పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

బడుగు బతుకుల బ్యాక్టీరియాలు

ధీర్ఝ సుఘప్తాపస్ధ (Hybernation) లో ఉన్న బ్యాక్టీరియాల గురించిన సమాచారం ఈ మధ్య “Science” పరిశోధనా గ్రంధంలో ప్రచురితమైంది.

2జీవకణం దొరకనంతవరకు నిర్జీవిలాగే ఉంటే వైరస్ లకు స్వతహాగా ఆహారంగానీ, శక్తిగానీ అవసరం లేదు. అందుకే అవి జీవకణం తారస పడనంత వరకు దాదాపు ఇసుక రేణువుల్లాగా, చక్కెర అణువుల్లాగా నిర్జీవ పదార్దాలు. కానీ జీకణం తటస్ధపడితే వాటికి పట్టపగ్గాలుండవు. తమలాంటి RNA నిర్మాణముండేలా జీవకణాన్ని ఆదేశించి మరిన్ని వైరస్ లను ఏర్పరుస్తాయి కానీ బ్యాక్టీరియాలు అలా కావు. అవి ఎక్కడున్నా (విడిగా గానీ లేదా ఏదైనా ఇతర జీవి మీద ఆధారపడి గానీ) వాటికి ఆహారం, ఆక్సిజన్ కావాలి. అంటే శక్తి కావాలి. కానీ ఈ మధ్య బ్రిటీష్ శాస్త్రవేత్తలు ఆహారం ఏమంత అవసరం లేని బడుగు బ్రతుకుల నిరుపేద బ్యాక్టీరియాలను కనుగొన్నారు. సుమారు 9 కోట్ల సంవత్సరాల నుండి అవి బ్రతికే వున్నాయి. అంటే దాదాపు డైనోసార్లు అంతరించిన కాలం నుండి నేటివరకు బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాయి. హవాయి సమీపంలో వసిఫిక్ మహా సముద్రపు అడుగుభాగాన ఉన్న నేలలో 100 అడుగుల లోతులో పూడిక క్రింద ఇలాంటి బ్యాక్టీరియాలను కనుగొన్నారు. సాధారణంగా ఉప్పు నీటిలో ఆక్సీజన్ పూర్తిగా కరగదు. లోతు వెళ్లే కొద్ది ఆక్సీజన్ పరిమాణం బాగా పడిపోతుంది. మరి పుడిక క్రింద 100 అడుగుల లోపల వున్న పొరల్లో ఆక్సీజన్ ఏముంటుంది? కానీ అక్కడ ఉన్న బ్యాక్టీరియా ఆ కొద్ది పాటి ఆక్సీజన్ ను తీసుకునే సర్దుకు పోతున్నాయి. మనం ఒక్కసారి ఊపిరి పీల్చుకోకుంటే మన ఊపిరితిత్తులలోకి వెళ్లే ఆక్సీజన్ ను ఆ బ్యాక్టీరియాలు సుమారు 15 సంవత్సరాల పాటు వినియోగించగలవన్నమాట. ఇలా ధీర్ఝ సుఘప్తాపస్ధ (Hybernation) లో ఉన్న బ్యాక్టీరియాల గురించిన సమాచారం ఈ మధ్య “Science” పరిశోధనా గ్రంధంలో ప్రచురితమైంది.

ఆధారం: ఎ. రామచంద్రయ్య

3.01111111111
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు