హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / భూమి మనతో పాటు తిరుగుతుంది కదా! మనకు కళ్ళు తిరుగవు ఎందుకని ?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

భూమి మనతో పాటు తిరుగుతుంది కదా! మనకు కళ్ళు తిరుగవు ఎందుకని ?

మనం భూమిపైన వున్నప్పుడు మన భూమిలాగే ఏ నికర బలాలకు లోనుకాకుండా సమతాస్థితిలో వుంటాము. భూమి తిరుగుతున్న విషయాన్ని గుర్తించలేము.

globeమనం భూమిపైన వున్నప్పుడు మన భూమిలాగే ఏ నికర బలాలకు లోనుకాకుండా సమతాస్థితిలో వుంటాము. అందువల్ల భూమి తిరుగుతున్న విషయాన్ని గుర్తించలేము. అయితే మనము గిరగిరా తిరిగినపుడు సాపేక్షంగా మన శరీర అంతర్భాగాలలోని ద్రవ పదార్థాలలో చలనాలు ఏర్పడతాయి. ఏదైనా నీటికుండను గిరగిరా త్రిప్పితే కుండతోపాటు నీరు కూడా గిరగిర తిరుగుతుంది కదా !

మనకు కళ్ళు తిరగటానికి ప్రధాన కారణం మధ్య చెవిలో వున్న కాక్లియా అనే వలయాకార నాళికలలోని ద్రవంలో అలజడులు రావడమే. ఈ ద్రవంలో ఏర్పడ్డ చలనాలకు అనుగుణంగా మెదడుకు సంకేతాలు అందుతాయి. శరీరాన్ని ఈ కదలికలు అనుగుణంగా నిలకడగా వుండటానికి మెదడు ప్రయత్నిస్తుంది. అయితే నాళాలలో కదలికలు ఎక్కువ సేపు వుండటం వలన మెదడు శరీరానికి సరైన సంకేతాలను ఇచ్చి సమతాస్థితిలో శరీరాన్ని వుంచటానికి ప్రయత్నించినా, పదే పదే కాక్లియా ద్రవంలో మార్పులు మెదడును గందరగోళ పరుస్తాయి. అందువలన మనం నిలకడగా వుండలేము. దీనితోపాటు కంటిలోని ద్రవం కూడా కదలికలకు లోనుకావటం వలన పదే పదే పాతదృశ్యాలు కంటి రెటీనాలో కొంత సేపు వుండటం వలన దృష్టి కూడా గందరగోళానికి గురౌతుంది. అందువలన మనకు కళ్ళు తిరుగుతాయి.

భూమితోపాటు మనం తిరుగుతున్నపుడు ఇంత తీవ్ర పరిస్థితి ఏర్పడదు.

ప్రశ్న అడిగినవారు: పి. ఆదిత్య, 9వ తరగతి, విజయవాడ.

3.01948051948
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు