పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

బాలికల్లో రక్తహీనత

తీసుకునే ఆహారంలో ఐరన్ లోపం ఉండడం, రక్త హీనతకు కారణం.

తీసుకునే ఆహారంలో ఐరన్ లోపం ఉండడం అంటే, శరీరానికి కావలిసినంత సమృద్ధిగా ఐరన్ లేకపోవడం రక్తం ఎర్రగా ఉండే గుణాన్ని తగ్గిస్తుంది. అలాగే ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఈ స్థితినే రక్త హీనత లేదా అనీమియా అంటారు.

రక్తం అంటే ఏమిటి?

j22రక్తం శరీరంలో ఉండే ఒక అపారదర్శక పదార్థం. అది ప్లాస్మా, ఎర్ర రక్త కణాలు మూడు రకాలుగా ఉంటాయి. .. ఎర్ర రక్త కణాలు (ఆర్.బి.సి), తెల్ల రక్త కణాలు (డబ్ల్యూ.బి.సి), ప్లేట్లెట్స్, ఎర్ర రక్త కణాలలో పదార్థం ఎర్రని రంగులో ఉంటుంది. దీనిని హిమోగ్లోబిన్ అంటారు. ఇది ముఖ్యంగా ఐరన్, ఇంకా ఇతర ప్రోటీన్లతో నిర్మితమవుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ నిర్మాణంలో ఆటంకం ఏర్పడితే అనీమియా వ్యాధి తలెత్తుతుంది. ఎర్ర రక్త కణాలు జీవిత కాలం 100 – 120 రోజులు. ఆ తర్వాత వాటంతట అవే నశించిపోతాయి. కాని మళ్ళీ కావలసినన్ని ఎర్ర రక్త కణాల నిర్మాణం అస్థి మజ్జ ద్వారా జరుగుతుంది. ఇలా ఎర్ర రక్త కణాల నిర్మాణం అస్థి మజ్జ ద్వారా జరుగుతుంది. ఇలా ఎర్ర రక్త కణాలు తయారవటానికి ఐరన్, ప్రోటీన్లు, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ బి... 12 తో బాటు, కాపర్ జింక్ మెదలైనవి కూడా సహాయ కారకాలే.

ఐరన్ ఆహరంలోనూ లభ్యమవుతుంది. అలాగే శరీరంలో నిరంతరం నశిస్తుండే రక్త కణాల నుంచి లభించే ఐరన్ కూడా శరీరం మళ్లీ వినియోగించుకోగలదు. శరీరంలో లభించే 70 శాతం అంశాలు  రక్తంలో హిమోగ్లోబిన్ రూపంలో ఉంటాయి. 30 శాతం పదార్థాలు మాత్రం పెరిటిన్ రూపంలో అస్తి మజ్జ లివర్ (కాలేయం) స్పీన్ (ప్లీహం)లో సంగ్రహించబడి ఉంటాయి. ప్రతి రోజు శరీరం నుంచి దాదాపు 1 ఎం.జి. ఐరన్ తగ్గిపోతుంది.అలా తగ్గిపోయిన ఐరన్ తిరిగి మళ్లీ శరీరానికి సరఫరా కాకపోతే, మొదట ఉన్న మన శరీరంలో నిల్వ ఉన్న ఐరన్ తగ్గిపోతుంది. ఇక ఆ తర్వాత రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం క్షీణించడం మొదలవుతుంది. దీనినే అనీమియా వ్యాధిగా పిలుస్తారు.

ఎర్ర రక్తకణాల్లో హిమోగ్లోబిన్ వల్ల రక్తం ఎర్రని రంగుగా కనబడుతుంది. అలాగే ఇది శరీరంలోని విభిన్న అవయవాల్లోని కణాలకు ఆక్సీజన్ ను చేరవేసే ప్రయత్నం చేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ లోపం వల్ల దాని రంగు పసుపు పచ్చగా ఉంటుంది. అందువల్ల శరీరంలో కణాలకు ఆక్సీజన్ తక్కువగా లభిస్తుంది. కొన్ని అధ్యయనాలను బట్టి చూస్తే, ఒక్కోసారి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి సాధారణంగా ఉన్నాసరే, శరీరంలో ఐరన్ ని సంగ్రహించడంలో లోటుగానే ఉంటుంది. అందువల్ల కిశోర బాలికల్లో హిమోగ్లోబిన్ స్థాయి సామాన్యంగా ఉంటే కూడా ఐరన్ పోషక విలువలను నియమబద్దంగా తీసుకోవలసిందిగా సలహా ఇవ్వడం జురుగుతుంది.

రక్త హీనత సమస్య కేవలం గర్బవతి మహిళల్లోనూ, చిన్న పిల్లల్లోనూ మాత్రమే ఉందని సాదారణంగా జనంలో అపోహ ఉంది. కాని కిషోర ప్రాయంలో ఉండే బాలికలు కూడా రక్త హీనతతో బాధపడతారని అంటే, మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. రాజస్థాన్  లో 100 మంది కిశోర బాలికల్లో 70 కంటే ఎక్కువ మంది కిశోర బాలికల్లో రక్త హీనత చూడవచ్చు. మీ తరగతిలో 10 మంది ఆడపిల్లల్లోనూ 7 మందికి రక్తహీనత ఉండి ఉండవచ్చు.

ఆడపిల్లలు రక్తహీనతతో భాదపడుతున్నారని మీరెలా తెలుసుకోగలరు? రక్తహీనతని గుర్తించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఎరుపుగా లేకపోవడం, గోళ్ళు, నాలిక కళ్ళల్లో రక్తహీనత ఉన్నట్లు సూచిస్తాయి.

ఓగర్చడం ఆటలు ఆడడం, గెంతడం, మెట్లు ఎక్కడం వంటి తేలికైన పనులు చేసిన వారికి ఉపిరి సరిగ్గా అందదు. వారు త్వరగా అలిసిపోతారు. ఆ బాలికలు పాఠశాల ఆటపాటలు కార్యక్రమాల్లో పాల్గొనడం కష్టమైపోతుంది. నెలసరిలో అధిక రక్త స్రావం రక్తహీనత ఉంటే నెలసరిలో రక్త స్రావం ఎక్కువగా అవుతుంది. అప్పుడు రక్తహీనత సమస్య మరింత అధికమవుతుంది.

j23అలసట, నడుం నొప్పి, ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు చేయడం లేదా స్నేహితురాల్ల తో ఆడుకోవడం లాంటి క్రియల వల్ల కూడా వారు అలిసిపోతారు. వారికి నడుము నొప్పిగా ఉంటుంది. ఆకలి తక్కువగా ఉండడం అనీమియా ఉన్న కిశోరీ బాలికల్లో ఆకలి తక్కువగా ఉండడమనే సమస్య సర్వ సాధారణం. అలాంటి బాలికలకు తినడం మీద అయిష్టత ఏర్పడుతుంది. ఫలితంగా, వీరు ఐరన్ లోపానికే కాక, కేలరీ, ప్రోటీన్, విటమిన్లు, ఇంకా అవసరమైన పోషక పదార్థాల లోపాలకు గురవుతారు. ఆ కారణంగా వీరి శరీర బరువు కూడ తగ్గిపోతుంది. ఎత్తు కూడా కోరుకున్నంతగా ఎదగలేరు. పాఠశాలలో నీరసంగా ఉండడం రక్తహీనత వల్ల నేర్చుకోవడం, గుర్తించుకోవడం బాగా తగ్గిపోతుంది. అందువల్ల, పాఠశాల చదువుపై వారి పాఠశాలకు రావడం/చదవడం కూడా విడిచి పెట్టేస్తారు.

చీటికి మాటికీ జబ్బు చేయడం

రక్త హీనత వల్ల బాదపడే పిల్లలకు తరుచుగా జబ్బు చేస్తుంది. ఎందుకంటే, రక్తహీనత వల్ల వారి రోగ నిరోదక సామర్థ్యం ప్రభావితమవుతుంది. ఇక వారు పాఠశాలకు ఎప్పుడూ గైర్హాజరు అవుతూ ఉంటారు. రక్తహీనత ఏ స్థాయిలో ఉందో కనుక్కోవడానికి మరొక పద్ధతి ఉంది. ఇది చాలా సులువైన శిక్షణ ప్రయోగశాల విధానం. దీని వల్ల రక్తంలోని ఎరుపు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. కిశోర బాలికల పట్ల 100 మి. లీటర్ల రక్తంలో 12 గ్రా. కంటే తక్కువ ప్రమాణంలో ఉన్న హిమోగ్లోబిన్ స్థాయి వారిలో రక్తహీనతను సూచిస్తుంది. అనీమియా నివారణకు రెండు తేలికైన పద్ధతులు ఆహారంలో మార్పులు కిశోర బాలికల్లో పోషణలో మంచి మార్పు తేవడం అవసరమైన ఆహార సంబంధమైన సూచనలు:

 1. కిశోర బాలికల శారీరక అభివృద్ది చాలా వేగవంతంగా జరిగే సమయంలో, భోజనం ఎక్కువ పరిమాణంలో నియమబద్ధంగా తీసుకోవాలి.
 2. ఆహార నాణ్యత, అందులోనూ సూక్ష్మ పోషక పదార్థాలు ఉండే విధంగా వివిధ ఆహార పదార్థాలను స్వీకరించాలి.

  ఉదా- ఆహారంలో తగినంత మోతాదులో ఐరన్, ప్రోటీన్లతో కూడిన ఆహారం ఉండేలా చూసుకోవాలి.

  • రోజు తీసుకునే ఆహారంలో తాజా ఆకు కూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
  • వీలైనంత వరకూ మాంసాహార పదార్థాలను ఉపయోగించడం.
  • విటమిన్ సి తో కూడిన ఆహారం తీసుకోవడం.

పైన తెలిపిన భోజన పదార్థాలన్నీ క్రమబద్దంగా తీసుకోవాలి. అవి స్వచ్ఛందంగానే ఉన్నాయని నిర్ధారించుకోవాలి.

శాకాహారులు

తాజా ఆకుకూరలు, (మెంతి, తోటకూర, ముల్లంగి ఆకులు, క్యాలీ ఫ్లవర్ ఆకులు, ఆవాల కూర, బఠాణీ మెలకెత్తిన ధాన్యాలు, సోయాబీన్, తాలింపు శెనగలు, వేరుశనగ, నువ్వులు, అటుకులు, జొన్నలు, సీతాఫలం, సపోటా, కరౌందా, ఖర్జూరం, తర్బూజ, బెల్లం మొదలైనవి. మాంసాహారులు మాంసం, రొయ్యలు, చేపలు, కాలేయం, కోడు గ్రుడ్లు మొదలైనవి.

పండ్లు విటమిన్ సి పుష్కలంగా ఉండే జామ, బత్తాయి, కమలా పలం, ఉసిరి లేదా నిమ్మకాయలు భోజనంతో పాటు తీసుకున్నప్పుడు శరీరం ఐరన్ ని బాగా సంగ్రహించుకోగలుగుతుంది. అది రక్తాన్ని మరింత బలంగా, శక్తివంతంగా ఉండేలా చూస్తుంది. పళ్లు బాగా తీసుకోవాలి. భోజనానికి 2/3 గంటల ముందు గానీ వెనక గానీ టీ త్రాగకూడదు. భోజన పదార్థాలలో ఉన్న ఐరన్ పోషకాలను టీ శరీరం గ్రహించకుండా చేస్తుంది. పేజి 15 ఐరన్ లోపం పూరించడం అనీమియా (రక్త హీనత) నివారణ కోసం మరో కొత్త పద్ధతి కూడా ఉంది. ఐఎఫ్ఎ బిళ్లలను వారానికి ఒకటి చొప్పున క్రమం తప్పకుండా వేసుకోవాలి. మీరు ఉపాధ్యాయులు కావడం వల్ల మీ విద్యార్థులకు ఐఎఫ్ఎ బిళ్లలు ఇచ్చి, వారు శక్తివంతంగా, చురుగ్గా ఎదిగేందుకు సహాయం చేయగలుగుతారు. కిశోర బాలికల కోసం బిళ్లలో 100 మి.గ్రా. ఐరన్ , 0.5 మి.గ్రా. ఫోలిక్ యాసిడ్ ఉంటాయి.

కిశోర బాలికలందరూ వారానికి ఒకరి చొప్పున ఐఎఫ్ఎ బిళ్లలు తీసుకుంటున్నారని మీరు నిర్థారించుకోవాలి అంటే ఏడాదికి 52 బిళ్లలు అవుతాయన్నమాట. బిళ్ల మీ ఎదుటే వేసుకునేటట్లు చేయాలి. వారానికి ఒకసారి ఐ.ఎఫ్.ఎ బిళ్ల తీసుకుంటున్నపుడు అప్పుడప్పుడూ కొందరూ కిశోర బాలికలు బోజనం చేశాక మాత్ర వేసుకోకపోతే, మలబద్ధకం, ఛాతిలో మంట, గాభరా మొదలవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ ఈ రకమైన సాధారణ సమస్యలను నివారించడానికి బిళ్లను భోజనం చేశాక వేసుకోవాలి. ఏమీ తినకుండా మాత్రం మాత్ర వేసుకోకూడదు. పాఠశాలలో చదువు బాగా రావడానికి, వారానికి ఒక సారి ఐఎఫ్ఎ బిళ్ల తప్పనిరిగా వేసుకోవాలని ఆ బాలికలతో మీరే చెప్పాలి. మీరు మీ విద్యార్థులకు రక్తహీనతతో పోరాడాలనీ, అప్రమత్తంగా, చురుగ్గా, ఆరోగ్యవంతంగా ఎదగాలని, విద్యాలయంలో అన్ని రకాల నైపుణ్యాలూ సంపాదించుకోవాలని తెలియజెప్పండి.

అనీమియా నివారణ కోసం కొన్ని ఇతర ముఖ్య చర్యలు

 1. శరీరంలో సూక్ష్మ క్రిములు ఉంటే అవి రక్తానికి నష్టం చేకూరుస్తుంది. అనీమియాను నివారించడానికి ఐరన్ పోషకాల సేవనంతో సహాయనుసారంగా సూక్ష్మ క్రిములు నశించేందుకు మందులు ఉపయోగించాలి.
 2. అరి పాదాలలో నుంచి క్రిమి శరీరంలోనికి ప్రవేశిస్తుంది, కాబట్టి వీలైనంత వరకు కిశోర బాలికలు చెప్పులు ఉపయోగించుకోవాలి. చెప్పులు లేని పాదాలతో తిరిగి విసర్జించరాదని, మరుగుదొడ్డి ఉపయోగించాలని తెలియజేయాలి.
 3. మలేరియా పరాన్నజీవి కూడా అనీమియా స్థితిని మరింతగా వృద్ధి చేస్తుంది. అందువల్ల మలేరియా ఎక్కువగా ఉన్న చోట్ల, అనీమియా వ్యాధి రాకుండా నివారించేందుకు మలేరియా చికిత్సతో బాటు నివారణోపాయాల మీద కూడా దృష్టి పెట్టడం అవసరం.
 4. అనీమియా రాకుండా కాపాడుకోవడానికి ఐరన్ పోషక పదార్థాలతోబాటు ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12, విటమిన్ సి, జింకు వంటి ఇతర సూక్ష్మ పోక విలువలున్న ఆహారాన్ని సేవించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
 5. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన విద్య, అవగాహన, కిశోర బాలికలకు నిరంతరం తెలియజేస్తూనే ఉండాలి. తద్వారా వారికి అనీమియా వల్ల శరీరం ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు కావలసిన ఇతర సమాచారాన్ని కూడా తెలుసుకోగలుగుతారు. భవిష్యత్తులో వీరు తల్లులు అయ్యే సమయానికి వీరు మంచి ఆరోగ్యంతో, చురుకుగా ఉండగలుగుతారు.
 6. విటమిన్ సి ఐరన్ అపశోషణలో తోడ్పడుతుంది. అందుకనే క్రమం తప్పకుండా పులుపు పళ్లు, ఇంకా కూరలను సేవించాలి.

యుక్త వయసులో వివాహం

18 ఏళ్ల కంటే ముందు ఒక బాలిక వివాహం చేయడం చట్ట ప్రకారం నిషేధం. ముందు ముందు నిర్వహించబోయే బాధ్యతలను వహించడానికి మానసికంగానూ, శారీరికంగానూ కూడా సంసిద్ధత అవసరం. వివాహానికి ముందే తల్లిదండ్రుల వద్దనే ఉంటూ, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, బాగా చదువుకుని, ఏదైనా ఒక లక్ష్యంతో శిక్షణ తీసుకోవాలి. పదిమందికీ ఆదర్శం కావాలి.

ఆధారం: రమా సుందరి

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు