పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మట్టి

2016 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మృత్తికా సంవత్సరంగా ప్రకటించిన విషయాన్ని మనం మరువవద్దు.

పిల్లలూ!

oct5“ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే పెరిగాము. ఈ మట్టిని మించిన దైవం లేదు. మట్టే మెతుకురా, మట్టే బతుకురా.” అంటూ ‘రైతు కుటుంబం’ అనే సినిమాలో డా. సి. నారాయణ రెడ్డి గారు రచించిన గీతం నేటికి అర్థవంతంగా ప్రజల ఆదరణ పొందింది. మట్టి లేదా నేల లేదా పొలం అనేవి ఒకే అర్థానిచ్చే భూమి పై పొర. మనకు చర్మం ఉన్నట్టే భూమి అనే దేహానికి మట్టే చర్మంగా భావించగలము, భూభౌతిక శాస్త్రం (Geophysics) ప్రకారం భూమిలో నాలుగు పొరలున్నాయి. అవి పై నుంచి లోపలి వైపునకు 1. భూ పటలం (), 2. మాంటిల్ (), 3. బాహ్య కోర్ (), 4. అంతరకోర్ (). మనం మాట్లాడుకుంటున్న మట్టిపొర భూ పటలం లో ఉన్న అతి బాహ్యపొర మొత్తం క్రస్ట్ మందం సుమారు 100 కి.మీ. ఉంటుంది. అయినా దానిలో పైనున్న ప్రతి పలుచని మట్టిపొర మందం సగటున మీటరు కూడా ఉండదు. కొన్ని ప్రాంతాల్లో మట్టిమందం రెండు, మూడు అంగుళాలు ఉండగా చెరువులు, కుంటలు, డెల్టా ప్రాంతాల్లో, సముద్ర తీరాలను, నదీతీరాల్లోను ఉండే నేల మందం రెండు మూడు మీటర్లు కూడా ఉంటుంది.

ఈ మట్టిలోనే చెట్లు, పైర్లు, గడ్డి, తడి, మన పాముల్లాంటి ఎన్నో జంతుజీవులు ఉంటున్నాయి. మట్టిలో ఉన్న సహజ సిద్ధమైన సన్నని రాతి రేణువులకు అంటుకొని కళేబరాల పీలికలు, జీవజాతుల అవశేష శకలాల ముక్కలు అంటుకొని ఉండడం వల్ల గాలిదూర గల సందులు ఉంటాయి. కొన్ని సందుల్లో నీరు నిల్వ ఉంటుంది. అందుకే మట్టి చెమ్మగా ఉంటుంది. మట్టి చెమ్మలో ఎన్నో లవణాలు కరిగి ఉండడం వల్ల మొక్కలకు కావలసిన సారం, పోషణ అందుతాయి. మట్టి మెత్తగా, రేణువుల రూపంలో ఉండడం వల్ల చెట్ల వేర్లు లేపలికి చొచ్చుకుపోగలవు. ఎన్నో జీవరాశులు మట్టిలో ఉన్నాయి. పరిణామక్రమంలో సముద్రాల్లోనే తొలి జీవకణం ఏర్పడ్డా, నేడు ఎన్నో భౌతిక రసాయనిక పరిణామాలు భూమి మీద, వాతావరణంలో ఏర్పడ్డం వల్ల కోట్లాది జీవరాశులు మట్టిలో ఉంటాయి. oct6ఓ అంచనా ప్రకారం ప్రతి ఘ.సెం.మీ. (ఒక గోళీకాయ సైజు) మట్టిలో సుమారు లక్ష వరకు సూక్ష్మజీవులుంటాయి. అయితే నేల pH లో, ఇతర భౌతిక రసాయనిక సంఘటనాన్ని (Chemical Composition) బట్టి ఈ విలువ 10 నుంచి 10 కోట్ల వరకు ఉంటుంది. జీవరాశుల ఉనికికి, పంటలు, పొలాల పెరుగుదలకు, అజవుల సంపదకు, వర్షపు నీరు చేరేలా జల్లెడ పట్టేందుకు మట్టి ఉపకరించుతుంది. అంతేకాదు మన గృహ సముదాయాలు, పెద్ద పెద్ద నిర్మాణాలను నేల (మట్టి) అడుగుల ఉన్న గట్టి, రాతిపొర (మొరం) వరకు పట్టి ఉంచేది కూడా మట్టినే. మన పెదాలు స్ట్రా ను పట్టుకున్నట్టు భవన స్తంభాలను, చెట్ల కాండాలను, కరెంటు స్తంభాలను, శిలా విగ్రహాలను, ఆనకట్టల పునాదులను మట్టి గట్టిదనమే పట్టుకొని ఉంటుంది.

ప్రపంచంలో అందర్నీ కలిపివుంచే దీర్ఘకాలిక, రసాయనిక, ధాతువు మట్టి మాత్రమే. ఓ ఉదాహరణ చెబుతాను. నేను బాగా ఆరోగ్యంగా ఉంటే మరో 30, 40 సంవత్సరాలు బ్రతుకాలనుకొంటున్నాను. ఆ తర్వాత మరణాంతరం నా శరీరాన్ని ఏ వైద్య కళాశాలకు దానం చేస్తే అక్కడ విద్యార్థులు వాడేసిన తర్వాత మట్టిలో శరీరపు ముక్కల్ని పాతుతారు లేదా దహనం చేస్తారు. నా శరీరంలో ఉన్న ట్రిలియన్ల వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ అణువులలో అవీ భాగమైపోతాయి. నాలో ఉన్న హైడ్రోజన్ అంతా నీటి ఆవిరిగా మారిపోతుంది. గాల్లో ఉన్న నీటి ఆవిరి కలుస్తాయి. కొన్ని నేలలోని బోరునీళ్ళలో భాగమవుతాయి. మరి కొన్ని మా తాత కార్బన్ డై ఆక్సైడ్ తో కలిసి అందరికి సంయోగక్రియలో పాల్గొంటాయి. నా నత్రజని, నా భాస్వరం (Phosphorous), ఇనుము తదితర పదార్థాలు నేలలో కలిసిపోతాయి. వర్షాల సమయంలో నా ఇనుప అయాన్లు రాగి అయాన్లు, సముద్రంలో కలిసి దక్షిణ ఆఫ్రికా తీరంలో చేపల్లోకి వెళ్ళి వాటి ఎంజైముల్లో భాగమైపోతాయి. వాటిని తిన్న దక్షిణ ఆఫ్రికా ప్రజల శరీరంలోకి నా నీటి అణువులు ఇనుప అయాన్లు దూరి వారి రక్తంలో భాగమవుతాయి. ఈ విధంగా మట్టి, వాతావరణం, నీరు, ఇవన్నీ మానవజాతిని, జీవరాశిని వసుదైక కుటుంబ చట్రంలోని అంతర్భాగాలుగా మారుస్తున్నాయి. మనకు ఆహారాన్ని, తాగునీటిని ఇస్తున్న గొప్ప ప్రకృతి వనరు మట్టి. మట్టిని ప్రేమిద్దాం. మట్టిని కాపాడుకుందాం. 2016 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మృత్తికా సంవత్సరంగా ప్రకటించిన విషయాన్ని మనం మరువవద్దు.

ఆధారం: ప్రొ. ఎ. రామచంద్రయ్య

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు