పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

డ్రైక్లీనింగ్ అంటే ఏమిటి?

డ్రైక్లీనింగ్ యొక్క పద్ధతి గురించి తెలుసుకుందాం.

drycleanerవేల సంవత్సరాల నుండి మానవుడు బట్టలను శుభ్రపరుచుటకు సబ్బు మరియు నీటిని వినియోగించుకున్నాడు. 500 సంవత్సరాల క్రితం తూర్పు మధ్య ప్రాంతంలో మొట్టమొదటగా సబ్బు కనుగొనబడింది. డిటర్జంట్లు ఆవిష్కరణ మరీ పాతదేమి కాదు. 1916 వరకు డిటర్జంట్లు ఆవిష్కరణ జరగలేదు. కాని ఆ తరువాత సబ్బులేనటువంటి డిటర్జంట్ల తయారీ పెట్రో కెమికల్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ అభివృద్ధిగా భావించవచ్చు. డ్రైక్లీనింగ్ వంటి కొత్త విధానంలో బట్టలను శుభ్రం చేయటం ఉపయోగంలోకి వచ్చింది.

డ్రైక్లీనింగ్ అనేది సబ్బు మరియు నీరు లేకుండా రసాయనిక ద్రావణిలతో బట్టలను శుభ్రం చేసే విధానం. ఈ రసాయనిక ద్రావణులు అన్నీ క్రూడ్ ఆయిల్ యొక్క ఉప ఉత్పన్నాలే. వాటిలో పెట్రోలు ముఖ్యమైనది. డ్రైక్లీనింగ్ లో బెంజీన్ ను కూడా వాడతారు. వాటినుండి వెలువడే పొగను పీల్చడం ప్రమాదకరం మరియు అవి సులభంగా అంటుకొని మండుతాయి. వాటికంటె సురక్షితమైన పాలి క్లోరో ఆల్కేనులు మరియు ఆల్కేనులు డ్రైక్లీనింగ్ లో ఉపయోగిస్తున్నారు. డ్రైక్లీనింగ్ లో సాధారణంగా వాడే రసాయనాలు కార్బన్ టెట్రా క్లోరైడ్ మరియు టై క్లోరో ఈథైలీన్. డ్రైక్లీనింగ్ లో మొదట బట్టలపై మరకలను పోగొట్టుటకు శుభ్రం చేస్తారు. ఆ తరువాత డ్రైక్లీనింగ్ యంత్రంలో బట్టలను శుభ్రపరిచే ద్రావణులను కలిపి అర్థగంటసేపు నెమ్మదిగా దొర్లిస్తారు. శుభ్రమైన ద్రావణి లో బట్టలను నుసిమి ఆ తరువాత పిండుతారు. చివరకు వేడిగాలిలో ఆరబెడతారు. ఇంకా ఏమైనా మరకలు మిగిలివుంటే చేతితో శుభ్రం చేసి ఆవిరి ఇస్త్రీ పెట్టెతో ఇస్త్రీ చేస్తారు.

సాధారణ సబ్బుతో శుభ్రం చేయటంలో కంటే డ్రైక్లీనింగ్ వలన చాలా లాభాలు వున్నాయి. సబ్బుగాని డిజర్జంట్లు గాని తొలగించలేని నూనె లేక గ్రీజు మరకలు డ్రైక్లీనింగ్ లో వాడే ద్రావణులలో కరిగిపోతాయి. విలువైన పట్టు ఉన్ని వస్త్రాలను శుభ్రపరిచే విధానంలో డ్రైక్లీనింగ్ అనువైనది ఎందుకంటే వాటి మన్నికపై ఎలాంటి ప్రభావం చూపదు. సబ్బు నీటిలో లాగా డ్రైక్లీనింగ్ బట్టలు రంగులు వెలసిపోవటం జరగదు.

3.01960784314
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు