పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

టీ యొక్క ఔషధగుణం

టి తాగడం వల్ల శరీరం ఉత్సాహం

319.jpgటీలో పాలు కలపకుండా త్రాగితే శరీరానికి చాలా మంచిది అనే విషయాన్ని European Heart Journal అనే పత్రిక ఈ సంవత్సరం జనవరి 7వ తేదీన ప్రచురించింది. Charity Hospital, Berlin వారు పాలు కలిపితే, తేయాకులోని రక్తాన్ని శుభ్రపరిచే గుణం చాలా వరకు తగ్గిపోతుందని కనుగొన్నారు. పాలలో ఉండే ప్రొటీన్ లు తేయాకు లో ఉండే Catechnoids అనే పదార్థాల అణువులను (Molecules) అంటి పెట్టుకుంటాయి. ఈ కారణంగా catechenodis కు గల రక్తాన్ని శుభ్రపరిచే గుణాలు (రక్తం పల్చబడటం, రక్తనాళాలని వెడల్పు చేయటం లాంటి గుణాలు) చాలా వరకు తగ్గిపోతాయని వారు గ్రహించారు. ఆరోగ్యంగా ఉన్న కొంత మంది స్త్రీలను వారు మూడు గుంపులుగా విభజించారు. మొదటి గుంపుకు అప్పుడే తయారు చేసిన Black Tea (అంటే మనం వాడే టీ పొడితో చేసిన నల్లటి డికాక్షన్) ఇచ్చారు.

రెండవ గుంపుకు పాలు కలిపిన Black Tea మూడవ గ్రూప్ కు గోరు వెచ్చని వేడినీళ్లు మాత్రమే ఇచ్చారు. 320.jpgసున్నితమైన Ultra Sound పరికరాల ద్వారా వారి రక్తనాళాల పరిశీలనను (cardio vascular system) వారు ఈ పానీయాలను సేవిస్తున్న కాలంలో, త్రాగిన తర్వాత రెండు వారి రక్తనాళాలోని రక్త ప్రసరణ చాలా తేలిక అయింది. ఉత్తి వేడినీళ్ళు తాగిన వారి విషయంలో రక్త ప్రసరణ ఎట్టి మార్పు లేదు. పాలు కలిపిన Black Tea తాగిన వారి విషయంలో కూడ ఉత్తి వేడినీళ్ళు తాగిన వారి శరీరంలో వలెనే ఎట్టి మార్పు కన్పించలేదు. ఇదే పరీక్షను వారు తెల్ల ఎలుకల cardio vascular system పై కూడ చేశారు. శుభ్రమైన తేయాకు ద్రావణం శక్తి వంతంగా పని చేయలేదు.

టీ ఆకులలో Epicatechin, Gallocatechin Epigallo Catechin మొదలైన Catechin జాతీ పదార్థాలు 7,8 రకాలవి ఉంటాయి. ఇవి Flavonoids జాతికి చెందినవి కాబట్టి మనం త్రాగే టీకి మంచి వాసన, రుచి కల్గిస్తాయి. వీటన్నింటికి శరీర ఆరోగ్యాన్ని మెరుగు పరిచే గుణం ఉన్నది. ఇవి Antioxidants Antiinflammatoru Agents, గా పనిచేస్తాయి. శరీరంలోని జీవకణాల వృద్ధి, తరుగుదలని సరియైన పద్ధతిలో ఉండేటట్లు చూడగలవు. కాబట్టి వృద్ధాప్యానికి సంబంధించిన జబ్బులు, కొన్ని కంటి జబ్బులు ( cataract, Retinal deseases) ఇంకా రక్తప్రసరణ, నరాల ఆరోగ్యంకు సంబంధించిన, వ్యాధులు (cardio-Vasculer and Neuro muscular deceaes) రాకుండా చేయగలవు. కొన్ని రకాల కాన్సర్ వ్యాధులు రాకుండా కూడ చేయగలవు.

తేయాకును చైనా దేశస్థులు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచానికి అందించిన బహుమానంగా భావించవచ్చును. వారు తేయాకును సర్వ రోగ నివారిణిగా భావిస్తారు. చైనాలో రెండు రకాల టీ త్రాగుతారు. మొదటిది Green Tea అంటే పచ్చి తేయాకును ఉడికిండి చేసే టీ (వారు దీనికి పాలు కలపరు) రెండవ రకం టీని “oolong” అంటారు. 321.jpgటీ ఆకులను కొంచెం పులియ పెట్టడం ద్వారా (fermentation) ఊలాంగ్ టీ తయారు చేస్తారు. మిగతా ప్రపంచం అంతా Black Tea యే తాగుతుంది. Black Tea కి వాడే టీ పొడి (మనం బజారులో కొనే టీ పొడి ) ని CTC పద్ధతిలో (Curl, Twist, Cure) పద్ధతిలో శుభ్రపరుస్తారు. కొంచెంగా పులియ పెట్టుతారు కూడా. పులియ పెట్టడం వల్ల టీ కషాయం (tea Decoction ) కు ఘూటుతనం, కొంచెం పుల్లటి ఆమ్లగుణం వస్తాయి. Black Tea చేసినప్పుడు Catechin పదార్థాలను “Tannin” అనే పదార్థాలుగా మార్పు చెందుతాయి. ఈ కారణంగా Black Tea కు Milk Proteins Green Tea కన్నా తక్కువగా వైద్య లక్షణాలు ఉంటాయి. “Tannin” ల కారణంగా కషాయం నుండి మనకు ఇష్టం కాని ఒక విధమైన వాసన, రుచి వస్తాయి. “Tannin” పదార్థాలు, Catechin అంత ఆరోగ్యవంతమైనవి కావు. రక్తంలోని అతి ముఖ్యమైన ఐరన్ అయాన్ లను, ఇంకా శరీరానికి శక్తినిచ్చే కొన్ని ఇతర పదార్థాల అణువులను “Tannin” లు అంటిపెట్టుకుని రక్తం నుండి తొలిగిస్తాయి. అందుచేత టీని అతిగా ఉడికించకూడదు. అలా అతిగా ఉడికిన టీని ఎక్కువగా త్రాగకూడదు.

టీ త్రాగే పద్ధతిలో కూడా చాలా తేడాలు ఉన్నాయి. చైనావాళ్ళు Green Tea త్రాగితే, యూరప్, అమెరికా, ఇండియా లలో టీకి పాలు కలిపి త్రాగుతారు. గుజరాత్ లో చాలా కాలం టీ కషాయంలో నారింజ రసం, సుగంధ ద్రవ్యాలు కలిపి సేవించేవారు. దీనికి చాలా వైద్య లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ కాలంలో ఆ ప్రాంతంలో అల్లం, పాలు కలిపి త్రాగుతున్నారు. టిబెట్ ప్రాంతంలో ప్రజలు టీ కషాయానికి “Yak” అనే జంతువు పాల నుండి వచ్చిన చిక్కటి బట్టర్ కలిపి త్రాగుతారు. కాశ్మీర్ లో ఆల్మండ్ పళ్ళు, ఏలకుల పొడి వేసుకుని తాగుతారు. టీలో పాలుకలుపుకొనే అలవాటు మనకి బ్రిటిష్ వాళ్లు ద్వారానే వచ్చింది. ఇప్పటికి కొంతమంది టీ కషాయానికి నిమ్మరసం కలుపుకొని తాగుతారు.

రచయిత: డి.బాలసుబ్రమణ్యం అనువాదం. యస్.బి.వి.ఆర్, శాస్త్రి.

3.03846153846
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు