పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

చక్రం - ఆవిష్కరణ

woneభూమి మీద నడిచే, గాలిలో ఎగిరే వాహనాలన్నీటికి సాధారణంగా ఏమి కలిగి వుంటాయి? వెంటనే మనకు చక్రం అని గుర్తుకు వస్తుంది.

 

కొన్ని వాహనాలకు చక్రాలు చిన్నవిగాను, కొన్నింటికి పెద్దవిగాను ఉంటాయి. కొన్ని వాహనాలకు రెండు చక్రాలు వుంటే కొన్నింటికి మూడు చక్రాలు వుంటాయి. మరికొన్ని వాహనాలకు అనేక చక్రాలు వుంటాయి.

 

wtwoఅయితే ఈ చక్రం ఎలా పుట్టిందో, ఈ చక్రం ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే మనకు ఆశ్చర్యం కల్గుతుంది. మరి తెలుసుకుందామా!

 

చాలా కాలం వరకూ మానవునికి ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేవు. కేవలం నడకనే ఎంత దూరమైనా వెళ్ళాల్సివచ్చేది.

 

తర్వాత బరువైన వస్తువులను ఎత్తు ప్రదేశాలనుండి దొర్లించడం మొదలు పెట్టాడు. అయినా ఈ పద్ధతి దూరప్రదేశాలకు తీసుకొని వెళ్లడానికి వీలుకాలేదు.

 

wthreeమానవుడు తన సామాన్లను తానే మోసుకొని వెళ్ళేవాడు లేదా కొన్ని జంతువులపై పెట్టుకొని వెళ్ళేవాడు.

 

ఐతే ఎక్కువ బరువైన వస్తువులను జంతువులపై పెట్టుకొని వెళ్ళడానికి వీలుకాలేకపోయింది.

 

మానవుడు మందమైన, గుండ్రంగా ఉండే చెట్ల కాండాలను కొద్దిపాటి బలంతో దొర్లించవచ్చని తెలుసుకున్నాడు.

 

wfourచెట్లయొక్క కాండాలను చిన్న ముక్కలుగా చేసి దొర్లించడానికి ప్రయత్నించాడు. అవి సులభంగా దొర్లడం గమనించాడు.

 

రెండు గుండ్రని చెట్లకాండపు ముక్కలను ఒక పొడవాటి కర్రతో కలిపి ఒక బండిగా తయారు చేశాడు.

 

రెండు వేర్వేరు పరిమాణాలున్న చెట్ల కాండ ముక్కలను కలిపి దొర్లించడం మొదలు పెట్టాడు. ఐతే ఈ బండి ఎగుడుదిగుడు ప్రదేశాలపై వెళ్లడం కష్టమని భావించి ఆలోచించి ఒక సాధనను కనుగొన్నాడు.

 

wfiveఒకసారి ఒకే పరిమాణం వున్న రెండు చక్రాలను ఉపయోగించి చూశాడు. అతి సులభంగా దొర్లడం గమనించాడు.

 

ఈ విషయంతో మానవుడు కుండలు తయారీకీ ఉపయోగించే కుమ్మరి చక్రం తయారు చేసి కుండలు తయారు చేసాడు.

 

తర్వాత చక్రాలకు వేరువేరు రూపాలు ఇచ్చి వివిధ వాహనాలను తయారు చేశాడు. ఈ చక్రాలను చెక్క, ఇనుము, రబ్బరు మొదలైన వాటితో తయారు చేసి వేరువేరు వాహనాలకు బిగించాడు.

 

wsixఈ చక్రాలను కేవలం వాహనాలలో కాకుండా వేర్వేరు యంత్రాలలో ఉపయోగించడం నేర్చుకున్నాడు.

 

ఈ చక్రాన్ని గిలకగా మార్చుకొని బావుల నుండి నీరు తోడుకోవడానికి ఉపయోగించాడు.

 

ఈ రోజుల్లో సులభంగా బరువులు ఎత్తే పెద్దయంత్రాలైన క్రేన్లలో ఈ గిలక (పుల్లీ) ని వాడుతున్నాడు. ఇంకా ఈ చక్రాలను వివిధ చిన్న, పెద్ద యంత్రాలలో ఉపయోగిస్తున్నాం.

 

wsevenఇంకానీటి నుండి, గాలినుండి విద్యుత్తును తయారుచేసి టర్టైన్ లు , గాలిమరలలో ఈ చక్రాల ప్రాముఖ్యత ఎంతైనా వుంది.

చూశారా పిల్లలూ! మానవుని చేత మానవుని కొరకు ఆవిష్కరించిన ఈ చక్రం ఎంత గొప్ప పరిశోధనకు దారితీసిందోs!

రచన: M.V.S.S.H.ప్రసాదు Msc., B.Ed S.S.(PS), Z.P.H.S. కొత్తపట్నం - 523 286, ప్రకాశం జిల్లా.

3.0
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు