పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

జలుబు

జలుబు యొక్క లక్షణాలు మరియు చికిత్స గురించి తెలుసుకుందాం.

july16పిల్లలలో సాధారణ జలుబు:

సంవత్సరంలో ఒక సారైనా జలుబు చేయడం సహజం. ఇది అంత ప్రమాదం కాదు. కాని మన రోజువారి పనులకు మాత్రం కొంచెం ఇబ్బందిగానే వుంటుంది.

జలుబు ఎందుకు వస్తుంది?

సాధారణ జలుబుకు వంద రకాల వైరస్ లు కారణం. ఇది వాతావరణం ద్వారా, జలుబు చేసిన వ్యక్తుల ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. జలుబు ఒకరి నుండి మరొకరికి నోటి తుంపరలు, దగ్గినపుడు, తుమ్మినపుడు, మాట్లాడుతున్నపుడు, శ్వాస ద్వారా కూడా చాలా త్వరగా వ్యాపిస్తుంది. ఈ తుంపరలు ఇతరుల కళ్లను చేరినపుడు వారికి కూడా జలుబు సోకుతుంది.

సాధారణ జలుబు లక్షణాలు:

 • ముక్కు కారడం
 • దగ్గు
 • గొంతులో నొప్పి
 • తుమ్ములు
 • కొద్దిగా తలనొప్పి
 • కొన్ని సార్లు ఒళ్లునొప్పులు

చికిత్స

 • చేతులను తరచూ కడుక్కుంటూ వుండాలి.
 • నీళ్లు ఎక్కువగా తాగుతూ విశ్రాంతి తీసుకోవాలి.
 • తగినంత పౌష్టికాహారం తీసుకోవాలి.
 • నిమ్మ, నారింజ లాంటి విటమిన్ సి ఎక్కువగా వున్న పండ్లు తినాలి.
 • ఒళ్లు నొప్పులు, తలనొప్పిలాంటివి వుంటే బ్రూఫెన్ లాంటి మందులు వేసుకోవచ్చు.
 • తుమ్మినపుడు, దగ్గినపుడు, నోటికి అడ్డు పెట్టుకోవాలి.
 • జలుబు చేసిన పిల్లలు ఇతర పిల్లలతో కలువ కూడదు,ఎందుకంటే ఇది ఒకరి నుండి ఒకరికి తొందరగా వ్యాపిస్తుంది.
 • జలుబుకు వైద్యం అక్కర లేదు, సాధారణంగా దానిపాటికదే తగ్గిపోతుంది, ఆంటిబయాటిక్ మందులు అవసరం లేదు
 • ఇంకా చెప్పాలంటే వేసుకోకూడదని చెప్పవచ్చు. ఎందుకంటే జలుబు వంద వైరస్ల వల్ల వస్తుంది. వైరస్ కు ఆంటిబయాటిక్స్ పనిచేయవు.

ఆధారం: డా. ఎం. రమాదేవి

2.99710144928
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు