పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మంచు అడుగునా జీవజాలం ఉంటుందా?

జలచరాలన్నీ సరస్సు అడుగు భాగాన చేరి హాయిగా మనగలుగుతాయి.

భూభాగంలో మూడు వంతుల నీరు ఉంటుందని అందరికి తెలుసు అయితే ఈ నీటికి కొన్ని విశిష్టమైన లక్షణాలున్నాయి. వాటిలో రెండు ముఖ్యమైనవి. ఒకటి

  1. నీరు వేడిని గ్రహించుకొనే శక్తిని కల్గి వుండటం.
  2. అనగా దీని విశిష్తోష్టం చాలా ఎక్కువ.

అందువల్ల నీటిని కారు రేడియేటర్లలో, ఇంజన్ లలో విడుదలయిన వేడిని శోషించటానికి ఉపయోగిస్తారు. అలాగే ఒంటి నొప్పులను తగ్గించేందుకు వేడినీటి సంచులను వాడతారు. అయితే కారణం నీరు వేడిని గ్రహించిన పిదప నిదానంగా వేడిని కోల్పోతుంది. అయితే నీటి ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా తగ్గినపుడు నీరు వ్యాకోచిస్తుంది. అనగా శీతల దేశాలలో లేదా ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెంటిగ్రేడ్ కు తగ్గినపుడు నీరు వ్యాకోచించి మంచుగా మారి సాంద్రత తగ్గుతుంది. ఆ మంచు నీటి పై తేలుతుంది. నీటి పై తేలిన మంచు క్రమేపి గడ్డకట్టి పొరగా మారి చిన్న చిన్న సరస్సుల పైభాగాన్ని కప్పి వేస్తుంది. అయితే మంచు ఉపబంధకం కాబట్టి సరస్సులో మంచు కింద ఉన్న నీటి ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు తగ్గకుండా ఉంటుంది. అందువల్ల జలచరాలన్నీ సరస్సు అడుగు భాగాన చేరి హాయిగా మనగలుగుతాయి.

3.00294985251
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు