వేడివల్ల గాలి వ్యాకోచిస్తుంది. కనుక చిక్కదనం తగ్గి తేలికమవుతుంది. అందువల్ల పైకిలేస్తుంది. అంతకు మందు ఆ ప్రదేశంలో ఉన్న చల్ల గాలిని తోసుకుంటూ వేడిగాలి పైకి వెళుతుంది. కనుక మంటపై నుంచి చుస్తున్నప్పుడు కదిలి పోతున్న వాయు స్తంభంలో నుంచి చూస్తూన్నామన్న మాట. ఈ గాలి కదలికలు కూడా అంతటా ఒకే విధంగా ఉండవు. గాలి చక్కదనం వివిధ ప్రదాశాలలో వేరు వేరుగా ఉంటుంది. ఒకే ప్రదేశంలో కూడా క్షణ క్షణానికి గాలి చిక్కదనం పారుతూ ఉంటుంది.
కాంతికిరణం ప్రయాణం చేస్తున్న మార్గంలో చిక్కదనంలో ఎక్కడ మార్పు ఉంటే అక్కడ పక్కకి వంగుతూ ఉంటుంది. దీనిని వక్రీభవనం అంటారు. ఈ కారణంగానే ఆ ఉష్ణవాయు స్తంభం వెనుకవున్న వస్తువులు కదితిపోతున్నట్లు కనిపిస్తాయి.
మంట మండుతున్నప్పుడే కాదు. మే నెలలో, మిట్ట మధ్యాహ్నం, తారురోడ్డు పైన, ఇసుక దిబ్బల మీద గాలి వేడెక్కి పైకి పోతున్నప్పుడు కూడా దాని గుండా చూసిన వస్తువులు, కదిలి పోతున్నట్లు కనిపిస్తాయి.