పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మానవ మెదడు మేధస్సుకు చిహ్నం

మానవుడి విజయానికి ప్రధాన కారణం ఆలోచనా కేంద్రంగా ఎదిగిన మెదడు.

feb007.jpgజంతు ప్రపంచంలో ప్రకృతిని అంతో ఇంతో జయించగలిగింది మానవుడే. ఇతర జీవులను తన చెప్పుచేతులతో నియంత్రించగలిగింది మానవుడే. తన అవసరాలు తీర్చుకోవడానికి ప్రకృతినాశనం చేసేది కూడా మనిషే. దీనికి ప్రధాన కారణం ఆలోచనా కేంద్రంగా ఎదిగిన మెదడు. అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో అతి సంక్లిష్టంగా రూపుదాల్చింది. మానవుని మెదడుకు పోటీగా కంప్యూటర్ ఆవిష్కరణలు జరిగినా మెదడు స్థాయిని చేరుకోలేదు. ఎందుకంటే అవి మనిషి మెదడు చేసిన సృష్టి కదా!

అతి సున్నితమైన మెదడు అనేక నాడీ కణాల సమూహం. అందుకే ఇది కపాలం (CRANIUM) లో భద్రంగా ఉండేలా రూపుదిద్దుకుంది. నాడీ వ్యవస్థలో మెదడు అతి ప్రధానమైంది. శరీరం లోపల, వెలుపల జరిగే మార్పులకు స్పందిస్తుంది. ఉదాహరణకు కడుపునొప్పి ద్వారా జీర్ణవ్యవస్థలోని ఇబ్బందిని తెలుపుతుంది. తోవలో నడిచేటపుడు పాము కనిపిస్తే ఆగిపోతాం ఎందుకు? కన్ను ద్వారా సేకరించిన సమాచారం మెదడుకి చేరుతుంది. ముందుకు వెళ్లవద్దని మెదడు కాళ్లను ఆదేశిస్తుంది. అందుకే ఆగిపోతాం.

మెదడు అనేక కోట్ల నాడీ కణాలతోనూ, సహాయక కణాలతోనూ నిర్మింపబడింది. సహాయ కణాలు నాడి కణాలకు ఆహారాన్ని, ఆక్సిజన్ ని సరఫరా చేస్తాయి. అలాగే వ్యర్థ పదార్థాలను, కార్బన్ డై ఆక్సైడ్ ను విసర్జించడానికి ఉపయోగపడుతాయి. మెదడును ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడుగా విభజించవచ్చు. ముందు మెదడును మస్తిష్కం అని కూడా అంటారు. ఇది పెద్దదిగా ఉంటుంది. మధ్యలో లోతైన గాడి వల్ల రెండుగా విభజించబడుతుంది. వీటిని కుడి, ఎడమ మస్తిష్క గోళార్థాలు అంటారు. మస్తిష్కగోళార్ధాల వెలుపలి భాగం బూడిద రంగులోనూ, లోపలి భాగం తెలుపురంగులోనూ ఉంటుంది. కణదేహాల సమూహాల వల్ల బూడిదరంగు వస్తుంది. నాడీ అక్షాలలోని మైలిన్ తొడుగు వల్ల లోపలి భాగం తెలుపురంగులో కనిపిస్తుంది. కుడి మస్తిష్కగోళార్ధము ఎడమ అర్థ శరీరాన్ని నియంత్రిస్తుంది. ఎడమ మస్తిష్కగోళార్ధము కుడి అర్ధ శరీరాన్ని నియంత్రిస్తుంది. పక్షవాతం వచ్చిన వారిలో ఎడమ చేయి, పెదవి ఎడమ వైపు లాగడం, ఎడమ కాలు లేదా కుడిచేయి చచ్చుపడటం, పెదవి కుడివైపుకులాగడం వంటివి చూసే ఉంటారు. ఎడమ మస్తిష్కగోళార్ధము దెబ్బతింటే కుడి శరీర అర్ధభాగం పనిచేయదు. కుడి మస్తిష్కగోళార్ధము దెబ్బతింటే ఎడమ శరీర అర్ధభాగం పక్షవాతంకు గురవుతాయి.

మస్తిష్కం అనేక ముడతలు, గాడులు, గట్లుగా కనిపిస్తుంది. అందువల్ల మస్తిష్క వైశాల్యం పెరుగుతుంది. ఎక్కువ సమాచారం నిలువ చేసుకోవడానికి ఈ ఏర్పాటు జరిగింది.

ఇక్కడ ఏ, బి రేఖలను కొలిస్తే ఏది పొడవుగా ఉంటుంది. నిస్సందేహంగా బి అని చెప్పవచ్చు. (స్వయంగా దారంతో కొలవండి)

బీ లో గాడులు గట్లు ఉండటం వల్ల వైశాల్యం పెరిగి సమాచారం ఎక్కువ నిలవ చేయడానికి వీలైంది.

మస్తిష్కంలో సమాచారాన్ని గ్రహించి విశ్లేషించడానికి అనేక జ్ఞాన కేంద్రాలుంటాయి. మస్తిష్క దిగువ భాగం ద్వారగొర్ధం ఇది కోపం బాధ, ఆవేశాలను నియంత్రిస్తుంది.

మధ్యవెదడులో నాడీకణాలు గుంపుగా ఉంటాయి. ఇవి శరీర కండరాలను వాటి కదలికను నియంత్రిస్తాయి. వెనుక మెదడు, అనుమస్తిష్కము, మెదడు కాండముగా విభజించవచ్చు.

అనుమస్తిష్కము నియంత్రిత చలనాలు (మెదడు ఆదేశంతో జరిగేవి, చేతులు, కాళ్లు కదల్చడం) శరీర సమతా స్థితిని నిర్వహిస్తుంది. మద్యం తీసుకున్నవారు తూలుతూ నడుస్తారు. ఆల్కహాలు అనుమస్తిష్కాన్ని పనిచేయనీయకపోవడమే దీనికి కారణం.

మెదడు కాండం ఫాన్స్ వెరోలి, మజ్జముఖము వెన్నుపాముగా ప్రయాణిస్తుంది. శ్వాస క్రియ, హృదయ స్పందన, రక్తపీడనం వంటి ముఖ్యమైన చర్యలు మజ్జాముఖం ఆధీనంలో ఉంటాయి.

మెదడులో పది బిలియన్లకు పైగా (1 బిలియన్ = వంద కోట్లు) నాడీ కణాలు ఉంటాయి. మామూలు కణాలకి, నాడీ కణాలకి ఆకారంలో, చేసే పనిలో తేడా కనిపిస్తుంది. వార్తలను తీసుకువెళ్తుంది కాబట్టి చాలా పొడవుగా ఉంటుంది. ఒక్కో నాడీ కణం తల నుంచి కాలి బొటన వేలి వరకు వ్యాపించి ఉండచ్చు. నాడీ కణం కొనను ఏదయినా తాకినా వేడి తగిలినా ఆకస్మిక మార్పు కనిపిస్తుంది. అతి వేగంగా ఆ వార్త మెదడును చేరుతుంది, సామాన్యంగా వార్త ప్రసార వేగం గంటలకు 320 కి.మీ ఉండచ్చు. నాడీ సందేశం తల నుంచి కాలి వేలి వరకు 1-30 సెకన్ లలో ప్రయాణిస్తుంది.

మొత్తం శరీర బరువులో మెదడు బరువు 2 శాతం మాత్రమే. ఆక్సిజన్ ను మాత్రం 20 శాతం పైగా మెదడు వినియోగించుకుంటుంది. శక్తి కోసం మెదడు పూర్తిగా గ్లూకోజ్ మీదనే ఆధార కు పడుతుంది. కొన్ని నిమిషాలు ఆక్సిజన్ అందకపోతే మెదడు దెబ్బతిని పక్షవాతం రావచ్చు. మరణానికి దారి తీయవచ్చు. ఆహారం కూడా ముందే మెదడుకి అందుతుంది.

నాడీ కణాలకు విభజన చెందే శక్తి లేదు. పిండ డు దశలో ఏర్పడ్డ నాడీ కణాల సంఖ్యే అటుఇటుగా చివరి వరకు ఉంటుంది. పరిమాణంలో మాత్రమే పెరుగుదల కనిపిస్తుంది. అందుకే పోలియో వచ్చిన వారిలో దెబ్బతిన్న మెదడు ప్రాంతం బట్టి వైకల్యం శాశ్వతంగా కాలు లేదా చేతికి వస్తుంది.

వృద్ధాప్యం వచ్చే కొద్ది నాడీ కణాలు నశించి జ్ఞాపక శక్తి తగ్గడం, దృష్టి మందగించడం, వినపడకపోవడం ము చూడవచ్చు. జ్ఞాపక శక్తి పెరగటానికి మా మందు య మంచిదంటే మా మందు గొప్పదనే ప్రకటనలు మీరు చూసే ఉంటారు. నిజంగా ఇవి జ్ఞాపక శక్తిని పెంచుతాయా? ఇక్కడే మనకు శాస్త్రీయ ఆలోచన అవసరం. ఆలోచించండి! భావాలను, ఉద్దేశాలను లు ఇతరులకు అందజేయడం వల్ల మానవుడు అత్యున్నతమైన జాతిగా రూపొందాడు. మానవ మస్తిష్కం ఆలోచనలు కాలా ప్రపంచ శాంతికి పర్యావరణక పరిరక్షణకు తోడ్పడవచ్చు. ప్రపంచ వినాశనానికి దారి తీయవచ్చు. దాని నిర్ణయించవలసింది ఈతరం మానవుడే.

ఆధారం: డాక్టర్ వీరమాచినేని శరత్ బాబు.

2.99204244032
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు