హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / పాలు ఎందుకు తెల్లగా ఉంటాయి. నీళ్లు ఎందుకు పారదర్శకంగా ఉంటాయి?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పాలు ఎందుకు తెల్లగా ఉంటాయి. నీళ్లు ఎందుకు పారదర్శకంగా ఉంటాయి?

పాలు మరియు నీళ్ల రంగుకు కారణం తెలుసుకుందాం.

milknwaterతెల్లని వన్ని పాలు కావు అన్నమాటలో ఎంత నిజం ఉందో నల్లని వన్నీ నీళ్లు కావు అనేది కూడా పాక్షిక సత్యం. ఎందుకంటే అసలు నీళ్లే నల్లగా ఉండవు. నువ్వనట్లు నీళ్ళు పారదర్శకం (transparent) గా ఉంటాయి. తెల్లని వన్నీ పాలు కాకపోయినా పాలలాగా తెల్లగా కనిపించే పదార్ధాల తెలుపునకు మాత్రం కారణం దాదాపు ఒకటే.

పదార్థాలతో కాంతికున్న పరిచర్య (interaction) విశ్వంలో ఉన్న అనేక గొప్ప దృగ్విషయాలలో చాలా మౌలికమైంది. కాంతి(light)కి కణ (Corpuscular) స్వభావం, తరంగ (Wave) స్వభావం కలగలిసే ఉంటాయి. కాంతి స్వభావరీత్యా విద్యుదయస్కాంత లాక్షణి(electromagnetic entity). ఈ తంరంగాలు నెకనుకు ఎన్ని ఒక బిందువు నుంచి కదులాయో అ సంఖ్యను ఆ తరంగాల పౌనుఃపున్యం (frequency) అంటారు. పౌనఃపున్యం ఎంత ఎక్కువ ఉంటే ఆ తరంగాలకు అంత ఎక్కువ శక్తి ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. కాంతి తరంగాలు ఎపుడు స్థిరంగా ఉండవు. రైలు తన పెట్టెల్ని (బోగీల్ని) వెంటబెట్టుకొని వెళ్తున్నట్లే కాంతి అనే శక్తిరైలు తరంగాలనే బోగీలను మొసుకెళ్తుంది. దీన్నే కాంతి ప్రయాణఁ (transit of light) అంటాము. ఒక సెకన్ సమయంలో కాంతి ప్రయాణించే దూరాన్ని కాంతి వేగం (Velocity of light) అంటారు. దీనిని c అనే ఇంగ్లీషు అక్షరంతో చూపుతారు. దీని విలువ శూన్యం (Vacuum) లో సుమారు 3 లక్షల కిలో మీటర్లని గత తెలునుకొని ఉంటారు.

ఒక సెకనులో కాంతి కదిపే తరంగాల్ని Y అనుకొంటె ఒక్కొ తరంగం పొడవు ƛ అని అంటారు. కాబట్టి ఒక సెకనులో కాంతి Y ƛ దూరం ప్రయాణిస్తుందని అర్థం కదా. కాబట్టి C = Y ƛ కాంతికున్న తరంగదైర్ఘ్యం లేదా పౌనఃపున్యం ఆధారంగా కాంతిని స్థావరాలు (Zones) గా వర్గీకరించారు. 400 నుంచి 800 నానో మీటర్ల మధ్యలో తరంగదైర్ఘ్యం ఉన్న కాంతి తరంగాలను దృశ్యకాంతి (Visible light) అంటారు. 400 - 200 నానోమీటర్ల మద్య ఉన్న కాంతిని అతినీలలోహిత (U|- traviolet light) కాంతి అనీ, 800 నుంచి10,000 నానోమీటర్ల ఉన్న కాంతిని పరారుణ (Infrared) కాంతి అంటారు.

కాంతి తరంగపు తరంగదైర్ఘ్యం కన్నా ఆ కాంతి పదార్థంలో ప్రయాణించే సమయంలో తాను ఎదుర్కొనే పదార్ధపు కణాల సైజు తక్కువ అయినట్లయితే కాంతి తరంగాలకు అడ్డు ఏమీ ఉండదు. అపుడు ఆ పదార్థాలు పారదర్శకంగా ఉంటాయి. మన కంటికి పారదర్శకంగా ఉన్నంత మాత్రాన అన్నీ రకాల కాంతులకు పదార్గాలు పారదర్శకం కానక్కర్లేదు. నీటి అణువుల సైజు సుమారు 5Å (AngSrom) ఉంటుంది. 10 Å విలువ ఒక నానో మీటరుగా గుర్తించండి. కానీ దృశ్యకాంతి తరంగదైర్ఘ్యలు 4000 నుంచి 8000 వరకు ఉంటాయి కాబట్టి ఆ కాంతి తరంగదైర్ష్యాల కన్నా నీటి అణువుల సైజు చిన్నది కాబట్టి ఆ తరంగాలు అన్నీనీటి నుంచి దూసుకుపోతాయి. అంటే నీటి గ్లాసుకు ఆవల ప్రక్కన వస్తువు దృశ్యం మొత్తం ఈ వలకి వస్తుంది. కాబట్టి నీరు పారదర్శకంగా కనిపిస్తుంది. కానీ కాంతి తరంగదైర్ఘ్యం కన్నా పదార్థపు కణాలు పెద్దగా ఉన్నట్లయితే ఆ కణాలు ఆ తరంగాలకు అడ్డుపడ్డం వల్ల ఈవల కాంతి ఆవలకి రాదు. కాబట్టి అలాంటి పదార్థాలు కాంతి నిరోధకాలు (Opaque) గా పనిచేస్తాయి. నల్ల కాగితం, రేకులు, కిటికి చెక్కలు, పాదరసం, తలుపులు, గొడుగు ఇలాంటి పదార్ధాలలో అన్ని కణాలు బహ్వ అణువుల (Polymeric) లేదా బహు పరమాణుక ఘనం (Solid) sలేదా ద్రవ (liquid) సంఘఠిక (Condensed) పదార్థాలు కాబట్టి అవి కాంతినిరోధకాలుగా పనిచేస్తాయి. కాంతి తరంగాల తరంగదైర్ష్యానికీ, పదార్ధ కణాల సైజు చేరువలో గానీ, దాదాపు సమానంగా గానీ ఉన్నట్లయితే పదార్థ కణాలు ఆ కాంతి తరంగాల్ని పూర్తిగా ఆపవు. అలాగని పూర్తిగా దూసుకుపోనివ్వవు. మరేం చేస్తాయి? కాంతి తరంగాల్ని అటూ ఇటూ చెల్లాచెదురుగా వెళ్లేలా చేస్తాయి. ఈ ప్రక్రియను ప్రక్షేపణం (Scattering) అంటారు. ఒక వేళ మనం చూడగల్లిన దృశ్యకాంతి తరంగదైర్ష్యాల రేంజ్ అయిన 4000 - 8000 Å మధ్యలోనే పదార్థంలోని కణాల సైజు ఉన్నట్లయితే ఈ కణాలు ఈ దృశ్యకాంతిని అన్ని వైపులా చెల్లాచెదరుగా వెదజల్లుతాయి. అన్ని దృశ్యకాంతి తరంగాల్ని కలిపి చూస్తే మన మెదడు తెలుప అనే అర్థంలో తీసుకోంటుంది. చాకెపీస్, పొగ కట్టెల పొయ్యి, ఫినాయిల్ కలసిన నీళ్ళ జిల్లేడు పాలు, అమ్మ పాలు, గేదె పాలు, బొద్దింక రక్తం, తెల్లకాగితం, బియ్యం పిండి, మేఘాలు, తెల్లని పెయింటింగ్ చొక్కాకు వాడిన ప్రత్తి దారం, ముగ్గు పిండి, సున్నం వంటి పదార్థాలలోని కణాల సైజు 8000 నుంచి 4000Å మద్య ఉండడం వల్ల అవి దృశ్యకాంతిని అన్ని వైపులకు విక్షేపణం చెందిస్తాయి. అలా విక్షేపణం చెందిన కాంతిలో దృశ్యకాంతిలోని ఏడు రంగులు కలగలిసి ఉండడం వల్ల మనకవి తెల్లగా కనిపిస్తాయి.

ఆధారం: ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య, 9490098910

3.00925925926
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
Ysangamesh Aug 18, 2019 11:47 AM

Excellent

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు