ కాలానికీ, గురుగ్రహ పరిభ్రమణ కాలానికీ నిష్పత్తి 3/8 అయి ఉండాలి. అంటే ఆ గ్రహం యొక్క పరిభ్రమణ కాలం 4.48 సం. లు అయి ఉండాలి. కుజ, గురుగ్రహాల మధ్య గల గ్రహశకలాల సరాసరి పరిభ్రమణ కాలం 4.75 సం. అంటే దాదాపుగా సరిపోయింది కదూ! ఎంత విడ్డూరమో!

ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమంటే, ఈ లఘుగ్రహాలు (Asteroids) చెల్లాచెదురుగా తిరగటం లేదట, ముఖ్యంగా మూడు గుంపులుగా ఉన్నాయట. వీటి పరిభ్రమణ కాలాలకు, గురుగ్రహ పరిభ్రమణ కాలానికి నిష్పత్తిని చూస్తే 1/2, 1/3, 2/5 వచ్చాయి. ఇవి మళ్ళీ ఫిబోనాకీ సంఖ్యలే కదా!

ఈ Asteroids తరువాత కుజుడు. దీని సూర్య పరిభ్రమణ కాలం 687 రోజులు (లేదా 1.382 సం.) దీనికి లఘుగ్రహాల (Asteroids) సరాసరి పరిభ్రమణ కాలం 4.75 సం. కి నిష్పత్తి చూస్తే 5/13 కి చాలా దగ్గరగా వుంది.

చూశారా పిల్లలూ! గ్రహాల పరిభ్రమణ కాలాల నిష్పత్తిలు వరుసగా 1/2, 1/3, 2/5, 3/8, 5/15.... ఇలా ఫిబొనాకీ సంఖ్యల అమరికను పోలి ఉన్నాయి.

నేల పైన పెరిగే చెట్ల ఆకుల అమరిక, ఆకాశంలో ఉండే సౌరకుటుంబంలోని గ్రహాల పరిభ్రమణ కాలాల నిష్పత్తికీ ఈ పోలిక ఎందుకు వచ్చిందో ఆశ్చర్యం కదూ!

చెట్ల ఆకులకి సూర్యరశ్మి సరిగ్గా అందడానికి ఈ అమరిక అవసరమైనట్లే, గ్రహాలు సూర్యుని చుట్టూ నిర్దిష్ట మార్గాలలో గురుత్వాకర్షణకు లోబడి స్థిరంగా ఉండటానికి ఈ ఫిబోనాకీ సంఖ్యల అమరికలో సర్దుకుని ఉండటం అవసరమేమో!

ఆధారం: టి. తులసి

2.98795180723
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు