పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

చంద్రునిపై మన మట్టి

చంద్రునిపై భూమియొక్క మట్టిఆనవాళ్లు

317.jpgఅంతరిక్షం నుంచి అంగారక శిలలో మరొకటో వచ్చి అమాంతంగా భూమికి గుద్దుకుంటాయని అందరూ భయపడుతుంటారు. ఇప్పడలా జరిగే అవకాశం అసలు లేదంటున్నారు గానీ నాలుగు వందల కోట్ల సంవత్సరాల క్రితం భూమికి ప్రతిరోజు కనీసం ఒక రాయయినా వచ్చి తాకు తుండేదట. అప్పటికింకా భూమిపుట్టి చాలాకాలం కాలేదు. అది తిరుగుతుండే దారిలో చిన్నా పెద్ద శిలలు లెక్కలేకుండా ఉండేవి. సరిగ్గా చెప్పాలంటే ఇప్పటికి నాలుగున్నర నుంచి మూడున్నర బిలియన్ సంవత్సరాల మధ్య కాలంలో భూమికి ఈ తాకిడీ చాలా ఎక్కువగా ఉండేది. ఇటీవల జరిగిన ఒక నాటో సదస్సులో ఈ విషయం గురించి చర్చలు జరిగాయి. అక్కడ కొన్ని ఆసక్తికరమయిన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

హెవీ బంబార్డ్ మెంట్ పీరియడ్ గా గుర్తించిన ఈ కాలం చివరన కొన్ని చిత్రాలు జరిగినట్లు పరిశీలకులు గుర్తించారు. సుమారు 3.8 బిలియన్ సంవత్సరాల కాలం నాటి భూగర్భ విశేషాలను బట్టి చూస్తే అప్పటికే భూమి మీద జీవం ఉండేదని తెలుస్తుంది. తాకిడులు జరిగిన వెనువెంటనే కూడా సూక్ష్మజీవులు కనిపించాయంటే, జీవం భూమి మీదకు, నిరంతరంగా జరిగిన ఆ తాకిడుల ద్వారానే వచ్చిందనడానికి వీలుంటుంది. కొందరు పరిశోధకులు అనుమానిస్తున్నట్లు , తోక చుక్కలు, అంగారక శిలలు జీవాల్ని తమ వెంట తెచ్చాయా... లేక జీవం పుట్టుకకు అవసరమయిన రసాయనాలు, వాటితో వచ్చాయా ఈ ప్రశ్నలకు జవాబులు ఎవరికీ తెలియవనే చెప్పాలి. అప్పటి శిలలను పరిశీలించగలిగితే జవాబులు దొరికే అవకాశం ఉందగి. కానీ భూమి మీదగాని, వాన, భూకంపాలు లోపలి కదలికలకు కారణంగా అప్పటి శిలలు అందుబాటులో లేకుండా పోయాయి. ఇప్పటి వరకూ అనుకుంటున్నది ఇంతవరకే అయితే నాటో సదస్సులో ఒక కొత్త ఆలోచన ముందుకు వచ్చింది. అలనాటి ఆధారాలను అందించగలరాచి నమూనాలు, మరికొన్ని అంశాలు ఈనాటికీ అందుబాటులో ఉన్నాయన్నదే ఆ ఆలోచన అయితే అవేవీ భూమి మీద లేవు. చంద్రుడి మీద ఉన్నాయని ఈ కొత్త సిద్ధాంతం చెపుతున్నది.

ఒక పెద్ద రాయివచ్చి భూమికి తగులుతుంది. బోలెడంత దుమ్మపైకి లేస్తుంది. అందులో కొంత, మరీ ఎత్తులకు ఎగిసి, భూమి తిరుగుతున్న మార్గంలోకి చేరుకుంటుంది. ఈ రకంగా అప్పట్లో భూమి చుట్టూ ఒక దుమ్ము మేఘం తయారయి తిరుగుతూ ఉండేది. నిజానికి ఇలా ఎగిరిన ఒక ముక్క చంద్రగోళంలా మారింది. శిలలు నిత్యం వచ్చి భూమికి తగులుతుండిన కాలంలో చంద్రుడు ఇప్పటికన్నా, కొంచెం దగ్గరగానే ఉన్నట్లు తెలుసు. ఇప్పటి దూరంలో మూడవ వంతు మాత్రమే. దూరం ఉండేదంటున్నారు. అలా ఉన్నందుకు, తాకిడీ కారణంగా పైకి దుమ్ము కొంతయినా చంద్రుని మీదకు చేరి ఉంటుందని సిద్ధాంతం... చంద్రుని మీద వాతావరణం (గాలి,వాన) లేదు. అక్కడ భూకంపాలు గానీ, లోపలి పొరలు కదలడం గానీ లేవు. అందుకని భూమి మీదనుంచి వెళ్లి చేరిన పదార్థం, అక్కడి ఉపరితలం మీద ఇంకా ఉండే ఉంటుందని నమ్మకం, చంద్రుని మీద కూడా రాళ్ల తాకిడి జరిగి కొంత పోయినా , పదార్థం కొంతయినా మిగిలి ఉంటుందని కూడా అంటున్నారు.318.jpg వాషింగ్ టన్ విద్యార్థులు ఈ విషయం గురించి పరిశీలనలు, లెక్కలు వేసి, చంద్రగ్రహం ఉపరితలం మీద వంద చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో కనీసం 20 వేల కిలోల పదార్థం భూమికి చెందినదయి ఉంటుందని తేల్చారు. సరయిన ప్రాంతాలను గుర్తించి, ఆ నమూనాలను తెచ్చుకోవడమే తరువాయి.

అపోలో నౌకల పుణ్యమా అని చంద్రుని నుంచి ఇప్పటికి నాలుగు వందల కిలోల మట్టిన తెచ్చి పెట్టారు. అందులో ఎక్కడయినా మన మట్టి కనిపించిందా అని ప్రశ్న పుట్టింది. ఎవరన్నా పరిశీలించారా అన్న అనుమానమూ తలెత్తింది.

రకరకాల కారణాలుగా మన చుట్టి చంద్రుని మీద తూర్పు భాగంలో ఎక్కువగా ఉంటుందని సూచనలు అందాయి. చంద్రుని శిలల నుంచి మన మట్టిని వేరుచేసి గుర్తించి తెచ్చుకుంటే కొత్త సంగతులు తెలుస్తాయి.

3.09195402299
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు