హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / మధ్యాహ్నం ఉన్నంత తీవ్రంగా సూర్యుని ఎండ తీవ్రత ఉదయం, సాయంత్రాలు ఉండవెందుకు?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మధ్యాహ్నం ఉన్నంత తీవ్రంగా సూర్యుని ఎండ తీవ్రత ఉదయం, సాయంత్రాలు ఉండవెందుకు?

సూర్యుని కాంతిని గాలిలో అణువులు ఎక్కువగా నిలుపుదల చేయడం దీనికి కారణం.

sep12భూమి గోళాకారం (spherical shape)లో ఉంది. భూమిని అంటుకుని ఉన్న భూవాతావరణం కూడా గోళాకారంలోనే ఉంది. అంటే బత్తాయి పండులోపలి గుజ్జుభాగం భూమి అనుకుంటే బత్తాయి తోలు (peel) భూవాతావరణం అన్నమాట. మనం ఓ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో మన తలపైన ఆకాశం (zenith)లో సూర్యుడు ఉంటే మధ్యాహ్నం (noon) అనీ మన ఎదురుగా క్షితిజ సమాంతర రేఖలో తూర్పున సూర్యుడుంటే ఉదయమనీ, పడమర ఉంటే సూర్యాస్థమయం అనీ అంటాము. భూవాతావరణాన్ని ఓ స్తిరమందం (uniform thickness) ఉన్న డొల్లగోళం (hollow sphere) అనుకుంటే సూర్యుని కాంతి వాతావరణంలో ఉదయం, సాయంత్రం ఎక్కువ దూరం ప్రయాణిస్తుందనీ, మద్యాహ్నం అంతే దూరం ప్రయాణించదనీ రేఖాగణితం ద్వారా ఋజువు చేయగలం. వాతావరణంలో ప్రయాణించే క్రమంలో సూర్యుని కాంతిని గాలిలో అణువులు ఎక్కువగా నిలుపుదల (dissipation or scattering) చేయడం వల్ల ఉదయం, సాయంత్రం ఎండ తీవ్రత తక్కువ. కానీ మధ్యాహ్నం ఎండ నిలుపుదల తక్కువ కాబట్టి మనల్ని ఎక్కువ ఎండ తీవ్రత చేరుతుంది.

ఆధారం: ప్రొ. రామచంద్రయ్య

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు