పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

చంద్రకళలకు కారణం ఏమిటి?

చంద్రకళల (Lunar phases) కు కారణం తెలుసుకుందాం.

5చాలా మందికి ఈ విషయంలో గందరగోళం ఉంది. సూర్యుని కాంతి చంద్రుని ఉపరితలం (lunar surface) మీద పడడం వల్లే వెన్నెల  వస్తుందని, వెన్నెల ద్వారానే చంద్రుడు కనిపిస్తాడని అందరూ ఏకీభవిస్తారు. అంతవరకు కరెక్టే. కానీ చంద్రునిపై పడే కాంతిని సరిగా పడనీయకుండా భూమి అడ్డు రావడం వల్లే చంద్రకళలు ఏర్పడతాయని కొందరి భావం. ఇది పూర్తిగా తప్పు. అలా జరిగితే ఆ స్థితిని చంద్రగ్రహణం (Lunar eclipse) అంటారు గాని చంద్రకళలు అనరు.

మరి కొందరు మరో భావం చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతున్న క్రమంలో వివిధ ప్రాంతాల్లో వివిధ తీవ్రతల్లో (intensity), వివిధ వైశాల్యాలలో సౌరకాంతి  పడడం వల్ల చందకళలు వస్తాయనుకుంటారు. ఇదికూడా తప్పు. మరో వాదన కూడా ఉంది. చంద్రుడు తను చుట్టూ తాను ఒకేసారి నెలలో తిరుగుతాడు కాబట్టి చంద్రుడి ఒక సగభాగం మీదే సౌరకాంతి పడుతుందని మన భూమి కూడా సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో ఆ వెలుగే చంద్రభాగాన్ని వివిధ కోణాల్లో చూస్తాం కాబట్టి చంద్రకళలు వస్తాయనుకుంటారు. ఇది కూడా తప్పే.

అసలు విషయం ఏమిటంటే చంద్రుడు నెలకు ఒ మారు భూమి చుట్టూ తిరగడం, తన చుట్టూ తాను తిరగడం చేస్తాడు. కాబట్టి చంద్రుని ఒ అర్థభాగమే దాదాపు లక్షలాది సంవత్సరాలుగా భూమివైపు ఉంటోంది. భూమి చంద్రుని సాపేక్షస్థితిలో సూర్యుని పరంగా వివిద భంగిమల్లో ఉండడం వల్ల సౌరకాంతి చంద్రుని ఒ అర్థభాగం మీద పడినా మన వైపున్న అర్థభాగంలో అమావాస్య తర్వాత పెరిగే క్రమంలోనూ, పౌర్ణమి తర్వాత క్రమంలోనూ కమబడుతుంది. మిగిలిన భాగం మనకు కనిపించని భాగంలో ఉంది.

3.0036101083
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు