పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పర్యావరణ కాలుష్యం

పర్యావరణ కాలుష్యం గురించి తెలుసుకుందాం.

pollutionసజీవులమైన మనము, ఇతర జీవులు, మన చుటూ ఉండే పరిసరాలతో మమేకమై ఉండే ప్రకృతినే "పర్యావరణం' అంటారు. పర్యావరణం అంటే సజీవులు నిర్జీవులు కలసి ఏర్పడే ప్రపంచమే. ఇంకా చెప్పాలంటే భౌతిక, రసాయనిక వస్తువులు, సహజ శక్తులతో కూడి ఉండేదే "పర్యావరణం అవుతుంది.

ఇందులో వాయురూప పద్దాలు భాగాన్నే వాతావరణం, మానవుడు కనుక్కున్న కొత్త కొత్త ఉపకరణాల వలన వాతావరణం దుప్రభావానికి లోనవుతుంది. మానవుడు సాధించిన పారిశ్రామిక ప్రగతి వలన అనేక పదార్థాలు, వాయువులు వాతావరణంలోకి విడవబడుతాయి. ఫలితంగా అన్ని జీవరాశులూ, వాతావరణమూ కలుషితమవుతోంది. మానవుడితో సహా మిగిలిన జీవులూ, నిర్జీవులూ చెడు ప్రభావానికి గురవటాన్నే 'వాతావరణ కాలుష్యం లేదా పర్యావరణ కాలుష్యం అంటారు. ఇలా వాతావరణాన్ని కాలుష్యానికి గురిచేసే పదార్థాలనే "కాలుష్యాలు' అంటారు. ఈ కాలుష్యాలు రెండు రకాలుగా ఉంటాయి.

 1. సహజ కాలుష్యాలు
 2. కృత్రిమ కాలుష్యాలు

ప్రకృతిలో సహజంగా ఏర్పడే చర్యల వలన జరిగే కాలుష్యాలను సహజ కాలుష్యాలు అంటారు. ప్రకృతిపరంగా కాక మానవుడు చర్యల వలన ఏర్పడే కాలుష్యాలను కృత్రిమ కాలుష్యాలు అంటారు. అంతేకాక కాలుష్యాలు వాతావరణంలోకి ప్రవేశించి ఏర్పరచే కాలుష్యాల దశల్నిబట్టి ప్రాథమిక కాలుష్యాలు, ద్వితీయ కాలుష్యాలు అని రెండు రకాలు ఉంటాయి.

థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గును మండిస్తే వచ్చే వస్తువే పై యాష్ దీని వలన సారవంతమైన భూములు బీడు భూములుగా మారతాయి. పై యాష్ అంటే ఎగిరేబూడిద వలన మోటారు వాహనాలు, విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. శ్వాస సమస్యలు, దృష్టి దోషాలు వంటివి ఏర్పడతాయి.

పెట్రోలియం ఉత్పత్తులు మరియు గ్యాసోలీన్లు హైడ్రో కార్బన్లకు ఉదాహరణలు, హైడ్రో కార్బన్లు అంటే హైడ్రోజన్ కార్బన్ల కలయిక వలన ఏర్పడినవి. పెట్రోలియం ఉత్పత్తుల్లో సీసం వెలువడుతుంది. దీని వలన పిల్లల్లో బుద్ది మాంద్యం ఏర్పడుతుంది. మొక్కల్లో కూడా ఎదుగుదల క్షీణిస్తుంది. వీటి వలన ఉపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉన్నాంు. గాలిలో ఒక ఘన మైక్రో - మీటరు కన్నా తక్కువ పరిమాణంలో ఉండే ఘన, ద్రవ కణాల అవలంబిత (Suspended) కణాలను ఏరోసాల్స్ అంటారు.

సల్బర్ డయాక్పైడు వలన మానవుడి కళ్ళు, శ్వాసకోశం మండటమేగాకుండా ఊపిరితితులు దెబ్బతింటాయి.

సాధారణంగా వాతావరణంలోని గాలిలో నైట్రోజన్ 78, 32%, ఆక్సిజన్ 20.16%, కార్బన్డయాక్పైడు 0.38% ఉంటాయి. కొన్ని ఇతర పదార్థాలు వీటితో చేరి గాలిని కలుషితం చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ వాయు కాలుష్యాన్ని ఈ విధంగా నిర్వచించింది". గాలిలో ఉండే కొన్ని పదార్ధాల గాఢతలు మానవుడికి పరిసరాలకు హానిచేసే స్థాయిని మించి ఉండటమే వాయుకాలుష్యం అంటారు. మోటారు వాహనాల నుంచి వెలువడే పొగలో కార్బన్ మోనాక్పైడు అధికంగా ఉంటుంది. ఇది ప్రమాదకరమైన విషవాయువు.

నైట్రస్ ఆక్సైడు, క్లోరోఫ్లోరో కార్బన్లు అమ్మోనియా, ఎగిరే బూడిద, ఏరోసాల్స్, హైడ్రోకార్బన్లు, వంటివి వాయుకాలుష్యాన్ని కలుగజేస్తాయి. పొగమంచు వలన మానవుల్లో శ్వాసకోశ సంబంధ వ్యాధులు, అలర్జీ, ఆస్తమా వస్తాయి. ప్రమాదాలు జరుగుతాయి. వాతావరణంలోని నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ డయాక్సైడు, హైడ్రోకార్బన్లు, ఓజోన్ వాయువు మరియు ఇతర రేణువులతో కలిసి స్మాగ్ ఏర్పడుతుంది. వాతావరణంలో అమ్మోనియా పెరిగితే కిరణజన్య సంయోగక్రియ నిదానిస్తుంది. ఇంకా పరిశ్రమల నుంచి వెలువడే అమ్మోనియా వలన కళ్ళ మంటలు, గొంతులో బొబ్బలు వస్తాయి. నైట్రస్ ఆక్సైడు వలన ఆవు వరాలు కురుస్తాయి. పరిశ్రమల నుంచి వెలువడే ఈ వాయువు మానవుల హీమోగ్లోబిన్ను ప్రభావితం చేస్తుంది. మొక్కలు చనిపోతాయి. క్లోరోఫ్లోరో కార్బన్ల వలన ఓజోన్ పొర విచ్చిన్నమవుతుంది. ఓజోన్ పొరకు రంధ్రాలు పడటం వలన సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు ప్రత్యక్షంగా భూమిని చేరడం వలన అనేక నష్టాలు సంభవిస్తాయి. ఒక్క క్లోరోఫ్లోరో కార్బన్ అణవు సుమారుగా లక్ష వరకు టైజోన్ అణువులను విచ్చిన్నం చేస్తుందంటే ఇది ఎంత నష్టం కలిగిస్తుందో గమనించవచ్చు.

airpollutionసల్ఫర్ డయాక్సైడు, పాదరసం, డీడీటి వంటివి వాతావరణంలోకి ఎలా ప్రవేశిస్తాయో అదే స్థితిలో వాతావరణష్ట్రాన్ని క్షలుష్టితం చేస్తాయి. కాబట్టి వీటిని "ప్రాథమిక కాలుష్యాలు" అంటారు. ద్వితీయ కాలుష్యాలు అనేవి ప్రాథమిక కాలుష్యాల మధ్య జరిగే చర్యల వలన ఏర్పడతాయి. ఉదాహరణకు హైడ్రోకార్బన్లు, నైట్రోజన్ ఆక్సైడులు ప్రాథమిక కాలుష్యాలు. ఇవి రెండూ కలసి కాంతి సమక్షంలో చర్య జరపటం వలన పెరాక్సీ ఎసైల్ నైట్రేట్ల ఏర్పడుతాయి. ఇవి ద్వితీయ కాలుష్యాలు.

మానవుని దైనందిన కార్యకలాపాల వలన కాలుష్యాన్ని రకాలుగా వర్గీకరించవచ్చు.

 1. వాయుకాలుష్యం
 2. నీటి కాలుష్యం
 3. భూ కాలుష్యం
 4. ధ్వని కాలుష్యం
 5. సముద్ర కాలుష్యం
 6. ఉష్ణ కాలుష్యం
 7. వ్యర్థ ఘన పదార్ధాల కాలుష్యం
 8. రేడియో ధార్మిక కాలుష్యం

soilpollutionకార్బన్ డయాక్సైడు, నైట్రోజన్ ఆక్సైడు వంటివి వాతావరణంలో ఉండవలసిన స్థాయిని మించినపుడు కాలుష్యాలుగా మారతాయి. క్రిమి కీటక సంహారకాలు వంటివి మానవుల చర్యల వలన వాతావరణంలోకి ప్రవేశించి హానికారకాలవుతాయి. వ్యవసాయ, పశువుల వ్యర్థ పదార్ధాలు జీవక్షయం పొందే కాలుష్యాలవుతాయి. ప్లాస్టిక్లు, ఫెనాల్లు వంటివి జీవక్షయం పొందని కాలుష్యాలు మానవుడు చేసే పనుల వల్ల ఉత్పన్నమైనటువంటి పదార్థాలు వాతావరణానికి హాని కలిగిస్తాయి. ఇటువంటి పదార్థాలనే మలినాలు సల్బర్ డయాక్సైడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తాజ్మహల్ వంటి అద్భుత కట్టడం రంగు మారిపోతున్నది. అంతేకాక సల్బర్ డయాక్సైడు వలన ముక్కురంధాలు వాచి శ్వాసక్రియకు ఇబ్బంది కలుగుతుంది. ఇది వరం పడుతున్నపుడు వర్షపునీటిలో కరిగి సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మారుతుంది. దీనివలనే ఆమ్లవరాలు పడతాయి. ఆమ్లవరాల వలన జనులు, పంటలు, జలవనరులు బాగా నాశనమవతాంు. ఈ విధంగా సల్ఫర్ డయాక్సైడు, కార్బన్ మోనాక్సైడు, కార్బన్ డయాక్సైడు వాయువుల వలన వాతావరణం కలుషితమవుతోంది.

environmentమరి ఇలా వాయువులు ఎందుకు ఎక్కువగా విడుదల అవుతున్నాయంటే దానికి కొందరు స్వార్థపరులు కారణం. ముఖ్యంగా అడవులు నరికివేయడం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతిని ఆక్సిజన్ శాతం తగ్గి, కార్బన్ డయాక్సైడు శాతం పెరుగుతోంది. అగ్ని పర్వతాలు బద్దలవడం, కార్చిచ్చులు వంటి ప్రకృతి వైపరీత్యాలలో పొగ, హానికర వాయువులు వాతావరణంలోకి విడుదల అవుతాయి. ఇన్ని రకాలుగా నష్టం కలిగిస్తున్న వాయు కాలుష్యాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. భారత ప్రభుత్వం 1981వ సంవత్సరంలో "వాయుకాలుష్య చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఇంకా 1986వ సంవత్సరంలో "పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని కూడా అమలులోకి తెచ్చింది. పరిశ్రమల నుంచి వెలువడే పొగ, బూడిద, విషవాయువులు వంటి వాటిని ఫిల్టర్లతో వడపోసి మాత్రమే వాతావరణంలోకి వదలాలి. అంతేకాక ఇటువంటి పరిశ్రమలను, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అణురియాక్టర్ల వంటి వాటిని జనుల నివాసాలకు దూరంగా కట్టాలి. రైళ్ళు, వాహనాలు వంటి వాటికి ఉపయోగించే పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలు కాకుండా జీవ ఇంధనాలు వాడేలా చూడాలి. దీనివలన ఎంతో వాయు కాలుష్యం తగ్గుతుంది. అడవులను సంరక్షించటం ద్వారా చెట్లు పెరిగి ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాలను పునర్వినియోగపరిస్తే చాలా కాలుష్యం తగ్గుతుంది. స్కూళ్ళలో, కాలేజీలలో విద్యారులకు వాతావరణ కాలుష్యం గురించి అవగాహన కల్పించాలి. తద్వారా వాతావరణ కాలుష్య చట్టాలను అమలు పరచేలా చూడవచ్చు. ఓజోన్ పొరను సంరక్షించి అనేక వ్యాధులను నివారించే బాధ్యత కూడా మనందరిపై ఉన్నది.

రచయిత: - డా. కందేపి రాణి ప్రసాద్, సెల్: 9866160878

3.04347826087
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు