పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మనము - సైన్స్

మొదటినుంచి పుచ్చిన సైన్స్ అంతా పునాదిగా ఉంటేనే, కొత్త సైన్స్ ముందుకు సాగే వీలు ఉంటుంది.

newtonప్రపంచం పుట్టినప్పుడు సైన్స్ లేదు. అంటే, సైన్స్ అన్న మాట లేదు. ప్రపంచం పుట్టుకతోనే సైన్స్ మౌదలయిందనే విషయం ఈ మధ్యనే తెలిసింది. ప్రపంచం తీరును అర్థం చేసుకునే ప్రయత్నాలు మొదటి నుంచి జరుగుతున్నా, అప్పుడది సైన్స్ అని తెలియదు.

మనిషి మనుగడకు వేట అవసరమని అర్థమయింది. చెట్ల నుంచి తిండి దొరుకుతుందని కూడా అర్థమయింది. మనిషి వేటగాడుగా, తిండి వెతికే మనిషిగా కొనసాగాడు. అప్పుడు తనను తాను రక్షించుకోవాలన్న మరొక ధ్యాస మొదలవుతుంది. బ్రతుకు గుహలలో సాగింది. తరువాత మైదానాలలోకి వచ్చింది. అవసరాలు మారుతున్నకొద్దీ, పరిస్థితులు మారుతున్నకొద్దీ, ఆలోచనలు కూడా మారసాగాయి. ఆ క్రమంలోనే నిప్పు చేయడం చేతనయుంది. చక్రం కనుగొన్నారు. వ్యవసాయం మొదలయింది. ఇక కలిసి బతికే తీరు కూడా ఆరంభమయిన తరువాత నాగరికత అన్న పద్ధతి పుట్టింది. ఆ తరువాత ఎప్పుడో తమ తెలివి గురించి తమకు తెలిసింది.

ప్రస్తుతం సైన్స్ అంటే, పద్దతే వేరు. సైంటిస్ట్ లు కొందరు వేరుగా ఉంటారు. బోలెడంత ఖర్చుచేసి ఏదేదో చేస్తూ ఉంటారు. చిత్రంగా వాళ్లు చేసే పనులు మామూలు మనుషులకు అర్థంకావు. కొన్ని వెంటనే పనికిరావు కూడా. కనుకనే మనిషికి, సైన్సుకు మధ్యన కొంత వార వచ్చింది. కొంత ఖాళీ కనిపిస్తున్నది. సైన్స్ మనది కాదన్న భావం కనిపిస్తున్నది. కానీ పరిశోధనలన్నీ మనిషి కొరకే. ఈ సంగతి విప్పి చెప్పడం సైంటిస్టులకు కూడా చేతకావడం లేదు.

వంద సంవత్సరాల క్రింద ఎడ్విన్ హబుల్ అనే పరిశోధకుడు నూరు అంగుళాల వెడల్పు ఉండే టెలిస్కోపును తయారుచేశారు. విశ్వం లోతుల్లోకి తొంగిచూచి మరిన్ని వివరాలు తెలుసుకుంటానన్నాడు. ఆ వివరాలు తెలియకుండానే మనిషి బతికే వీలుంది. బతుకుతున్నాడు కూడా. ఈ మధ్యన ఎడ్విన్ బహుల్ పేరున మరొక టెలిస్కోపును అంతరిక్షంలోనే నిలబెట్టారు. అది విశ్వంలో మరింత లోతులకు చూచి మరిన్ని విషయాలు చెప్పుతుంది. మామూలు మనిషికి ఈ రకమయిన విషయాలు ఉంటాయన్న ధ్యాస కూడా అవసరం లేదు.

బోసాన్ లు అనే మాట కొన్ని వారాలపాటు పత్రికలలో టీవీలో బాగా వినిపించింది. అదేమిటో ఎవరికీ తెలియదు. ఇవాళ ఆ మాట ఎక్కడా వినిపించడం లేదు. పదార్థమంతా చాలా చిన్న కణాలతో కట్టబడి ఉందని కొందరికి తెలిసి ఉంటుంది. ఇంటిని ఇటుకలతో కడతారు. ఇటుకలను మట్టితో కడతారు. మట్టిలో రకరకాల కణాలు ఉంటాయి. అట్లాగే, మనము మన చుట్టూ ఉన్న పదార్థం కూడా కణాలతో తయారయి ఉంటుంది. మన శరీరం తయారయిన జీవకణాలు ఈ కణాలతో తయారయి ఉంటాయి. ఆ కణాలతో కొన్నింటి తీరు ఇంకా అర్థం కాలేదు. యూరప్ లో కొంతమంది కలిసి కణాలను గురించి పరిశోధిస్తున్నారు. అక్కడ ఒక్క క్షణం కొత్త రకం కణాలు కనిపించి మాయమయినట్టు అనుమానం వచ్చింది. జరిగింది అంతే. ఆ కణాలకు దైవ కణాలు అని పత్రికలలో పేరు పెట్టారు. దేవునిలాగే ఈ కణాలు అర్థం కాకుండా ఉన్నాయి. అసలు ఉన్నాయో, లేవో తెలియదు. సైన్స్ పరిశోధనలు ఈ పద్ధతిలో సాగుతుంటే, మరొకవైపు బతుకంతా సైన్సే అంటే నిజంగానే అర్థంకాదు.

బతుకుతో సూటిగా సంబంధం ఉండే సైన్స్ కూడా పెరుగుతున్నది. అందులోని సంగతులు కూడా అన్నీ మనకు అర్థం కావు. కూడికలు, తీసివేతలు మనందరికి ప్రతినిత్యం అలవాటయిన పనులే. అయినా, అవి లెక్కలు అన్న ధ్యాస ఉండదు. కొలతలు లేకుండా మనం బతకలేము. అయినా అవి లెక్కలు అన్న ధ్యాస ఉండదు. సైన్స్ సంగతి కూడా అంతే. మనం చేస్తున్న ప్రతి పనీ సైన్స్ కిందకే వస్తుంది. మనకు ఆ ధ్యాస ఉండదు.

సైన్సులో ప్రయత్నించి చేసే పరిశోధనలు కొన్ని ఉంటాయి. ఫలితాలను ముందే ఊహించి వాటికోసం పరిశోధనలు జరుగుతాయి. కొన్ని ఫలితాలు అనుకోకుండానే అందుతాయి. ఈ రెండు పద్ధతులను పక్కన పెడితే, ఈ పద్ధతులు వీలు కావడానికి కొన్ని రకాల పరిశోధనలు జరిగాయి. ఎన్నో ఫలితాలు తరువాతి పరిశోధనలకు తయారయి ఉందని చెప్పుకుంటే, ఇవాళ రసాయనశాస్త్రం ఉండే వీలే లేదు.

పదార్థం నిర్మాణం తీరు, పనిచేసే తీరు, అర్థం కాకుంటే భౌతిక శాస్త్రం లేదు. ఐజాక్ న్యూటన్ చెట్టుకింద కూచున్నాడట, ఆపిల్ పండు రాలి ఆయన తల మీద పడిందట. కనుకనే, ఆయన భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనుగొన్నాడట. ఇది చాలామందికి తెలిసిన కథ. ఎన్నో పండ్లు, మిగితా వస్తువులు, కింద పడుతూనే ఉన్నాయి. అందరూ ముందునుంచే అటువంటి విషయాలను గురించి ఆలోచిస్తున్నాడు. ఆపిల్ వడినప్పుడు అతని ఆలోచనలకు ఒక తోవ దొరికింది. ఆలోచనలు ఆ దారిలో సాగాయి. భౌతికశాస్త్రం మరింత ముందుకు నడిచింది. ఇవాళ ఒక పరిశోధకుడు ఒక మందు గురించి పరిశోధించే ప్రయత్నంలో ఉంటాడు. అతను సైన్స్ లో వెనుకకు వెళ్లి రసాయనాలు గురించి, వాటి పనితీరు గురించి అర్థం చేసుకుంటేనే ముందుకు సాగుతాడు. ఇక జీవుల గురించి ఇంకా బాగా తెలిసి ఉండాలి. రసాయనాలు జీవుల మీద పనిచేసే పద్ధతి గురించి అర్థమయి ఉండాలి. అంటే, మొదటినుంచి పుచ్చిన సైన్స్ అంతా పునాదిగా ఉంటేనే, కొత్త సైన్స్ ముందుకు సాగే వీలు ఉంటుంది.

ఆధారం: కె.బి. గోపాలం

3.01729106628
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు