హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / పిల్లులు పైనుంచి పడినా నడిచి వెళ్ళిపోతాయి!
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పిల్లులు పైనుంచి పడినా నడిచి వెళ్ళిపోతాయి!

పిల్లులు ఎంత ఎత్తునించి పడినా సురక్షితంగా భూమిని చేరుకొంటాయి.

catఎవరైనా నాలుగంతస్తుల మేడ పైనుంచి ప్రమాదవశాత్తు పడ్డారనుకోండి! ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో నేను చెప్పాలా? మీరు ఆమాత్రం ఉషించాలేరనుకోను. ఒక వేల అలా నాలుగంతస్తుల మీదనుంచి పడి వెంటనే పైకి లేచి దుమ్ము దులుపుకొని ఎవరైనా లేచి చక్కా వేలిపోయారసుకోండి. అప్పుడు ఏమనుకుంటారు? ఒక అద్బుతం (Miracle) జరిగిందనుకొంటాం . దేవుడే అతన్ని రక్షించాడనుకొంటాం కదూ!.. కానీ పిల్లి అంత ఎత్తు నుంచి కింద పడిందనుకోండి. పడిన ప్రతీసారి లేచి అటూఇటూ ఒకసారి చూసి మియాం సురక్షితంగా ఉంటాయి ఎందుకని?

మీరు దీనిని తెలుసుకోవాలంటే అంత ఎత్తునించి పడుతున్న పిల్లని స్పీడ్ కేమరాతో ఫోటోలు తీస్తే అ ఫోటోలు చెబుతాయి అందులోని రహస్యాన్ని! అలా తీసిన ఫోటోల్లో మీకు మొదట తలకిందులుగా ఉన్న పిల్లి గాలిలోనే తన శరీరాన్ని చక్క చేసుకొంటుంది. అంటే కాళ్ళు కింది వైపు వీపు పైకి ఉంచుతుంది. ఇలా కాళ్ళు చాచడం వల్ల అది ప్యారాచూట్ లా తయారవుతుంది. ఈ స్ధితిలో అది కిందకు పడే వేగం వాతావరణంలోని గాలి దానిని పైకి నెడుతున్న వేగం సరిసమానం అవుతుంది. అప్పుడు అది నెమ్మదిగా భూమి మీదకు చేరుతుంది. దాని కాళ్ళు ఎముకల మధ్య ఉండే కండారాలు దానికి షాక్ అబ్ జార్బర్ లాగా పనిచేస్తాయి. అందుకని పిల్లులు ఎంత ఎత్తునించి పడినా సురక్షితంగా భూమిని చేరుకొంటాయి. పిల్లుల్లో ఉన్న ఒక రకమైన ఇంద్రియ జ్ఞానం అది పడుతున్నప్పడు తలకిందులుగా ఉండకుండా వెంటనే కాళ్ళు భూమివైపు ఉండేలా చేస్తుంది. ఇప్పుడర్ధం అయిందా! పిల్లులు ఎందుకు అంత సురక్షితంగా పడతాయో?

ఆధారం: సి.హెచ్. ఆనంద్

2.99392097264
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు