పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

భాస్వరాన్ని ఇలా కనుగొన్నారు

కాల్షియం, ఫాస్పరస్, ఆక్సిజన్ ల సమ్మేళనం భాస్వరం.

ఇప్పటికి కొన్ని వందల ఏళ్ల కిందట మాట. 302.jpgజర్మనీకి చెందిన హేంబర్గ్ పట్టణంలో హేనింగ్ బ్రాండ్ అనే వ్యాపారి ఉండేవాడు. అతను తన వ్యాపారంలో ఏపాటి తెలివితేటలు చూపించేవాడో ఏమో మనకు తెలియదుగాని, రకరకాల రసాయన పదార్థాల విషయంలో మాత్రం అతను చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు.

అయితే .... చాలా మంది మామూలు జనంలాగే హేనింగ్ కూడా ఉన్న పళంగా ధనవంతుడ్ని అయిపోవాలని కలలుగనేవాడు. చూడ్డానికి అది చాలా సులభంగానే అన్పించేది. అదెలాగంటారా ? మన ప్రాచీనులు చెప్పిన పరుసవేది అనే ఒక రసాయన పదార్థాన్ని కనుగొంటే చాలు. దాని సాయంతో రాళ్ళూ రప్పల్ని కూడా బంగారంలా మార్చి పడేయొచ్చు. ఇలా ఆలోచించుకున్న హేలింగ్ ఇక ఆ క్షణం నుంచి పరిసవేదిని కనిపెట్టే పనిలో లీనైపోయాడు.

ఇలా ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు హైనింగ్ బ్రాండ్ పేరుని వ్యాపారుల్లో చాలా మంది మర్చిపోయారు. అప్పుడప్పుడూ కొందరు అతడ్ని గుర్తు చేసుకున్నటికీ అతని గురించి ఇక చెప్పకోవలసింది ఏమీ లేదు. అన్నట్లుగా పెదవి విరిచేవారు. ఎందుకంటే ఎప్పుడు చూసినా హైనింగ్ బ్రాండ్ ఓదో ఒక ప్రయోగం చేస్తూ కన్పించేవాడు. అతను ప్రతిరోజూ రకరకాల ఖనిజాలని, రసాయనాలని, ఇంకా మిశ్రమాలని కలుపుతూ, కరిగిస్తూ, విడదీస్తూ, జల్లెడపడుతూ.... ఇలా వాటితో ఏదేదో చేస్తూ వుండేవాడు. గాఢమైన ఆమ్లాల వల్ల, క్షారాల వల్ల, ఇంకా నిప్పుల వల్ల అతని చేతుల నిండా గాయాలయ్యాయి. బొబ్బలెక్కాయి. ప్రతీదాన్ని బంగారంలా మార్చగలిగే పరుసవేది కోసం పాపం హైనింగ్ ఇంతలా కష్టపడ్డాడు.

303.jpgఎన్ని ప్రయోగాలు చేసినా హైనింగ్ కోరుకున్న అద్భుత పదార్థం. అయితే దొరకలేదుగాని ఒకానొక శుభదినాన ఓ చక్కటి ఆవిష్కరణ మాత్రం జరిగింది.

ఆ రోజు రాత్రి ఒక గిన్నె అడుగుభాగంలో మంచులా తెల్లగా ఉన్న పదార్థం ఒకటి హైనింగ్ బ్రాండ్ కంటపడింది. అది గిన్నె అడుగుభాగమంతా అంటుకొని ఉండటమేగాక, చీకట్లో తళతళా మెరుస్తోంది. దాని నుంచి వెలువడే చల్లని కాంతిలో హైనింగ్ తన పాత రసాయనాల పుస్తకాన్ని కూడా చదువుకోగలిగాడు. ఆ పదార్థాన్ని మండించాలని చూస్తే అది గుప్పు గుప్పున పొగలు వదులుతూ క్షణాలలో మండిపోయింది.

అలా, అనుకోకుండా హైనింగ్ మహాశయుడు కనిపెట్టిన ఆ పదార్థం మరోమిటో కాదు. అదే ఫాస్ఫరస్ లేదా భాస్వరం ..గ్రీకు పదమైన ఆ మాటకు వెలుతురుని ఇచ్చేది అని అర్థం.

ఒకప్పుడు గూఢచారి కథలు రాయడంలో దిట్ట అయిన షెర్లాక్ హామ్స్ అనే రచయిత ది హౌండ్ ఆఫ్ భాస్కర్ విల్లాస్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. అందులో... దున్నపోతులా ఉండే ఓ కుక్కను చూసి అందరూ హడలిపోతుంటారు. ఆకుక్క ముఖం నుంచి, మీద భాస్వరాన్ని అద్దారని, అందుకే అది అలా మెరుస్తూ కనిపిస్తుందని కథ చివరలో మనకు తెలుస్తుంది.

ఏదేమైనా ...బాగా మెరిసే అనేక వస్తువులలో భాస్వరం కూడా ఒక ముఖ్య పదార్థమై వుంటుంది. ఇలా మెరిసే విషయంలోనే కాదు, అనేక ఇతర విషయాల్లోనూ అది తనదంటూ కొన్ని ప్రత్యేకతలను కలిగివుంటోంది... ఒకసారి ఓ శాస్త్రజ్ఞుడు ఏమన్నాడో తెలుసా... ఫాస్పరస్ అనేది లేకుండా అది నిజం కూడా... ఎందుకంటే మన మెదడులోని కణజాలాల్లో పెద్ద మొత్తంలో బాస్వరం ఉంటుంది.

ఒక విధంగా, భాస్వరం లేకుండా మనం జీవించి ఉండటం కూడా కొనసాగదని చెప్పాలి. ఎలాగంటే... భాస్వరం లేకుండా మన శరీరంలోని కండరాలు తమ లోపల శక్తిని నిల్వచేసుకోలేవు, అలాగే మనం శ్వాసను కూడా తీసుకోలేము. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రాణాలతో ఉన్న ప్రతి జీవిలోని కండరాల్లోనూ భాస్వరం అనేది అతి ముఖ్యమైనదని మీకు తెలిసిందేగా... ఇది దేనితో తయారవుతుందని అనుకుంటున్నారు ... కాల్షియం, ఫాస్పరస్, ఇంకా ఆక్సిజన్ ల సమ్మేళనంతో రూపొందుతుంది. అదీ విషయం..

ఒకవేళ జీవులకు భాస్వరం అందకుండా చేస్తే ఏం జరుగుతుంది అన్న విషయంపై గతంలో పలు ప్రయోగాలు జరిగాయి. ఒక ప్రయోగంలో.... మొక్కలకు ఫాస్పరస్ ని అందనీకుండా చేస్తే వాటికొమ్మలు – రెమ్మలు బలహీనమై పోయి పంట కూడా ఆలస్యంగా వస్తుందని తేలింది.

అసలింతకూ భాస్వరం ఎందుకు మెరుస్తుందో మీకు తెలుసా... తెల్ల భాస్వరం ఉన్నచోట, దానిచుట్టూతా భాస్వరం తాలూకూ ఆవిరి ఆవరించి వుంటుంది. ఈ ఆవిరిలోని భాస్వరం అణువులు గాలిలోని ఆక్సిజన్ తో కలియడం వలన పెద్ద మొత్తంలో శక్తి ఉత్పన్నం అవుతుంది. ఈ శక్తి భాస్వరం తాలుకూ అణువుల్ని ఉత్తేజితం చేయడంతో అవి కాంతిని విడుదల చేస్తాయి. అదీ అసలు సంగతి..

3.0303030303
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు