పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

చెమట

మనిషికి చెమట పట్టడం చాలా సహజమైన లక్షణం.

sweatమనిషికి చెమట పట్టడం చాలా సహజమైన లక్షణం. ప్రతి మనిషికి ప్రతిక్షణం ఎంతోకొంత చెమట పడ్తుంటుంది. ఇది నిజానికి ఒక ఆత్మరక్షణ ప్రక్రియ. చెమటలో 99 శాతం నీరు, ఒక శాతం లవణాలు, అమైనోయాసిడ్ లు ఉంటాయి. చెమట పడుతుంది. పెరుగేత్తినపుడు, శారీరక కష్టం చేసినపుడు ఎండాకాలంలో ఎక్కువ చెమట పడుతుంది. పరుగెత్తినపుడు, శారీరక కష్టం చేసినపుడు వ్యాయామం చేసినపుడు కూడా ఎక్కువగా చెమట పడుతుంది,. చెమట అనేది మన చర్మంలో ఉంటే శ్వేధగ్రంధాలు నుండి విడుదలైన శరీర ద్రవం (Body Liquid).

మన శరీరం 98.6 డిగ్రీల ఫారెన్ హీట్ లేదా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత దాటితే మనం జ్వరం వచ్చిందంటాం. బయట వాతావరణంలో 37 డిగ్రీల సెల్సిస్ కన్నా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే మన శరీరంలోని చర్మంలోని శ్వేదగ్రంథుల రంద్రాలద్వారా చెమటని చర్మం పైకి విడుదల చేస్తుంది. ఇలా విడుదలైన చెమట ఆవిరిగా మారేందుకు శరీరంలోని నేటిని ఉపయోగించురియం వల్ల శరీర ఉషాగ్రతని 98.6. F పద్ద ఉంచుతుంది.

మీరు ఒక చిన్న ప్రయోగం చేయండి. చేతి పై భాగంలో ఒక చుక్క నీటిని పోసి ఆ ప్రాంతం నీ నోటితో గాలిని వదలండి. నీటిచుక్క ఉన్న ప్రదేశం చల్లగా ఉంది మిగతా ప్రదేశం వేడిగా ఉంటుంది. ఎందుకంటే నీరు ఆవిరవడానికి కావలసిన ఉష్ణోగ్రతని శరీరం నుండి తీసుకుంటుంది కాబట్టి ఆ ప్రదేశం చల్లగా ఉంటుంది. ఒక చుక్క చెమట ఆవిరిగా మారడానికి దాదాపు ఒక లీటరు రక్తం చల్లబడుంది అని శాస్త్రవేత్తల అంచనా.

మనం వ్యాయామం చేసినపుడు, పరుగెత్తినపుడు మన శారీరక ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాన్ని తగ్గించడానికి శరీరం చెమటని విడుదల చేసి శారీరక ఉష్ణోగ్రత పెరగకుండా నియంత్రిస్తుంది. చెమట ఎంత ఎక్కువగా పడ్తుందో శరీరంలో నీరు అంత తగ్గిపోతుంది. అందుకనే ఎండాకాలం బయటకు వెళ్ళేప్పుడు నీళ్ళు బాగా తాగి బయల్దేరాలి. లేదా వడదెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. చలికాలంలో ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయడానికి కూడా కారణం చెమటే, శరీరంలో నీరు చెమట రూపంలో ఎక్కువగా బయటకు వెళ్తున్నపుడు మూత్రరూపంలో వీటిని పోనివ్వకుండా మూత్రపిండాలు నియంత్రిస్తాయి. అలాగే చలికాలంలో చెమట తక్కువగా వస్తుంది కాబట్టి శరీరంలోని అధిక నీటిని మూత్రరూపంలో బయటకు పంపి మూత్రపిండాలు నీటి శాతాన్ని నియంత్రిస్తుంటాయి.

ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తుంది. వీటివల్ల దాహం తగ్గక పోగా కాసేపటికి మళ్ళీ నీళ్ళు తాగాలనిపిస్తుంది. అందువల్ల ఎండాకాలంలో బయటకు వెళ్ళినప్పుడు దాహం వేస్తే పళ్ళరసాలు, కొబ్బరినీళ్ళు మజ్జిగ లాంటివి త్రాగడం ఈ వలన వడదెబ్బకు గురికాకుండా ఉండొచ్చు కదూ!

ఆధారం: సి.హెచ్. ఆనంద్

2.9863760218
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు