హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / పొద్దు తిరుగుడు పువ్వు ఎల్లప్పుడూ సూర్యుడి వైపు తిరుగుటకు కారణము
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పొద్దు తిరుగుడు పువ్వు ఎల్లప్పుడూ సూర్యుడి వైపు తిరుగుటకు కారణము

ఫోటోట్రోఫిజమ్ కాంతి ప్రేరణ

sunflowerపొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడితో బలమైన బంధం వేసుకున్నట్లు కనిపిస్తుంది. ఉదయాన్నే తూర్పు వైపుకు తిరిగి వుండి ఆ తరువాత సుర్యుడితోపాటు తన దిశను మార్చుకుంటూ వుంటుంది. ఈ దృగ్విషయాన్ని ఫోటోట్రోఫిజం అంటారు.

ఫోటోట్రోఫిజమ్ కాంతి ప్రేరణ వల్ల కలిగే పెరుగుదలకు సంబంధించిన ప్రక్రియ. మొక్క కాండంలోని ఆక్సిన్ అనే హార్మోన్ ఈ చర్యలకు మూలం. ఆక్సిన్స్ మొక్కలు పొడుగు పెరగడంలో తోడ్పడతాయి. బీటా ఇండైల్ అసిటిక్ యాసిడ్ (IAA), అమైనో ఆసిడ్స్ నుంచి గానీ, కార్బోహైడ్రేట్ ల విచ్ఛినం వల్ల ఏర్పడే గ్రైకోసైట్స్ నుంచి గానీ ఏర్పడుతుంది.

కణకవచంలోని రసాయన బంధాలపై ఆక్సిన్స్ పనిచేసే అది పొడవు పెరిగేట్లు చేస్తాయి. పొద్దు తిరుగుడు మొక్కలో ఒక వైపు నీడ ఏర్పడితే ఆ భాగంలో పెద్దమొత్తంలో ఆక్సిన్స్ ఉత్పత్తి అవుతాయి. మొక్క ఆ భాగం చాలా వేగంగా పొడవు పెరిగేట్లు చేస్తాయి.

సూర్య కాంతి లేని వైపు కాండం పొడవు పెరగడం వల్ల సూర్య కాంతి వైపు మొక్క వాలుతుంది. పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడి వైపు తిరుగుతుంది.

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు