పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

టపాసు డాం డాం.... పర్యావరణం డాం డాం....

టపాసులను తోలిగిస్ధం పర్యావరణం కాపాడుకుందాం.

డా...డమాల్.....తుస్...టప్....టప్....సుర్......డమాల్......డాం.... ఈ శబ్దాలన్ని మీకు పరిచయమే కదా. దీపావళి వస్తే పిల్లoct046.jpgలకు అందమే ఆనందం. ఇంటిలో అతిరసాలు (కజ్జాయిలు) రకరకాల మిటాయిలు, కొత్త బట్టలు సాయంత్రం దీపాల వరుసలు. ఇక అసలు విషయం టపాసులు. ఓ ... దద్దరిల్లే శబ్దాలతో రంగురంగుల వెలుగులతో , దట్టమైన పొగతో టపాసులు కాల్చడం మీకు తెలిసిందే. మీరు చేసిందే ... మరి ఈ టపాసుల కధ ఏమిటో దాని లాభానష్టాలు ఏమిటో తెలుసుకుందామా.

టపాసులకు ఆద్యులు చైనీయులు. క్రి.పూ. 200 సం. లోనే వెదురు (బాంబూ) టపాకాయలు వాడినట్లు దాఖలో వుంది. దాన్ని చైనా బాషలో బాజు (Baozhu) అంటారు. పేలుతున్న వెదురు అని అర్ధం. తుపాకి మందు (Gunpowder) కనిపెంటేంత వరకు ఈ వెదురు టపాసులనే చైనా వారు వాడేవారు. క్రి.శ. 600ల ప్రాంతంలో చైనా వారు తుపాకి మందుని కనిపెట్టారు. గన్ పౌడర్ లేక బ్లాక్ పౌడర్ ఓ రసాయన ప్రేలుడు పదార్ధం. ఇది గంధకం, చార్కోల్, పోటాషియం నైట్రేట్ ల మిశ్రమం. దిన్ని Saltpeter అని అంటారు. ఇది మండినప్పుడు 427 నుంచి 464o ఉష్ణం వెలువడుతుంది. దీని తరువాత చేసేవారు అందుకే టపాసులకు బాజు పేరు స్దిరపడిపాయింది. క్రి.శ 900వ సం.లో చైనా నుండి టపాసు ఇంగ్లాండు అరబ్బు దేశాలు .... భారతదేశానికి చేరుకుంది.

ఆధునిక టపాకాయల తయారికి వాడే రసాయనాలలో 6 రకాలు వున్నాయి. అవి.

 1. ఇంధనం (Fuel): టపాకాయలు మండటానికి ఇంధనం కావాలి కదా. దీనికై బొగ్గుపొడి (చార్ కోల్), గన్ పౌడర్ లు వాడుతారు. వీటిలో ఆర్గానిక్ మూలకాలు వుంటాయి.
 2. ఆక్సికరణి (Oxidising Agent): టపాకాయలలోని రసాయడానికి మండటానికి కావలసిన ఆక్సిజన్ ను విడుదల చేయడానికి అక్సికరణి ఉపయోగాపడుతుంది. నైట్రేట్సు క్లోరేట్స్ లేదా పెర్ క్లోరేట్ లు అక్సికరణిగా వాడుతారు.
 3. క్షయీకరణి (Redusing Agents): అక్సికరణంలో విడుదలైన ఆక్సిజన్ మండటానికి వేడిగాలులు విడుదల కావడానికి ఇవి ఉపయోగపడతాయి. గంధకం (సల్ఫర్) చార్కోల్ లు క్షయీకరణిగా వాడుతారు. ఇవి మండి సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ లను విడుదల చేస్తాయి.
 4. రేగులేటర్ : టపాకాయలోని రసాయనిక చర్యను నియంత్రించడానికి (రెగులేషన్) ఈ రెగులెటర్ ను వాడుతారు. లోహాలు ఈ పనికి ఉపయోగపడతాయి. ఎక్కవ వైశాల్యం గల లోహం వుంటే చర్యవేగంగా జరుగుతుంది.
 5. oct047.jpgకలర్ ఏజెంట్: టపాసులు కాలేటప్పుడు రకరకాల రంగులు వెదజల్లడం మీరు గమనించే వుంటారు. ఈ రంగులకై రకరకాల లోహాను వాడుతారు. అవి
  • స్ట్రాన్షియం – ఎరుపు రంగు
  • కాపర్ (రాగి) – బ్లూ రంగు
  • బెరియా – పచ్చని రంగు
  • సోడియం – పసుపు / నారింజ రంగు
  • కాల్షియం – నారింజ రంగు
 6. బైండర్స్ (బందకాలు): పైన పేర్కొన్న రసాయనాలు ఓ ముద్దలా తయారుచేసి పేస్టులాగ వుంచడానికి డేక్సిట్రిన్ , పరాన్ లాంటి పిండి పదార్ధాల ను వాడుతారు.

స్ధూలంగా ఇది టపాసుల తయారికి వాడే పదార్ధాల వివరణ. ఇక బిగించి మూసివేసిన గొట్టంలో గన్ పౌడర్ మండినప్పుడు పెద్ద శబ్దంతో పేలిపోతుంది అదే టపాసు. అదే ఒక వైపు తెరిచిన గొట్టంలో పౌడర్ వుంచి మండించితే మంట వేదజిమ్ముతూ వెలుగును పైకి ఎగరేస్తుంది ఇదే చిచ్చుబట్టి (వెన్నెముద్ద). ఇక సన్నటి పేపరు గొట్టంలో పౌడర్ దట్టించి చుట్టలు చుట్టి కాల్చితే అవే బూచక్రం, విష్ణుచక్రం. ఈ పౌడర్ పేస్టును ఇనుపకడ్డికి పూసి కాల్చితే అది కాకవోత్తి లేక కాకరపూలు. ఇకా రకరకాల టపాసులు అనేక ఆకారాల్లో చేసి అమ్మతున్నారు. ప్రతి సంవత్సరం కొత్త రకాల టపాకాయలు మార్కెట్లో విడుదల అవుతున్నాయి.

oct049.jpgమనదేశంలో టపాకాయల పరిశ్రమ తమిళనాడులోని శివకాశిలో విస్తరించివుంది. దేశంలోని టపాకాయల ఉత్పత్తిలో 70% శివకాశిలోని 1000కి పైగా పరిశ్రమలలో తయారవుతోంది. ఈ పరిశ్రమలలో పనిచేసే వారు ముఖ్యంగా పసిపిల్లలు. వారిలో 4 నుంచి 16 సం.లోపు వారు 30% మంది వున్నారు. అందులో 90% మంది ఆడ పిల్లలు, పేద పిల్లలు, వెనుకబడిన తరగతివారు ఆదాయం కోసం ఈ పరిశ్రమలలో మగ్గిపోతున్నారు. విద్యుత్ బల్బులు లేని ఫ్యాక్టరీ ఆవరణలో (విద్యుత్తు వల్ల అగ్నిప్రమాదం జరుగుతుంది) చేతులకు ఎలాంటి రక్షణ కవచాలు (గ్లౌజులు) లేకుండా ప్రమాదకర రసాయన పదార్థాలలో టపాసులు తయారు చేస్తున్నారు పిల్లలు. దీని వల్ల వారి చేతివేళ్లు అరిగిపోయి యుక్త వయస్సు వచ్చేసరికి వేళ్లు లేని చేతులతో ఏ పనీ చేయలేక తల్లిదండ్రులపై ఆధారపడుతున్నారు. రసాయనాల వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రభుత్వ చట్టాలు ఎన్ని వున్నా పిల్లలు చేసే ఈ చాకిరీని అరికట్టలేకపోతున్నారు.

ప్రమాదాలు :

1oct048.jpg991లో శివకాశిలో ఓ ఫ్యాకల్టీలో జరిగిన ప్రేలుడు వల్ల 39 మంది చనిపోయారు. 65 మంది గాయపడ్డారు. 2009, జూలైలో జరిగిన ప్రమాదంలో 40 మంది చనిపోయారు. ఆగస్టు 2011లో ఫ్యాక్టరీ ప్రమాదంలో 7 మంది చనిపోగా ఐదుగురు గాయపడ్డారు. సెప్టెంబర్ 2012 ప్రమాదంలో 40 మంది చనిపోగా 38 మంది గాయపడ్డారు. ఇవన్నీ ప్రభుత్వ లెక్కలు. నిజానికి ఇంకా ఎక్కువగానే ప్రమాదాలు జరిగి వుంటాయి.

oct051.jpgఇలాంటి పిల్లలు తయారు చేసే టపాసులు వాడి బాల్య కార్మిక వ్యవస్థను మనం పెంచిపోషించాలా? మనం టపాసులు కాలుస్తుంటే మనలాంటి పిల్లలు వారి జీవితాలను కాల్చుకుంటున్నారు. ఆలోచించండి. ఇక టపాకాయలు కాల్చడం వల్ల పర్యావరణం ఎంతగా దెబ్బతింటుందంటే గాలి కాలుష్యం, శబ్దకాలుష్యం, రసాయన కాలుష్యం చాలా ఎక్కువగా వుంది. టపాసులు కాల్చినప్పుడు శబ్దం 140 డెసీబెల్స్ దాటుతోంది. ఆరోగ్యపరంగా శబ్దాలు 125 డెసిబెల్స్ దాటకూడదు (శబ్దం తీవ్రతను డెసీబెల్స్ లో కొలుస్తారు). ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టపాకాయల శబ్ద తీవ్రత 125 డెసిబెల్స్ దాటకూడదు. కానీ ఏ టపాకాయల కంపెనీ ఈ నియమాన్ని పాటించడం లేదు. ఈ శబ్దాల వల్ల తాత్కాలిక చెవుడు, శాశ్వత చెవుడు ఏర్పడుతోంది. ఒక్కసారిగా అధిక శబ్దం వల్ల వినికిడి సమస్యలు, రక్తపోటు, గుండెపోటు, నిద్రలేమి లాంటి సమస్యలు వస్తున్నాయి.

oct050.jpgఇక రసాయనాల ప్రభావం : టపాకాయలలో వెలువడే వాయువులలోని రాగివల్ల శ్వాస సంబంధ వ్యాధి, కార్మియం వల్ల రక్తహీనత, మూత్రపిండాలు దెబ్బతినడం, సీసము వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతినడం, మెగ్నీషియం వల్ల జ్వరాలు. ఇలా చాలా రకాలుగా ప్రమాదాలు పొంచి వున్నాయి. అంతేకాక దీపావళి రోజు టపాకాయలు కాల్చడంలో అగ్ని ప్రమాదాలు కోకొల్లలు. చేతిలో చిచ్చుబుడ్డి పేలడం, ఒళ్ళుకాలడం, బట్టలు కారిపోవడం జరుగుతూనే వుంటాయి. చాలా మంది ఆ వెలుగు చూడలేక కళ్ళు పోగొట్టుకున్న సందర్భాలు అనేకం.

జంతువు పట్ల కూడా ఈ టపాసులు ప్రభావం చూపుతున్నాయి. కుక్కలు దీపావళి రోజున ఏమి జరుగుతుందో అర్థం కాక, అధిక శబ్దాలకు తట్టుకోలేక వింతగా ప్రవర్తిస్తాయి. పక్షులు కూడా ఈ శబ్దాలను తట్టుకోలేవు. ఇంతలా ప్రమాదాలు సృష్టిస్తున్న టపాసులు మనం కాల్చాలా? ఆలోచించండి. టపాసుల వినియోగాన్ని తగ్గించండి. అధిక శబ్దాలు వెలువరించే టపాసులు కాల్చకండి. టపాసులు పర్యావరణానికి ప్రమాదకారకాలు. టపాసులు కాల్చే డబ్బుతో మంచి కార్యక్రమాలు చేయవచ్చు. వెలుగులు నింపే దీపాలతో దీపావళి చేసుకుందాం. పర్యావరణ పరిరక్షణ దీపావళిని జరుపుకుందాం. టపాసులు... థాం... పర్యావరణ.... థాం... కాకుండా, టపాసుకు టా..టా.. పర్యావరణానికి హాయి... హాయి.. అని చెబుదాం.

ఆధారం: యుగంధర్ బాబు.

2.99713467049
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు