పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ధనం

డబ్బు బానిస.

కులము గలుగువారు గోత్రంబుగలవారు

విద్యచేత విర్రవీగువారు

పసిడిగలుగువాని బానిసెకొడుకులు

విశ్వదాభిరామ! వినురవేమ!

“ఎంత పెద్ద కులం వాళ్లేనా, ఎంత గొప్ప గోత్రంగలవారైనా, ఎంత గొప్ప విద్యావంతులైనా, సంపన్నుల బానిసలే”. అసమ సమాజం ఎంత తలక్రిందులుగా ఉంటుందో వేమన ఈ పద్యంలో చెప్పాడు. మన సమాజాన్ని రెండు అసమానతలు పీడిస్తున్నాయి.

  1. సాంఘిక అసమానత
  2. ఆర్థిక అసమానత. వీటి నిర్మూలన కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేమన ఈ పద్యంలో సంపద మీద పెత్తనం ఉన్నవారికి తక్కువ వాళ్లందరూ లొంగి ఉంటారని చెప్పాడు. వేదాలు, పురాణేతిహాసాలు లాగా చదువుకున్నవాళ్లు, అగ్రసులస్థులుగా పేరుపొందిన వాళ్లు ప్రాచీనకాలంలో, సంపదవాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి సంపద లేనివాళ్లు లొంగి బతికారు. గ్రామంలో ఒక పెద్ద భూస్వామి ఉంటే అతను ఏ కులస్తుడైనా, తక్కిన వాళ్లందరూ అతనికి లొంగిఉంటారు. మన రాజకీయ రంగమే బడా పారిశ్రామిక వేత్తలకు, బహుళ జాతి కంపెనీలకు లొంగి ఉండటం ఇవాళ వనం గమనిస్తున్నాం. 'కర్ర చేతిలో ఉన్నవాడిదే బర్రె' అనే సామెత సంపదను చేతిలో పెట్టుకున్నవాడు తక్కిన అన్నిరంగాల మీద ఆధిపత్యం గలిగి ఉంటారని చెబుతుంది. అందర్నీ శాసిస్తూ ఉంటారు. మేధావులు వారికే ఊడిగం చేస్తుంటారు. ఇది తలక్రిందుల వ్యవస్థ దానిని నిటారుగా నిలబెట్టాలన్నది వేమన అభిప్రాయం. సంపద కేంద్రీకృతం కారాదు అన్నది వేమన ఆలోచన. సంపద అందరిదీ కావాలి. ఏ ఒక్కరికో సొంతం కారాదు. అప్పుడే సమాజంలో నిరంకుశత్వం తగ్గుతుంది. బానిసత్వం తగ్గుతుంది. దీని కోసమే ఆధునిక కాలంలో భూపోరాటాలు జరుగుతున్నారు. భూసంస్కరణలు జరుగుతున్నాయి. అన్ని రంగాలలోను పేదలను, కింది కులాల వారికి, మైనారిటీలకు, స్త్రీలకు ప్రాముఖ్యం కోసం ఉద్యమాలు నడుస్తున్నాయి. వీటన్నింటిని పరాకాష్ట సమసమాజవాదం. వేమనకు మార్ఫిజం తెలియకపోవచ్చు గాని సంపద కేంద్రీకరణను మాత్రం ఆయన వ్యతిరేకించారు. సొంత ఆస్తిని వ్యతిరేకించాడు. సంపద, శ్రమ, అభివృద్ధి అందరికీ చెందడం నాగరిక సమాజ లక్షణం. ఇది జరగకుండా ఎన్నికలు మాత్రం జరుపుతుంటే ప్రజాస్వామికం కాదు. ఇటీవల మనం సార్వత్రిక ఎన్నికలలో ఎంత దొంగ డబ్బు పట్టుబడిందో చూశాం. అంటే ఎన్నికలలో సంపన్నులే పాల్గొనగలిగారన్నమాట. ఇది ప్రజాస్వామ్యం కాదు. అందువల్ల ధనసౌమ్య వ్యవస్థను వేమన వ్యతిరేకించినట్లుగా అందరమూ వ్యతిరేకించాలి. అవినీతి, లంచగొండితనం వంటివన్నీ డబ్బు వల్లనే పుట్టుతున్నాయి. మనిషి బతకడానికి డబ్బు అవసరమే అయితే డబ్బే జీవితం కాదు. డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కవలసిన పని లేదు. సంపద వికేంద్రీకరిస్తే మేధావులు బానిసలుగా బతికే వ్యవస్థ పోతుంది.

ధనస్వామ్యం నశించాలి

పుజాస్వామ్యం వర్థిల్లాలి

ఆధారం: రాచపాలెం.

3.0054200542
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు