పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

భూతాపాన్ని నిలువరించాలి

భూతాపాన్ని నిలువరించడానకి తగిత చర్యలు తీసుకోవాలి.

earthdayరోమ్ నగరం తగలబడి పోతుంటే నీరో చక్రవర్తి వీణ వాయిస్తున్నాడట. రాజ్యం, ప్రజలు సర్వనాశనమైనా ప్రభువులకేమి పట్టదని దీనర్ధం అది గతం మరి నేటి మాటేమిటి? 21వ శతాబ్దంలో ఏలినవారి తీరెలావుంది? నేటి ముప్పు కేవలం ఒక నగరానికో, ఒక దేశానికొ పరిమితమైంది కాదు యావత్తు భూగోళమే ప్రమాదంలో పడింది. భూతాపం పెరిగిపోతున్నది. నానాటికీ ఉష్ణోగ్రతలు అంచనాలకు మించి పెరిగిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే సముద్ర తీరంలో వున్న చాలా ప్రాంతాలు, దీవులు కనుమరుగవుతాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. వాతావరణం వేడెక్కడానికి గల కారణాలను వారు ప్రధానమైంది కార్బన్ డై ఆక్సైడ్. దీనికి తోడు మిథేన్ వాహనాలు విడుదల చేసే అనేక విష వాయువులు. రిఫ్రిజిరేటర్ల నుండి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్లు వగైరా ఈ వాయువులను భూ వాతావరణంలోకి ఎగజిమ్మిన దేశాల్లో అగ్రస్థానం అమెరికాది. దీనికి తోడు అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాలు. విషం ఎవరు వదిలినా దాని దుష్ప్రభావం మాత్రం భూమ్మీద జీవించే ప్రతి ఒక్కరి మీద పడుతుంది. మరి ఈ ప్రమాదాన్ని నిలువరించాలంటే ముందుగా చర్యలు తీసుకోవలసిన వారు ఎవరు? అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలే కదా! అదేమాట అంతర్జాతీయ వేదికల మీద పదే పదే చెబుతున్నారు. క్యోటో ఒప్పందం వంటి అనేక అంతర్జాతీయ ఒప్పందాలు కాగితాలకే పరిమితం అయ్యాయి. భూతాపం పెరగటానికి కారణం నువ్వంటే నువ్వని తగవులాటలే కాని తగిన చర్యలు లేకపోవటం క్షమించరానిది. రుతువులు గతి తప్పటం కరువు కాటకాలు వరదలు ఇలా అనేక దుష్ప్రచారాలను ఇప్పటికే మనం చూస్తున్నాం. మన కాళ్ళ కింద భూమి కరిగిపోయే రోజులోచ్చాయి. దీన్ని కొంత మేరకైనా నిలువరించగలమా ఇకనైనా ఉష్ణోగ్రతలు పెరగకుండా చర్యలు తీసుకుంటాయా ప్రపంచ దేశాలు? ఏమో ఇంత ముప్పు వుందని తెలిసీ ఎందుకు తగు చర్యలు చేప్పట్టలేక పోతున్నారు? ఇందుకు ప్రధాన కారణం మనం ఎంచుకున్న అభివృద్ధి నమూనానే. రేపటితో ఏం పని? ఈ రోజు గడిస్తే చాలన్న వైఖరి దుష్పరిణామాలకు మూలం. ఒకే ఒక్క ఉదాహరణ చూద్దాం! శిలాజ ఇంధన వనరులు నానాటికీ క్షీణిస్తున్నాయి. కాని పెట్రోలు వాడకం దినదినం పెరుగుతూనే ఉంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కార్లు రోడ్డెక్కుతున్నాయి. ఒక్క బస్సు కనీసం 50 కార్లకు సమానం. అంటే ఏం చేయాలి. ప్రజారవాణాను మన ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇవ్వాలి. శాస్త్రీయంగా (హేతుబద్దంగా) ఆలోచిస్తే ప్రతి సమస్యకూ పరిష్కారం దొరుకుతుంది. అందుకే ముందు మన ఆలోచనలకు పదును పెట్టాలి. ఇందుకు ప్రతియేటా ఏప్రిల్ 22న జరుపుకునే 'ధరిత్రీ దినోత్సవం' మంచి సందర్భం, భూమిని కాపాడుకోవాలనే ఆలోచనతో 1970లో అమెరికాలో ఒక ప్రాంతంలో మొదలైన ఉద్యమం 1992 'ధరిత్రీ సదస్సు'తో అంతర్జాతీయంగా 183 దేశాల్లో జరుపుకుంటున్నారు. మన స్కూళ్లకు సెలవులు కూడా వస్తున్నాయి. కాబట్టి స్కూల్లో 'ధరిత్రీ దినం' జరుపుకుని, ఎండాకాలంలో పిల్లలు ఈ విషయంపై ప్రాజెక్టులు, ప్రచారం చేసే విధంగా ప్రోత్సహించాలి.

ఈ విశ్వంలో భూగ్రహానికి ఒక గొప్ప విశిష్టత ఉంది. పై ముప్పావు భాగానికి పైగా నీరు ఉండటం వల్ల భూమిని 'నీలిగ్రహం' అంటారని కూడా మీకు తెలుసు. ఇంతగా నీరున్నా మనకు లేదా జీవప్రపంచానికి అందుబాటులో ఉన్నది ఒక శాతం కంటే తక్కువే. ఆ నీటిని కూడా మనం సక్రమంగా వాడుకోలేక చిక్కుల్లో పడ్డాము. ఈ రోజు ఎటు చూసినా నీటి ఎద్దడి. ‘ప్రతి నీటి చుక్కనూ పొదుపు చేయండి. నీటికి కాపాడుకుందాం' అని మార్చి నెలలో ‘ప్రపంచ నీటి దినోత్సవం' నాడు ప్రతిజ్ఞలు కూడా చేశాం. ఇది మంచి ప్రయత్నం. నీటి పొదుపు గురించి మాట్లాడేటప్పుడు, ఎవరు పొదుపు చేయాలో కూడా మనకు తెలియాలి. ఇదేమి పెద్ద పజిలా? ఎవరు వృధా చేస్తారో, చేస్తున్నారో వాళ్లే కదా పొదుపు చేయవలసింది. ఉదాహరణకు మనకు నిత్యం కనిపించే కూల్ డ్రింక్స్ తీసుకుందాం. వీటి ఉత్పత్తికి నీటిని వాడటాన్ని ఏమందాం! వృధానే కదా! మీరు కూడా ఆలోచించండి. మీరు నిత్యం చూస్తున్న వాటిలో, వాడకంలో ఎక్కడ వృధా వుంటే అక్కడ బ్రేకులు వేయండి. ఇది కేవలం నీటిని పొదుపుచేయటమే అనుకోవద్దు, మన కోసం, ముందు తరాల రేపటి కోసం భూమిని కాపాడుకోవటం కూడా, ఏమంటారు!

ఆధారం: ప్రొ. కె. సత్యప్రసాద్

2.99197860963
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు