పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

నిరంతరాయ భారతీయ అంతరిక్ష శతకం

ప్రపంచంలో అంతరిక్ష పరిశోధనల్లో తొలి ఐదు దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టిన ఇస్రో.

oct1నాకీమధ్య మీలాంటి విద్యార్థుల నుంచి చాలా e-mails వస్తున్నాయి. మేము భవిష్యత్తులో ISRO (Indian Space Research Organisation)లో చేరాలంటే ఏం చదవాలి? NASA (National Aeronotical Space Agency)లోకి వెళ్ళాలంటే ఏ కోర్సులు చేయాలి? ఇలా ఎన్నో సందేహాలు, విద్యార్థినీ విద్యార్థులకు ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కలలకు కారణాలు తెలిసిన విషయమే. మొన్న అంగారక గ్రహం మీదకు క్యూరియాసిటీ శకటం వెళ్లి అక్కణ్నించి మనకు చాలా వివరాలను పంపిస్తుంది. దీన్ని అమెరికా దేశపు అంతరిక్ష సంస్థ అయిన NASA ప్రయోగించింది.

చంద్రయాన్ వంటి అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడమే గాక ప్రపంచంలో అంతరిక్ష పరిశోధనల్లో తొలి ఐదు దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టిన ISRO , 09-09-2012 నాడు తన 100వ అంతరిక్ష ప్రయోగాన్ని PSLV-C21 ద్వారా జయప్రదం చేసింది. భారతీయులమైనందుకు ఆ విషయంలో మనమందరం గర్వపడాలి. స్వాతంత్యం సాదించి 66 సంవత్సరాలయిన ఈ తక్కువ కాలంలోనే 100 అంతరిక్ష ప్రయోగాల్ని సాధించడం చిన్న విషయమేమి కాదు. PSLV అంటే Polar Satellite Launch Vehicle అని అర్థం. GSLV అంటే Geostationary Satellite Launch Vehicle అని అర్థం.

PSLV అంటే ధృవోపగ్రహా (Polar Satellite)ని పైకి ప్రయోగించే రాకెట్ వాహనం అన్నమాట. ఇలా పంపబడిన ఉపగ్రహం భూమి ఉత్తర, దక్షిణ ధృవాల మీదుగా ఆకాశంలో సంచరిస్తుంది. అంటే దీనికి భూమి మీదున్న ప్రతి అక్షాంశాన్ని (attitude) వరికించే సామర్థ్యముందన్నమాట. ఈ PS పరిభ్రమణ కాలం (Revolutionary Period), భూ భ్రమణ (Eartlis Spin) కాలం (అంటే 24 గంటలు.

ఒకే విధంగా లేనప్పుడు ఈ PS భూమి మొత్తాన్ని చూడగలదన్నమాట. తద్వారా భూమి మీదున్న ధృవ ప్రాంతస్థితిగతుల్ని, భూమధ్యరేఖ (Equator) ప్రాంతంలో ఉన్న స్థితిగతుల్ని పరిశీలిస్తుంది. అడపాదడపా మనక్కావలసిన పద్ధతిలో వాతావరణపు బొమ్మల్ని, భూమి ఎత్తుపల్లాల్ని ఉపగ్రహం రేఖాచిత్రాల (Satellite Images) ద్వారా మనకు చేరవేస్తుంది. తద్వారా తుఫానుల రాక గురించి, ఓజోన్ పొర క్షీణత గురించి మనకు అనునిత్యం సమాచారం చేరుతుంది.

oct2GSLV అంటే భౌమ్యస్థిర ఉపగ్రహాన్ని (Geostationary Satellite) ఆకాశంలోకి నెట్టే రాకెట్ వాహనం. ఇలా ప్రయోగించబడిన ఉపగ్రహం భూమధ్యరేఖ మీదుగా గానీ లేదా ఏదైనా నిర్దిష్ట అక్షాంశ రేఖ మీదుగా గానీ భూప్రదక్షిణ చేస్తుంది. అంటే దీనికి ప్రతి రేఖాంశాన్ని (longitude) దాటగలిగే నిర్మితి ఉందన్నమాట. అయితే దీని భూప్రదక్షిణ కాలం, భూభ్రమణ కాలానికి సమానమయినట్లయితే ఇది ఎక్కడ వేసిన గొంగళి వేసిన చోటే ఉన్నట్లు ఒక దేశం మీదే ఉందన్నమాట. ఇలాంటి ఉపగ్రహాల్ని సాధారణంగా సమాచార ప్రసారాల కోసం వాడతారు. ఉదాహరణకు మనం హైదరాబాదు నుండి పైకి ఓ దూరదర్శని ద్వారా చూస్తుంది.

మనకో GS ఉపగ్రహం కనిపించిందనుకుందాం. అది ఎప్పుడు హైద్రాబాద్ మీద అక్కడే ఉన్నట్లు మనం గమనిస్తే దాని భూప్రదక్షిణ కాలం కూడా 24 గంటలన్నమాట. మనం కొండెక్కి చూస్తే మన నగరమంతా కనిపిస్తుంది కదా.  అలాగే కొన్ని వందలవేల కిలోమీటర్ల పైన హైద్రాబాద్ మీద అలాంటి GS ఉపగ్రహం అంటే దాని దృష్టిలో భారతదేశమే కాదు చాలా ఆసియా దేశాలు కూడా పడతాయి. మలేషియలో ఉన్న ప్రపంచంలో కెల్లా అత్యంత ఎత్తైన బూర్జ్ కలీఫా భవనం పైకి వెళ్ళి చూస్తే మలెషియ దేశం మొత్తంతో పాటు అటూ ఇటూ ఉన్న దేశాలు కూడా మాకు కనిపించాయి. అలాగే భారతదేశం మొత్తం ఉపగ్రహానికి కనిపిస్తే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి టెలిఫోన్ సమాచారం, టి.వి.ల సమాచారం సులభంగా అందుతుంది.

oct3మన ISRO వారు ప్రయోగించిన PSLV-C21 ISRO చరిత్రలో 100వ ప్రయోగం. తొలి ప్రయోగం ఆర్యభట్ట ఉపగ్రహం. దీన్ని 1975 ఏప్రిల్ 19వ తేదీన అప్పటి సోవియట్ రష్యాలోని కప్రస్టిన్ యార్ (Kapustin Yar) నుంచి కాస్మోస్-3M  అనే ఉపగ్రహ రాకెట్ ద్వారా ప్రయోగించారు. అయితే ఆర్యభట్ట ఉపగ్రహాన్ని నిర్మించింది ISRO నే. 1975 నుంచి నేటి (2012) వరకు. అంటే 37 సంవత్సరాలపై 100 ఉపగ్రహ ప్రయోగాల్ని సాధించిన ISRO ను మనం అభినందించాలి. అపజయాల కన్నా విజయవంతమైన ప్రయోగాలే ఎక్కువ. 200పై చిలుకు ఉన్న దేశాల్లో ఉపగ్రహ ప్రయోగం చేయగల సత్తా ఉన్న కేవలం ఆరే ఆరు దేశాల్లో భారతదేశం కూడా ఒకటి కావడం మనందరికి గర్వకారణం.

ఎన్నో భాషలకు, మతాలకు చెందిన శాస్త్రవేత్తలు, ఏ మతమూ లేని శాస్త్రవేత్తలు, ప్రతి శాస్త్ర ప్రగతికి పునాదిగా ఉన్న కార్మికుల కృషి ఈ ప్రయోగాల వెనుక ఉంది. విజయాలన్నీ వీరివే మానవ మేధస్సువే. మరే అదృశ్య శక్తి, ఈ రాకెట్టు ప్రయోగాల్ని చేయడం లేదు. సాంకేతికంగా అన్ని సవ్యంగా ఉంటే ఏ శక్తి రాకెట్ ప్రయోగాన్ని విఫలం చేయలేదు. శాస్త్రసాంకేతిక సూత్రాల్ని ఖాతరు చేయకుండా అడ్డుగోడలుగా రాకెట్టు ప్రయోగిస్తే, దాన్ని నమూనాలను ఎన్ని ప్రార్థనా మందిరాలలో పెట్టి పూజలు చేసినా అది విఫలం కాకమానదు.

ఆధారం: ప్రొ. ఎ. రామచంద్రయ్య

3.003125
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు