హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / ప్రకృతిలో వస్తువులు గుండ్రంగా వుండటానికి ఇష్టపడతాయి.
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రకృతిలో వస్తువులు గుండ్రంగా వుండటానికి ఇష్టపడతాయి.

కనిపించేదంతా విశ్వం. ఖగోళంలో వుండే వస్తువులు సాధారణంగా బంతిలాగ గుండ్రటి ఆకారాన్ని కల్గివుంటాయి. మనం జీవించే ఈ భూమి గూడా గోళాకారంగా వుంటుంది.

బాలలూ... ఆరు ఆయట ఒక్కసారి తల పైకెత్తి చూడండి. కనిపించేదంతా విశ్వం. ఖగోళంలో వుండే వస్తువులు సాధారణంగా బంతిలాగ గుండ్రటి ఆకారాన్ని కల్గివుంటాయి. మనం జీవించే ఈ భూమి గూడా గోళాకారంగా వుంటుంది. అందుకే భూగోళం అని అంటాము. భూమి చుట్టూ తిరిగే చంద్రుడు, మన సౌర కుటుంబంలోని యజమాని సూర్యుడు, సంతానమైన ఇతర గ్రహాలు, బృహస్పతి, బుధుడు, శని, అంగారకుడు అన్నీ కూడా దాదాపు గుండ్రంగా వుంటాయి.

అంతా కాకుండా పదార్థాలలోని పరమాణువుల్లో గల ఎలక్ట్రాన్లు, ప్రోటీన్లు, న్యూట్రాన్లు కూడా గుండ్రంగా వుంటాయి. దీన్ని వివరించడానికి భౌతికశాస్త్ర భావన వుంది. పదార్థాలు స్థిరత్వాన్ని పొందడానికి కనిష్ట ఉపరితల వైశాల్యాన్ని పొందగలిగే ఆకారాన్ని పొందుతాయి. అన్ని ఆకారాల్లోకి గోళాకారానికి కనిష్ట ఉపరితల వైశాల్యం వుంటుంది. కాబట్టి స్థిరత్వం కోసం గుండ్రటి ఆకారాలను పొందుతాయి.

వర్షపు నీరు భూమిపై పడేటప్పుడు గోళాకారాలుగా పడతాయి. పరిశ్రమల్లో సీసపు గుండ్లను తయారు చేయడానికి కరిగించిన , సీసాన్ని పై నుండి కిందకు జారపోసినప్పుడు అవి గోళాకారాలను పొందుతాయి. కారణం ద్రవాల స్వేచ్ఛ ఉపరితలాలకు తలతన్యత అనే ప్రత్యేక ధర్మం వలన కనిష్ట ఉపరితల వైశాల్యాన్ని పొందడానికి గోళాలుగా ఏర్పడుతాయి.

రచయిత:- ఐ. శ్రీకుమార్, భౌతిక శాస్త్ర అధ్యాపకుడు, మదనపల్లె

2.9746835443
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు