హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / భూమి గుండ్రంగా వుంటే అందరికీ ఆకాశం తల మీదే వుంటుంది ఎందుకు?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

భూమి గుండ్రంగా వుంటే అందరికీ ఆకాశం తల మీదే వుంటుంది ఎందుకు?

ఉత్తర ధృవంలో వున్న వాళ్ళు పైకి నిటారుగా, దక్షిణ ధృవంలో వున్న వాళ్ళు తల్లక్రిందులుగా, భూమధ్యరేఖ మీద వున్న వారు పక్కకు వుండాలి కదా? అలా ఎందుకు లేదో తెలుసుకుందాం.

earthద్రవ్యరాశి నికరంగా (finite) ఉన్న ఏ రెండు పదార్ధాల మధ్యనైనా నా సరే విధిగా గురుత్వాకర్షక (gravitational force) బలం ఉంటుందన్నది ఓ ప్రకృతి నియమం. ఈ విశాల విశ్వంలో కేవలం నాలుగంటే నాలుగే రకాలు బలాలున్నాయన్నది ఓ ప్రకృతి సూత్రం కాగా వస్తువులకున్న ద్రవ్యరాశి (mass) ఆధారంగా వస్తువుల మధ్య ఏర్పడే ప్రతిచర్య (interaction) ని 'గురుత్వాకర్షక పరిచర్య (gravitational interaction) అంటాము. అందుకే భూమ్మీద ఉన్న వస్తువులన్నింటినీ భూమి తన నేలకు అంటి పెట్టుకొంది. పైకి విసిరేసిన వస్తువు క్రింద పడేదీ అందుకే ఈ గురుత్వాకర్షణ ఆధారంగానే వాటర్ ట్యాంకులు ఎక్కి నన్ను ప్రేమిస్తేనే ఊరుకుంటాను లేదా దూకుతాను' అనో 'నన్ను పాస్ చేస్తేనే దిగుతాను లేకుంటే దూకుతాను' అనో నాకు తెలంగాణా యిస్తేనే ఊరుకుంటాను, లేకపోతే దూకుతాను అనో అనగలుగుతున్నారు. రెండు వస్తువుల మధ్య దూరాన్ని తగ్గించే ప్రక్రియలోనే ఆ రెండు వస్తువుల మధ్య | గురుత్వాకర్షక బలం ఉంటుంది.

మనిషి తన వేళ్ళను నేలకు ఆన్చి తన శరీరపు గరిమనాభి (Centre gravity) నుంచి భూమి కేంద్రం వైపునకు గీచిన ఊహారేఖ (imaginary line)) తన పాదాల గుండా లేదా పాదాల మధ్య నుంచి పోయేలా నిలబడ్డం వల్లే నిలబడగలడు. లేకుంటే పడిపోతాడు. ఇండియాలో ఉన్న భారతీయుడు, అమెరికాలో ఉన్న ప్రవాసభారతీయుడు న్యూజీలాండ్లో క్రికెట్ మ్యాచ్ కోసం వెళ్ళిన క్రికెటింగ్ భారతీయుడు కువైట్ లో శ్రామిక జీవిగా పొట్ట పోసుకుంటున్న శ్రామిక భారతీయుడు అందరూ తమ కారును నేలవైపునే ఉంచి ఉన్నారు.

భూమి గోళాకారంలో (spherical) ఉండడం వల్ల వీరందరి కాళ్ళు భూమికేంద్రం వైపునకు, వారి తలలు భూమి కేంద్రానికి వ్యతిరేకదిశలోనూ ఉన్నాయి. ఒక అయస్కాంతానికి మీరు ఓ ఇనుప వస్తువును అంటించాడనుకుందాం. ఇప్పుడు ఆ అయస్కాంతాన్ని ఎటు త్రిప్పినా ఆ ఇనుక వస్తువు ఆ అయస్కాంతానికి అదే విధంగా అతుక్కొనే ఉంటుంది. భూమి ఆకర్షణ వల్ల భూమి పై ఉన్న మనుషులు, భవనాలు, చెట్లు, గాలి కూడా భూమికి అంటూకొని ఉన్నాయి. మీరన్నట్లు ఉత్తర, దక్షిన ధృవాల మీద ఉన్నవారు పైన, క్రిందకు, భూమధ్య రేఖ మీద ఉన్నవారు ప్రక్కు వైపునకు తలలు పెట్టి ఉన్నట్లు కనిపించేది. భూమికి దూరంగా ఉన్న

పరిశీలకులకి మాత్రమే భూమిపైన ఓ వ్యక్తి భూమధ్య రేఖ పైనే ఉన్నా లేదా మరెక్కడున్నా తల పైభాగాన్ని ఆ వ్యక్తి ఆకాశం (Sky) గా భావిస్తాడు.

ఎందుకంటే అక్కడ అతనికి నక్షత్రాలు, మేఘాలు కనిపిస్తాయి. తన తల పైన ఉన్న భాగమంతా నీలాకాశంగానే కనిపిస్తుంది. అంటే అమెరికాలో ఉన్న ప్రవాసభారతీయుడి ఆకాశం, భారతదేశములో ఉన్న భారతీయుడి ఆకాశం, భూమధ్య రేఖకు అటూ యిటూ ఉన్న ఇద్దరు భారతీయుల తలమీద ఆకాశం ఒక్కటే కాదు. ఎవరి ఆకాశం వారిది. ఎవరి ఆకాశంలో వారి నక్షత్రాలు వేరు. ఒకరికి రాత్రి, మరొకరికి పగలు "ఒకరికి ఉదయం 10 గం.లుగా కనిపించే సూర్యుడున్న ఆకాశం, మరొకరికి సాయంత్రం 5గం. లుగా కనిపించే సూర్యుడున్న ఆకాశం, ఒకరికి మిట్ట మధ్యాహ్నాంగా ఉన్న ఆకాశం, మరొకరికి చిమ్మ చీకటిగా అర్థరాత్రిలాగా ఉన్న ఆకాశం అవగతమవుతాయి. ఉత్తర ధృవం మీద ఉన్న వారికి 6 నెలలు పగలుగా సంధ్యా సమయం లేదా దృవంలో చీకటి అంటే కొద్దో గొప్పో దక్షిణ ధృవంలో వెలుగు ఉంటుంది.

ఈ విషయాన్ని మరో విధంగా చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం.

మీరు పాఠశాలలో బొమ్మల్ని తయారు చేసేందుకు వాడే బంక మన్నును తీసుకొని దాన్ని లడ్డూలాగా గుండ్రంగా గోళాకారం లోకి మలవండి, దాని పైన గుండు సూదుల్ని నాలుగు చోట్ల పైన, క్రింద, ఎడమ ప్రక్కన, కుడి ప్రక్కన గుచ్చండి. గుండు సూదుల్ని మనషులుగా ఊహించండి. బంక మన్ను గోళమే భూమి. ఆ, బంకమన్నులో గుండు సూది గ్రుచ్చుకున్న సూది భాగమే మనిషి కాళ్ళు. ఇక గుండు సూది గుండే మనిషితల భాగం కదా!

ఇక ఆ బంకమన్ను గోళం, ఆ నాలుగు గుండు సూదులు తప్ప మిగిలిన పది సూదులన్ని ఆ భూమికి ఆకాశమే. అంటే పైన ఉన్న గుండు సూది గుండు పైన మీ తరగతి పై కప్పు అతని ఆకాశం, క్రిందున్న గుండు సూదికి మీ తరగతి నేల (తన తలపైన, కాళ్ళకు వ్యతిరేక దిశలో ఉంది కాబట్టి) ఆకాశమవుతుంది. ప్రక్కకనున్న గుండుసూది గుండులకు మీ తరగతి గది తలుపులూ లేదా కిటికీలు అదే దిశలో ఉండడం వల్ల అవి వాటికి పైన ఉన్నట్లు అర్థం. అవే వాటి ఆకాశం, ఎవరికైనా తమ తల పై ఉండేది, వారి నేలకు ఎదురుగా ఉండేది ఆకాశం.

ఆధారం: ప్రొ. ఎ. రామచంద్రయ్య.

3.00589970501
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు