హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / భూమిని ప్లాస్టిక్ గోళంగా మార్చేస్తున్నాం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

భూమిని ప్లాస్టిక్ గోళంగా మార్చేస్తున్నాం

విపరీత పరిణామాల కారణంగా భూమి ప్లాస్టిక్ గోళంగా మారిపోతోందని అమెరికాలోని జార్జియా యూనివర్సిటీ ఓ అధ్యయనంలో తేల్చింది.

జార్జియా యూనివర్సిటీ అధ్యయనం

plasticఈ రోజుల్లో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మనం వాడుతున్న ప్లాస్టిక్లో చాలా వరకు భూమిలో కరిగిపోవడం లేదు. చెత్తగా పారేస్తున్న ప్లాస్టిక్ భూమిలో కలిసిపోయేందుకు కొన్నివేల సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఈ విపరీత పరిణామాల కారణంగా భూమి ప్లాస్టిక్ గోళంగా మారిపోతోందని అమెరికాలోని జార్జియా యూనివర్సిటీ ఓ అధ్యయనంలో తేల్చింది. 1950 నుంచి 2015 వరకు ప్రపంచ వ్యాప్తంగా 830 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయింది. ఇందులో 630 కోట్లటన్నుల ప్లాస్టిక్ చెత్త రూపంలో భూమి మీద పేరుకుపోయింది. ప్లాస్టిక్ చెత్తలో 9 శాతాన్ని రిసైక్లింగ్ చేయగా, 12 శాతాన్ని కాల్చివేశారు (incinerated). అంటే వృధాగా ఉన్న ప్లాస్టిక్లో 79 శాతం గోతుల్లో (land fills) ను పర్యావరణంలోను పేరుకుపోయి కాలుష్యాన్ని కలిగిస్తోంది. globeఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2050 నాటికి 1200 కోట్ల ప్లాస్టిక్ చెత్త పోగుపడిపోతుందని, ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని మనం వాడే ప్లాస్టిక్ వస్తువులు, చెత్త యాజమాన్య పద్ధతులను గురించి త్రీవంగా ఆలోచించాలని జార్జియా యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జెన్నా జంబెక్ పేర్కొన్నారు.

2.95652173913
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు