పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పిరియాడిక్ టేబుల్

ఆవర్తన పట్టిక (మెండలీఫ్ పట్టిక వరకు మాత్రమే)

may25 ఆవర్తన పట్టిక అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేవి గ్రూపులు, పిరియడ్లు, మూలకాలు, సంకేతాలు, మూలకాల పరమాణు భారాలు, మూలకాల పరమాణు సంఖ్యలు మొదలైనవి.

పరీక్షా సమయంలో విద్యార్థులు ఈ ఆవర్తన పట్టికను కంఠతా పడుతుంటారు. కానీ, మీకు తెలుసా ఈ మూలకాలను ఎవరు, ఎప్పుడు, ఎక్కడ కనిపెట్టారో, మీకు కూడా తెలుసుకోవాలని వుందా... అయితే చదవండి మరి.

మూలకాలను హేతుబద్దంగా వర్గీకరించడానికి మెండలీఫ్ కు ముందు ప్రయత్నించిన కొందరు శాస్త్రవేత్తలు: జోహన్ డాబర్నీర్, జాన్ అలెగ్జాండర్ రైనా న్యూలాండ్స్, లోథర్ మేయర్, మాండలీఫ్, మోస్లే.

డాబర్ నీర్ ట్రయాడ్లు లేదా త్రికాలు

may20ఇతను జర్మనీ దేశస్థులు, ఈ ట్రయాడ్లను 1817-1829 మధ్యకాలంలో వర్గీకరించడం జరిగింది. డాబర్ నీర్ త్రికంలో ధర్మాలలో దగ్గర పోలికలున్న మూడు మూలకాలను వాటి పరమాణుభారాల ఆరోహణా క్రమంలో అమర్చినప్పుడు మధ్య మూలకపు పరమాణు భారం మొదటి, మూడవ మూలకాల పరమాణు భారాల సగటుకు దాదాపు సమానంగా వుంటాయని చెప్పారు. కానీ ఈ వర్గీకరణ అన్ని మూలకాలకు వర్తించలేకపోవటంతో ఆయన విఫలమయ్యారు.

ఉదాహరణకు:

7Li23Na39K

30P74As121sb

జోహన్ డాబర్నీర్ డిసెంబర్ 13, 1780లో జన్మించి, మార్చ్ 24, 1849న మరణించారు.

జాన్ న్యూలాండ్స్ అష్టక సిద్ధాంతం

may21జాన్ అలెగ్జాండర్ రైనా న్యూలాండ్స్ 1837 నవంబర్ 26న West Square England లో జన్మించారు. న్యూలాండ్స్ అనాలటికల్ కెమిస్ట్రీలో చేసిన కృషికి గాను "DAVY"Medal (1887) లో అందుకున్నారు. న్యూలాండ్స్ 1860లో ఆవర్తన పట్టికలోని మూలకాలను వాటి యొక్క పరమాణు భారాల ఆధారంగా తక్కువ పరమాణు భారాల నుండి ఎక్కువ పరమాణు భారాలను వరుసగా గల హైడ్రోజన్ (H)తో మొదలుపెట్టి 56వ మూలకమయిన థోరియం వరకు పట్టికను రూపొందించారు.

న్యూలాండ్స్ మూలకాల 1869 లో పై అమరిక ఆధారంగా అష్టక సిద్ధాంతాన్ని వర్గీకరించారు. న్యూలాండ్స్ వర్గీకరించిన మూలకాలు వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు మొదటి మరియు ప్రతి ఎనిమిదవ మూలకాల ధర్మాలు ఒకే విధంగా వుంటాయన్నారు.

Li   Be   B   C   N  O   F   Na

7    9    11  12  14  16  18  23

లిథియం నుంచి ఎనిమిదవ మూలకమయిన సోడియం వరకు చూస్తే Li మరియు Naలు దాదాపు 4 ధర్మాలను కలిగి వుంటాయని వివరించారు. మ్యాలాండ్స్ తన 60వ ఏట, 1898 జూలై 29న మరణించారు.

లోథర్ మేయర్ వర్గీకరణ

may22జర్మనీ శాస్త్రవేత్త అయిన లోథర్ మేయర్ ఆగస్టు 19, 1830న జర్మనీలోని వారెల్, ఓల్డెన్ బర్గ్ లో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ జూరిచ్ లో మెడిసిన్ చేసి, యూనివర్సిటీ ఆఫ్ వ్యూర్జ్ బర్గ్ నుండి 1854లో M.D. డిగ్రీ పట్టా పొందారు.

మానవ రక్తంలోని భౌతికపరమైన చర్యల పై, రక్తంలోని ఆక్సిజన్ పనితీరుని, లోథర్ మేయర్ పరిశోధనలు చేశారు. లోడర్ వేయర్ మూలకాల భౌతికధర్మాలైన పరమాణు ఘనపరిమాణం, సాంద్రత వంటివి పరమాణుభారంతో పోల్చినప్పుడు ఎలా మారతాయో గ్రాఫ్ ల ద్వారా తెలియజేశాడు. తన పరిశీలనల ఆధారంగా మూలకాల భౌతిక ధర్మాలు వాటి పరమాణుభారాల ఆవర్తన ప్రమేయాలు అని చెప్పాడు.

మెండలీఫ్ వరీకరణ

may23రష్యన్ శాస్త్రవేత్త అయిన లిఫ్ మొట్టమొదటిసారిగా ఈ ఆవర్తన పట్టికను ఆవిష్కరించారు. D.L.మెండలీఫ్ ఫిబ్రవరి 8, 1834న సైబీరియాలో జన్మించారు. 1856న గ్రాడ్యుయేట్ పూర్తి చేసి, 1863న యూనివర్శిటీ లో ప్రొఫెసర్ గా చేరారు. అప్పటికే కనుగొనబడ్డ 63 మూలకాలను, వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో ఒక పట్టికలో పొందుపరిచారు. దీనినే ఆవర్తన పట్టిక అంటారు. ఈ పట్టిక నందు అడ్డంగా వున్న వరుసలను పిరియడ్లని, నిలువుగా వున్న వరుసలను గ్రూపులని అంటారు.

ప్రతి గ్రూపు మరొక ఉపగ్రూపులుగా విభజించబడ్డాయి. అవి A మరియు B. మెండలీఫ్ ఊహించిన ఎకాబోరాన్ ను, నెల్సన్-1879లో కనుగొని స్కాండియం అని, ఎకా అల్యూమినియంను, డెబోస్టాడ్రన్-1875లో గాలియం అని పేరు పెట్టారు. ఇవే కాకుండా (Petroleum) పెట్రోలియం యొక్క సహజ గుణాలను వాటి మూలాలను గూర్చి మరియు థర్మల్ Expansion of Liquids పైన కూడా పరిశోధనలు చేశారు. 1907లో మరణించారు.

హెన్రీ మోస్లే వర్గీకరణ/నియమాలు

may24బ్రిటిష్ శాస్త్రవేత్తయిన హెన్రీ మోస్లే 1913న బ్రిటన్ లో జన్మించారు. మూలకాలు మరియు వాటి పరమాణు సంఖ్యల మధ్య తేడాలను X-RAY కిరణాలనుపయోగించి (Wave Length)తో చూపించడం జరిగింది. ఈ ప్రయోగాల ఆధారంగా పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్యను గుర్తించి దానిని ‘Z’ సంకేతంతో సూచించారు. ఆవర్తన

పట్టికలో 7 పిరియడ్లు, 16 గ్రూపులు వుంటాయి. మొదటి పిరియడ్ లో రెండు మూలకాలు, రెండవ మరియు మూడవ పిరియడ్లలో ఒక్కొక్క దాని యందు 8 మూలకాలు వుంటాయి. నాలుగవ మరియు ఐదవ పిరియడ్లలో ఒక్కొక్క దాని యందు 18 మూలకాలు, ఆరవ పిరియడ్ నందు 32 మూలకాలు ఏడవ పిరియడ్ లోని మూలకాలు అసంపూర్ణంగా నిండి వుంటాయి.

మూలకాల పరమాణు సంఖ్య 57 నుండి 71 వరకు గల మూలకాలను లాంథనాయిడ్లు అని, పరమాణు సంఖ్య 90 నుండి 103 వరకు గల మూలకాలను ఆక్టినాయిడ్ లని అంటారు. లాంథనాయిడ్లు మరియు ఆక్టినాయిడ్లను ఆవర్తన పట్టికలో క్రింది భాగంలో ప్రత్యేక బ్లాకుగా ఉంచడం జరిగింది. పైన వివరించిన శాస్త్రవేత్తలు డాబర్ నీర్, జాన్ న్యూలాండ్స్, లోథర్ మేయర్, మాండలీఫ్, హెన్రీ మోస్లే వీరి అడుగుజాడల్లో నిరంతరం, యువతరం శాస్త్రవేత్తలు కృషి, పట్టుదలతో ముందుకు దూసుకుపోతున్నారు. పిరియాడిక్ పట్టికలోని కొన్ని మూలకాల పై ఇంకా పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. రకరకాల కొత్త మూలకాలను ప్రయోగాత్మకంగా తయారు చేస్తున్నారు. పర్యావరణంలోని అనేక మార్పులకు కారణమయిన రసాయనాలు కంటికి కనిపించని ఇంకా ఎన్నో రసాయనిక పదార్థాలు భూమిలో ఉండవచ్చు. వాటిని వెలుగులోకి తెచ్చేందుకు ప్రపంచంలోని అనేక పరిశోధన సంస్థలలో రసాయన చర్యలపై, మూలకాలపై ప్రయోగాత్మకంగా పరిశీలనలు జరుగుతున్నాయని తెలిసిందే.

IICT వంటి పరిశోధన సంస్థలలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో, నూతన పరికరాలతో పరిశోధనలు జరుగుతున్నాయి.

పైన తెలిపిన ఐదుగురు శాస్త్రవేత్తలే కాదు, ఇంకా కొందరి గొప్ప శాస్త్రవేత్తల కృషి ఫలితమే మన ఈ ఆవర్తన పట్టిక రూపుదిద్దుకుంది. ఈనాటి ఈ మెండలీఫ్ ఆవర్తన పట్టికలోని మూలకాలే మన సైన్స్ కి మూలం. మెండలీఫ్ ఆవర్తన పట్టికను Short form Periodic Table అంటారు. మరి నూతన ఆవర్తన పట్టిక, అదే బోర్ ఆవర్తన పట్టిక గురించి తరువాత తెలుసుకొందాం.

ఆధారం: తొండ పావని

2.99711815562
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు